ఫిట్ నెస్, ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యం. అయితే రకరకాల కారణాల వల్ల ఈ రోజుల్లో చాలామంది ఫిట్ నెస్, ఆరోగ్యంపై తగినంత శ్రద్ధ చూపలేకపోతున్నారు. కొంతమంది సినిమా సెలబ్రిటీలు మాత్రం తమ ఫిట్ నెస్, ఆరోగ్యకరమైన జీవనశైలితో ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్నారు. వారెవరో, వారి ఆరోగ్య రహస్యాలేమిటో తెలుసుకుందాం.
దీపికా పదుకోన్, అక్షయ్ కుమార్, శిల్పా శెట్టి వంటి సినీ తారలు తమ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ సెలబ్రిటీలు శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోడానికి, ఆరోగ్యాన్ని కా΄ాడుకోడానికి అసలు ఏం తింటారు, ఏం చేస్తారో తెలుసుకుందాం.
శిల్పాశెట్టి.. ఒకప్పుడు భారత సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన నటి శిల్పాశెట్టి. ఈ మంగుళూరు భామ తరచు తన ఫిట్ నెస్ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. శిల్పా శెట్టి ఆహారపు అలవాట్లు, వ్యాయామ నియమాలు చాలా మందికి స్ఫూర్తినిస్తున్నాయి. దాదాపుగా ఐదుపదుల వయస్సులో కూడా శిల్పాశెట్టి ఫిట్ గా ఉండటానికి ఆమె ఆహారపుటలవాట్లే కారణం.
ఉదయాన్నే నిమ్మరసం, తేనె కలిపిన గోరువెచ్చని నీరు తాగే శిల్పాశెట్టి.. బ్రేక్ ఫాస్ట్ గా ఓట్స్, పోహా, పప్పు చీలా వంటి ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటుంది. లంచ్‌లో బ్రౌన్ రైస్, కూరగాయలు, పండ్లు, చికెన్, చేపలు వంటివి తీసుకుంటుంది. చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉంటానంటుంది శిల్పాశెట్టి.శిల్పాశెట్టి ఆరోగ్య యోగం: రెగ్యులర్‌గా యోగా చేయడంతోపాటు వెయిట్ ట్రైనింగ్, కార్డియో వ్యాయామాలు కూడా చేస్తూ చురుగ్గా ఉండటమే ఆమె ఆరోగ్య రహస్యం.
అక్షయ్ కుమార్.. ఆరుపదల వయస్సుకు చేరువ అవుతున్నా కూడా ఫిట్ నెస్ విషయంలో ఈ బాలీవుడ్ హీరోని మించినవాళ్లు లేరంటే అతిశయోక్తి లేదు. క్రమశిక్షణకు మారుపేరైన అక్షయ్ కుమార్‌వ్యాయామం, యోగా, కార్డియోలకు ప్రాధాన్యతనిస్తారు. ఇవి ఆయన శరీరాన్ని ఎప్పుడూ ఫిట్‌గా, టోన్‌గా ఉంచుతాయి. ఆహారం విషయానికొస్తే అక్షయ్ కుమార్.. శరీరానికి కావాల్సిన ప్రొటీన్లను, శక్తిని అందించేలా ఉదయాన్నే పాలు, పరాటాలు తీసుకుంటారు.
దీపికా పదుకోన్.. భారత సినీ పరిశ్రమలోనే కాకుండా విదేశాల్లో కూగా తన నటనతో అద్భుతమైన ప్రశంసలు,ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన దీపికా పదుకొణె ఫిట్ నెస్ విషయంలో అసలేమాత్రం రాజీపడదు. త్వరలోనే నాలుగవ పదిలోకి అడుగు పెట్టనున్న దీపికా పదుకోన్ ఫిట్ నెస్, అందం వెనుక ఆరోగ్యకరమైన ఆహారమే అసలు రహస్యం.
దీపికా పదుకొణె ఉదయం ఆహారంలో గ్రీన్ టీ, ఓట్ మీల్ తీసుకుంటుంది. దీపికాకి సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే బాగా ఇష్టపడే దీపికా బ్రేక్ ఫాస్ట్ లోకి దక్షిణ భారతీయ వంటకాలైన ఇడ్లీ, దోసెలను తీసుకుంటుంటుంది. క్రమం తప్పకుండా యోగా, వ్యాయామం చేస్తుంది.
రణ్‌వీర్ సింగ్.. తన డిఫరెంట్ లుక్స్, స్టైల్, స్మైల్‌తో అందరినీ ఆకట్టుకునే బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్.. తన రోజును వ్యాయామం, కార్డియోతో ప్రారంభిస్తాడు, ఇది అతని శరీరాన్ని ఎల్లప్పుడూ చురుగ్గా, ఫిట్‌గా ఉంచడంలో తోడ్పడతాయి. ఉదయాన్నే ఎనర్జీ డ్రింక్స్ తాగుతాడు. ఆ తర్వాత అల్ఫాహారంలోకి ఓట్స్, డ్రై ఫ్రూట్స్, స్మూతీలు తీసుకుంటానంటున్నాడు. నిజానికి వీరు అనుసరించేవన్నీ చాలా చిన్న చిన్న ఆరోగ్య నియమాలే. అయితే వాటినే మనం ఫాలో కాము అసలు. ఇక్కడే వచ్చింది అసలు తేడా.


