లైంగిక ఆరోపణలు.. అవిముక్తేశ్వరంది సరస్వతిపై కేసు | Case registered against Avimukteshwar Saraswati | Sakshi
Sakshi News home page

లైంగిక ఆరోపణలు.. అవిముక్తేశ్వరంది సరస్వతిపై కేసు

Feb 21 2026 7:43 PM | Updated on Feb 21 2026 7:56 PM

Case registered against Avimukteshwar Saraswati

ఉత్తరప్రదేశ్ లో మైనర్ బాలికలపై లైంగిక వేధింపుల కేసులో స్వామి అవిముక్తేశ్వరంది  సరస్వతితో పాటు ఆయన శిష్యడు ముకుందానంద గిరిపై  ప్రయాగ్ రాజ్ ఫోక్సో ప్రత్యేక కోర్టు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. దానితో లోతైన విచారణ జరపాలని పోలీసులకు తెలిపింది. సెక్షన్ 173 కింద ఆయనపై కేసు నమోదు చేసింది. జ్యోతిష్య పీఠం కేసులో  మైనర్లుపై లైంగిక దాడి కేసులో ఇద్దరు మైనర్ల వాంగ్మూలాలను కోర్టు స్వీకరించింది. 

అయితే ఈ ఆరోపణలపై అవిముక్తేశ్వరానంది స్వామి స్పందించారు. ఈ ఆరోపణలు అవాస్తవమని వాటిని కోర్టులో చట్టపరంగా ఎదుర్కుంటానని అన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేశారని తెలిపారు. ఈ కేసు విచారణ ఆలస్యం చేయవద్దని వీలైనంత త్వరగా విచారణ చేపట్టాలని అన్నారు. అయితే ఈ పోలీసుల దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరగాలన్నారు.

అయితే జనవరి 28న అవిముక్తేశ్వరంద్ సరస్వతి ఆశ్రమంలో మైనర్ పిల్లలపై లైంగిక వేధింపులకు గురవుతున్నారని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఫిబ్రవరి 13న కోర్టు నిందితుల వాంగ్మూలాన్ని రికార్డు చేసింది. తాజాగా నిందితునిపై కేసు నమోదు చేసి విచారించాలని ఆదేశించింది. కాగా సత్యాన్ని తెలియజేయడానికి ప్రయాగ్ రాజ్ నుండి వారణాసిలోని విద్యామఠం వరకూ పాదయాత్ర చేపడాతానని అశుతోష్ బ్రహ్మచారి తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement