వెలుగులతో రంగులు మార్చే భూమి..! | Tour Tips: Spiti Valley in Himachal Pradesh | Sakshi
Sakshi News home page

వెలుగులతో రంగులు మార్చే భూమి..!

Mar 2 2026 4:47 PM | Updated on Mar 2 2026 4:51 PM

Tour Tips: Spiti Valley in Himachal Pradesh

హిమాచల్‌ ప్రదేశ్‌లో ఉన్న స్పితి వ్యాలీ అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది మంచుతో నిండిన పర్వతాలు కాదు వెలుగు, నీడల మధ్య నడిచే ఒక నిశ్బబ్ద నాటకం. మధ్యాహ్నం వెలుగుల్లో భారీ పర్వతాలకు ఒక కొత్త రంగు వస్తుంది. సాయంత్రం వెలుగుల్లో మరో రంగు అక్కడ సందడి చేస్తుంది. 

ఎడారిలా కనిపించే ఈ భూమిలో ప్రకృతి భాషను అర్థం చేసుకుంటే ఇక్కడి అందాల వెనక భావాలు కూడా అర్థం అవుతాయి. ఇక్కడి ప్రయాణం అనేది నెమ్మదిగా మనసును కబ్జా చేసే ఒక చక్కని పాటలోని సాహిత్యంలా ఉంటుంది. లోయల మధ్యలో వెలుగు నీడల ఈ ఆటను గమనిస్తే ప్రతీ గంట ఒక పెయింటింగ్లా ఉంటుంది. 

సందర్శనీయ స్థలాలు
హిమాచల్‌ ప్రదేశ్‌లోని లాహోల్‌ స్పితి జిల్లాలో ఉండే స్పితి వ్యాలీలో ఎన్నో అందమైన సందర్శనీయ స్థలాలు ఉన్నాయి. అందులో కీ మోనాస్టరీ, చంద్రతాల్‌ లేక్, కిబ్బర్‌ గ్రామం ఇవన్నీ చూస్తే మనం చూస్తున్నది సీనరీకాదుంకాలమే నిశ్బబ్దంగా సాగుతోంది అనిపిస్తుంది. రోడ్డుపై వచ్చే ప్రతీ మలుపు ఒక సోస్ట్‌కార్డులా ఉంటుంది.

హైదరాబాద్‌ నుంచి ఎలా చేరుకోవాలి
హైదరాబాద్‌ నుండి ఢిల్లీకి ఫ్లైట్‌ లేదా రైలులో వెళ్లవచ్చు. అక్కడి నుంచి మనాలీకి రోడ్డు జర్నీ ప్రారంభించవచ్చు. ఇక మనాలిలో మీకు నచ్చినంత టైమ్‌ స్సెండ్‌ చేసి స్పితీ వ్యాలీకి క్యాబ్‌ లేదా లోకల్‌ ట్రాన్స్‌పోర్టుతో అందమైన పర్వతాలను చూస్తూ చేరుకోవచ్చు. ఈ ప్రయాణంలో గమ్యస్థానం కన్నా ప్రయాణ అనుభవమే జీవితాంతం గుర్తుండి΄ోతుంది. 

(చదవండి: హోళీ..కలర్‌ఫుల్‌ టూర్‌ కోసం..ఈ పర్యాటక ప్రాంతాలకు వెళ్లాల్సిందే..!)

Advertisement
 
Advertisement
Advertisement