శీలంక నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె ఎక్కువగా బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ..అక్కడ వేలాది అభిమానులను సొంతం చేసుకున్నారామె. అంతేగాదు ఫ్యాషన్, ఫిట్‌నెస్ విషయంలో ఐకాన్. ఎప్పటికప్పడూ సోషల్ మీడియాలో తన ఆహారం, వ్యాయామాల గురించి నెటిజన్లతో షేర్ చేసుకుంటుంటారామె. అలానే ఈ సారి ఆమె తాను శాకాహారిగా మారడంతో తన బాడీలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకున్నాయంటూ షేరు చేసుకుంది. ఓ ఇంటర్వ్యూలో కూడా ఈ విషయం గురించి స్వయంగా చెప్పారామె.
తాను మొక్కల ఆధారిత భోజనం తీసుకోవడం మొదలుపెట్టిన తర్వాత తన శరీరంలో చాలా మార్పులు సంతరించుకున్నాయని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా తన ముఖంలో సహజసిద్ధమైన మెరుపు రావడమే గాక మొటిమలు కూడా మాయమైపోయాయని అన్నారామె. తన చర్మ సంరక్షణ విషయంలో అద్భుతంగా ఈ డైట్ పనిచేసిందన్నారు. తాను మొటిమలతో చాలా ఇబ్బంది పడ్డానని, ఎప్పుడైతే శాకాహారిగా మొక్కల ఆధారితో ఫుడ్‌ని తీసుకోవడం ప్రారంభించానో అప్పటి నుంచి మొటిమలు, మచ్చలు తగ్గి కాంతిమంతంగా ఉందని తెలిపింది.
అలాగే బరువు సైతం అదుపులో ఉంది. ఇంతకుమునుపు తగ్గుతూ..పెరుగుతూ ఉండేది. కానీ ఈ శాకాహారం మన బరువుని అద్భుతంగా అదుపులో ఉంచుతుంది. మొత్తం ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని నమ్మకంగా చెప్పుకొచ్చారామె. అందుకు శాస్త్రీయ నిర్థారణ లేకపోయినా..పొట్ట ఉబ్బరం, బరువు విషయంలో చాలా రిలీఫ్ పొందానంటోంది. శరీరాని అవసరమైన పోషకాలు, ప్రోటీన్లు అందుతాయి.
ముఖ్యంగా మంచి ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. మాంసకృత్తులు సైతం మొక్కల ఆధారిత ఆహారం నుంచే పొందవచ్చని అంటుందామె. అందుకోసం కూరగాయలు, బీన్స్, టోపు వంటి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉన్నవాటిని తీసుకుంటే చాలని చెబుతోంది. అలాగే నోటి శుభ్రత కోసం ఆయిల్ పుల్లింగ్ చేస్తుంటానని, ఒక లీటరు డిటాక్స్‌నీరు తాగి హైడ్రేషన్‌గా ఉండేలా చూసుకుంటానని చెబుతోంది జాక్వెలిన్.


