కుంభమేళ, మాఘమేళ వంటి మహోత్సవాల్లో ఆధ్యాత్మికతకు సంబంధించి ఎన్నో ఆసక్తికర కథల కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి, విస్మయానికి గురిచేస్తాయి కూడా. గొప్ప గొప్ప మేధావులు, మహా సంపన్నులు ఇలాంటి కుంభమేళాల్లో సాధువులుగా కనిపించిన ఘటనలు కూడా చూశాం. మరొకరు ఏకంగా తలపై మొక్కలను పెంచడం, పావురాల బాబా వంటి ఎన్నో విచిత్రాలను చవిచూశాం. భక్తి, ఆధ్యాత్మికతల గొప్పదనం ఈ మహోత్సవాలు ఎలుగెత్తి చాటుతున్నాయా అన్నట్లుగా ఉంటాయి వింత ఘటనలు. అలాంటి తరహాలోనే ఈ ఏడాది జరగుతున్న మాఘమేళాలో కనువిందు చేసింది. అదేంటంటే..
ప్రతి ఏడాది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో త్రివేణి సంగమం (గంగా, యమునా, సరస్వతి నదుల సంగమం) వద్ద జరిగే ఒక మహత్తర ఆధ్యాత్మిక ఉత్సవమే ఈ మాఘమేళా. ఇది మకర సంక్రాంతి నుంచి మహాశివరాత్రి వరకు కొనసాగుతుంది. ఈ కాలంలో లక్షలాది మంది భక్తులు పవిత్ర స్నానాలు చేసి, దీక్షలు చేపట్టి, మోక్షం కోసం ప్రార్థనలు చేస్తారు. దీన్ని అచ్చం కుంభ మేళలాంటి చిన్నకుంభమేళాగా పేర్కొనచ్చు.
ప్రతి ఏటా జనవరిలో మొదలవుతుంది. ఈ ఏడాది జనవరి 3న మొదలైన ఈ మాఘమేళాలో ఒక 26 ఏళ్ల సాధువు అందరి దృష్టిని అమితంగా ఆకర్షించాడు. ఎందుకుంటే అతడు గత ఏడేళ్లు అస్సలు కూర్చోలేదు, పడుకోలేదట. శంకర్‌పురిగా పిలిచే ఈ సన్యాసి బిహార్‌లోని సీతామర్హి జిల్లాకు చెందిన యువ సన్యాసి. ప్రస్తుతం జరుగుతున్న మాఘమేళాలో నిరంతరం ఒక కాలిపై నిలబడి కనిపించిడంతో అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది.
అయితే పడుకోవడం కోసం తన తలను ఒక చెక్కకు ఆన్చుకుని అలానే పడుకుంటారట ఆ సన్యాసి. తినడం నుంచి ఇతర రోజువారీ కార్యక్రమాలన్ని ఆ భంగిమలోనే చేస్తారట. ఆయన నైమిశారణ్యానికి చెందినవారట. అక్కడ సుమారు 88వేల మంది రుషులు ఉంటారనేది భక్తుల విశ్వాసం. అలాంటి పుణ్యభూమిలో తాను జన్మించానని, అక్కడే తనకు ఓ ఆశ్రమం కూడా ఉందని ఈ శకంర్‌పురి సన్యాసి చెబుతున్నారు.
ఇలా ఒంటి కాలిపై ఎందుకంటే..
ఆ నైమిశారణ్యంలో ఉన్నప్పుడే తనకు ఇలా ఒంటికాలినై నిలబడాలనే ఆలోచన వచ్చిందట. అప్పటి నుంచే ఈ భంగిమలో ఉన్నట్లు తెలిపారు ఆ సాధువు. ఆయన ఆరేళ్ల వయసులోనే సాధువుగా మారారట. ఎప్పుడైనా కూర్చొన్నారా అని అడిగితే..ఏడేళ్లుగా ఇలా నిలబడే ఉన్నాని చెప్పి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు.
ఊయలలాంటి చెక్క నిర్మాణంపై తల ఆనించి నిద్రపోతానని, ఆహారం, నీరు నుంచి ప్రతీ పని ఈ భంగిమలోనే చేస్తానని చెప్పారు. కాగా, జనవరి 3న ప్రారంభమైన ఈ మాఘమేళ 44 రోజులపాటు సాగే మహత్తర ఉత్సవం. ఇది ఫిబ్రవరి 15న ముగుస్తుంది. ఈ సమయంలో లక్షలాది మంది భక్తులు ఇక్కడి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించి, మోక్షం కోసం పూజలు చేస్తుంటారు.
(చదవండి: రెస్టారెంట్ మేనేజర్‌గా ఇస్రో శాస్త్రవేత్త..! సరదా సంభాషణ..)


