52 ఏళ్ల మహిళ యూట్యూబ్‌ రీల్స్‌తో మొదటి సంపాదన..! | Indian woman receives first-ever income from YouTube | Sakshi
Sakshi News home page

52 ఏళ్ల మహిళ యూట్యూబ్‌ రీల్స్‌తో మొదటి సంపాదన..!

Jan 1 2026 4:52 PM | Updated on Jan 1 2026 5:11 PM

Indian woman receives first-ever income from YouTube

సోషల్ మీడియా గృహిణులకు వారి అభిరుచులు, రోజువారీ అనుభవాలను డాక్యుమెంట్ చేసి, ఆదాయ వనరులుగా మార్చుకుని, జీవనోపాధి పొందే అవకాశాలను కల్పిస్తోంది. ఇది యువతకే కాదు..50 ఏళ్ల పైబడ్డవారికి గొప్ప ఫ్లాట్‌ఫామ్‌. వాళ్లు కూడా వయసు కేవలం సం‍ఖ్య మాత్రమే అని ప్రూవ్‌ చేస్తున్నారు. అందుకు ఈ 52 ఏళ్ల మణీష పరీక్‌  ఉదాహరణ. 

యూట్యూబ్‌లో రీల్స్ పోస్ట్‌ చేస్తూ ఆరు నెలల్లో తొలి ఆదాయం అందుకున్నా అంటూ కూతురు అన్షుల్‌ పరీక్షతో సంతోషాన్ని షేర్‌ చేసుకుంది. ఆమె తన అమ్మ హ్యాపీ మూమెంట్స్‌ని కెమారాలో రికార్డు చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. అది కాస్తా వైరల్‌గా మారడంతో మనిషా వార్తల్లో నిలిచింది. అంతేగాదు ఆ వీడియోకి అంతా  ‘కంగ్రాట్స్‌ ఆంటీ జీ’ అని ప్రేమగా కామెంట్లు పెట్టగా, యూట్యూబ్‌ సైతం ఆమెను అభినందించడం విశేషం.

52 ఏళ్ల వయసులో మనీషా పరీక్‌ యూట్యూబ్‌లో కార్టూన్‌ ఆధారిత రీల్స్ చేయాలని భావించింది. ఈ క్రమంలోనే ‘Life Unscripted’ పేరుతో ఓ యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించింది. మన చుట్టూ ఉండే కుటుంబాలలో జరిగే కొన్ని సంఘటనలకే తనదైన హాస్యాన్ని జోడిస్తూ.. కార్టూన్‌ వీడియోలను రూపొందించి యూట్యూబ్‌లో పోస్ట్‌ చేయడం మొదలుపెట్టింది. వాటికి అనతికాలంలోనే ఆదరణ లభించడంతో వ్యూస్‌ కూడా పెరిగాయి. 

ఇలా ఆరు నెలలు తిరక్కముందే సుమారు 42 వేల మంది సబ్‌స్క్రైబర్లను సంపాదించుకుని..యూట్యూబ్‌ సంస్థ నుంచి తొలిసారి వేతనాన్ని  అందుకుంది. అది మనీషాకు జీవితంలోనే మొదటి సంపాదన కావడంతో పట్టరాని సంతోషం కలిగిందామె. ఈ క్రమంలోనే తన సంతోషాన్ని కూతురు అన్షుల్‌ పరీక్‌తో పంచుకుంది. ఈనేపథ్యంలోనే తన తల్లి మెమరబుల్‌ మొమెంట్స్‌ని వీడియో రూపంలో కెమెరాలో బంధించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయగా వైరల్‌గా మారింది.

అంతేగాదు ఆ వీడియోలో అన్షుల్‌ తన తల్లితో ‘నీ హ్యాపీనెస్‌కి కారణమేంటమ్మా?’ అని అడగ్గా.. ‘52 ఏళ్ల వయసులో.. జీవితంలో తొలి సంపాదనను యూట్యూబ్‌ ద్వారా అందుకున్నా. అదీ ఆరు నెలల్లోనే.. కష్టపడితే తప్పకుండా ఫలితం వస్తుంది’ అంటూ సంబరపడిపోయింది మనీషా. ఈ వీడియోకి సుమారు 13 లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి.

 

(చదవండి: సోలో బైక్ రైడ్‌తో..12 జ్యోతిర్లింగాలు చుట్టొచ్చిన లెఫ్టినెంట్‌ కల్నల్‌ అంబిలి సతీష్‌..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement