ప్రయాగ్‌రాజ్: యూపీలో విమానం ప్రమాదం జరిగింది. ప్రయాగ్‌రాజ్‌లో ఎయిర్‌ఫోర్స్ విమానం నగర మధ్యలో ఓ చెరువులో కుప్పకూలింది. స్వల్ప గాయాలతో ఇద్దరు పైలట్లు బయటపడ్డారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విద్యా వాహిని పాఠశాల సమీపంలో ఈ ఘటన జరిగింది. విమానం ఒక్కసారిగా కిందకు పడిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సాంకేతిక లోపం కారణంగానే ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
విమానం నీటిలో మునిగిపోగా.. స్థానికులు ట్రైనీ పైలట్‌లను కాపాడారు. ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం బురద నీటిలో ఉన్న విమాన శకలాలను వెలికితీసే ప్రక్రియను బృందాలు ప్రారంభించాయి.


