లోయలో పడ్డ బస్సు.. 18 మంది కూలీల దుర్మరణం | Arunachal Pradesh Truck Plunges into gorge Accident Details | Sakshi
Sakshi News home page

లోయలో పడ్డ బస్సు.. 18 మంది కూలీల దుర్మరణం

Dec 11 2025 4:12 PM | Updated on Dec 12 2025 12:29 PM

Arunachal Pradesh Truck Plunges into gorge Accident Details

అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఓ ట్రక్కు వెయ్యి అడుగుల లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న 18 మంది దుర్మరణం పాలయ్యారు. ఆ విషయం 3 రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. 

అరుణాచల్‌ ప్రదేశ్‌ అన్జా జిల్లా చాగ్లాగాం వద్ద సోమవారం రాత్రి ఈ ఘోరం చోటు చేసుకుంది. హయులియాంగ్‌-చాక్లా మధ్య 40 నెంబర్‌ మైలురాయి వద్ద ట్రక్కు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో పలువురు కూలీలు అక్కడిక్కడే చనిపోయారు. గాయాలతో బయటపడిన ఓ వ్యక్తి.. రెండు రోజుల తర్వాత లోయ నుంచి బయటకు వచ్చి సమీపంలోని ‘బోర్డర్‌ రోడ్స్‌ టాస్క్‌ ఫోర్స్‌’ (బీఆర్‌టీఎఫ్‌) లేబర్‌ క్యాంప్‌నకు చేరుకున్నాడు. మృత్యుంజయుడైన ఆ వ్యక్తిని బుధేశ్వర్‌ దీప్‌గా నిర్ధారించారు. 

అతను ఇచ్చిన సమాచారంతో ఇండియన్‌ ఆర్మీ సహాయక చర్యలు చేపట్టింది.  అతి కష్టం మీద మృతదేహాలను బయటకు తీసింది. మృతులంతా అస్సాంకు చెందిన కూలీలుగా తెలుస్తోంది. తీన్‌సుకియా  నుంచి 22 మంది టీ ఎస్టేట్‌  పనుల కోసం వస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే మరో ముగ్గురి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement