చీరకట్టు ఆత్మవిశ్వాసానికి, హుందాతనానికి ప్రతీకగా చూపుతూ సెలబ్రిటీలు రోల్‌మోడల్స్‌గా నిలుస్తున్నారు. కార్పొరేట్ ఉద్యోగమైనా పార్టీలో ప్రత్యేకత కోరుకున్నాచీరకట్టుకు బిగ్ బెల్ట్ జత చేసి బ్రైట్‌గా వెలిగిపోతున్నారు. తమదైన మార్క్‌ను పవర్‌ఫుల్‌గా చూపుతున్నారు.
ఇటీవల అంబానీ కుటుంబ సభ్యుల నివాసంలో జరిగిన ఓ వేడుకలో క్రికెట్ దిగ్గజాలు పాల్గొన్నారు. ఈ వేడుకలో డిజైనర్లు శంతను అండ్ నిఖిల్ చేసిన కస్టమైజ్‌డ్ శారీ డ్రేప్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కొత్తగా మెరిశారు. చీర కట్టు కూడా ఆమెనో క్రీడాకారిణిగా ఆత్మవిశ్వాసం తొణికిసలాడేలా చూపుతోందా అనిపించేలా ఉంది.
నారింజ, నలుపు రంగు కాంబినేషన్‌లో గల చీరను ఫిటెడ్, హైనెక్ మోడర్న్ బ్లౌజ్‌తో స్టైల్ చేసింది. నల్లని కార్సెట్ బెల్ట్‌తో లుక్‌ని శక్తిమంతంగా మార్చింది. జుట్టును బన్‌గా సెట్ చేసి, ఆభరణాలను తక్కువగా ధరించి లుక్‌ను పూర్తి చేసింది. ఈ లుక్ ఆధునిక పవర్ డ్రెస్సింగ్‌లో ఒక మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు.


