ప్రేమకు ఎక్స్‌పైరీ అంటూ ఉండదు. ఏ వయసులోనైనా కాసింతా ప్రేమ, ఆదరణ కావాలనే అనుకుంటాం. ప్రేమ అనే పదంతోనే కదా ఏ బంధమైన పెనవేసుకునేది. యంగ్‌గా ఉన్నప్పుడే ప్రేమ, పెళ్లి కాదు, మలి వయసులోనూ కావాలి ఓ తోడు. అయితే మలిసంధ్యలో ఉండే ప్రేమ అత్యంత ఆత్మీయమైనది, స్నేహ మాధుర్యానికి మించినది. దాన్నే హైలెట్ చేసింది ఈ మ్యాచ్ మేకింగ్ ఈవెంట్. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది.
ఇన్‌ఫ్లుయెన్సర్ షెనాజ్ ట్రెజరీ ఈ వీడియోని నెట్టింట షేర్ చేశారు. అది 60,70, 80 ఏళ్ల లోపు వారి కోసం రూపొందించిన మ్యాచ్ మేకింగ్ ఈవెంట్ అని రాసుకొచ్చింది. ఆ కార్యక్రమాన్ని చూడటానికి వెళ్లి కళ్లనీళ్లు ఆగలేదంటోంది. వాళ్లంతా టీనేజర్ల వలే నవ్వుతూ ఉండటం చూసి తాను ఒక విధమైన ఆనందం, భావోద్వగంతో ఉక్కిరిబిక్కిరి అయినట్లు పేర్కొంది.
అక్కడ గదుల్లో చాలామంది భాగస్వాములును కోల్పోయారని, మరికొందరూ విడాకులు తీసుకున్న వాళ్లని తెలిపింది. అయితే అందరూ కలిసి కూర్చొని నవ్వుకుంటూ కనిపించిన విధానం తాము కోల్పోయిన ప్రేమ, తోడు ఏదో పొందాలన్న ఆశ వారి ముఖాల్లో స్పష్టంగా కనిపించిందని చెప్పుకొచ్చింది.
అయితే ఈ కార్యక్రమం మతం, కులం, అంతస్థులతో సంబంధం లేకుండా జరగడం విశేషం. కొందరు స్వేచ్ఛగా మాట్లాడుకుంటూ కనిపిస్తే..మరికొందరు సిగ్గుపడిపోతూ కబుర్లు చెప్పుకుంటున్న వాళ్లని చూస్తే మనసు ఆనందంతో పవరశించిపోయిందంటూ ఉద్విగ్నంగా రాసుకొచ్చిందామె పోస్ట్‌లో. వాళ్లంతా పిల్లల పెంపకం, బాధ్యతలలో తలమునకలై, తమకంటూ వ్యక్తిగత ఆనందానికి చోటు దొరకక, కనీసం మలి వయసులోనైనా పొందాలని వచ్చిన అత్యంత యంగ్ సీనియర్ సిటిజన్లుగా అని పేర్కొంది.
ఈ కార్యక్రమం వారికి కొత్త ప్రేమనే కాదు..ఆ వయసు వాళ్లతో కనెక్ట్ అయ్యే ఓ గొప్ప అవకాశం కూడా ఇది. నెటిజన్లు సైతం ఈ వయసులో అలా ధైర్యంగా ముందుకొచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా గ్రేట్‌అంటూ ప్రశంసించారు. అందరూ తమను కూడా ఇది భావోద్వేగానికి గురించేసిందంటూ పోస్టులు పెట్టారు. అంతేగాదు ప్రేమకు వయోపరిమితి ఉందనే నమ్మకానికి ఈ ఘటనే అతి పెద్ద సవాలు అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: ఏడేళ్లుగా నిలబడే ఉన్న సాధువు..! నిద్రపోవడం ఎలా అంటే..)


