6 కులాలకు ఎస్టీ హోదా | Assam Cabinet approves ST status for six communities | Sakshi
Sakshi News home page

6 కులాలకు ఎస్టీ హోదా

Nov 30 2025 5:01 AM | Updated on Nov 30 2025 5:09 AM

Assam Cabinet approves ST status for six communities

అసోం అసెంబ్లీలో నివేదిక 

భగ్గుమన్న గిరిజన విద్యార్థులు 

బోడోలాండ్‌ మండలికి నిప్పు 

గువాహటి/కోఖ్రాజార్‌: అసోంలో కులాల కుంపటి రాజుకుంటోంది. ఆరు ప్రధాన కులాలకు ఎస్టీ హోదా కల్పించాలన్న ప్రతిపాదనపై ఏర్పాటైన మంత్రుల బృందం తమ మధ్యంతర నివేదికను శనివారం అసెంబ్లీకి సమర్పించింది. గిరిజన మంత్రి రానిజ్‌ పెగు నివేదికలు ప్రవేశపెట్టారు. అహోం, చుటియా, మొరాన్, మతక్, కోచ్‌–రాజ్‌ భోంగ్సి, తేయాకు గిరిజనులు (ఆదివాసీలు) ఈ జాబితాలో ఉన్నారు. వీరు ఎప్పటినుంచో ఎస్టీ హోదా డిమాండ్‌ చేస్తున్నారు. 

ప్రస్తుత గిరిజన సమూహాలకు ఎలాంటి నష్టమూ కలగకుండా వీరికి కూడా ఆ ప్రయోజనాలు కల్పించడంపై ప్రధానంగా దృష్టి పెట్టినట్టు మంత్రి పెగు సభకు వివరించారు. అందుకు సంబంధించిన వివరాలు, గణాంకాలతో పాటు తలపెట్టిన మార్పుచేర్పులు తదితరాలను మంత్రి సభ ముందుంచారు.  ఆరు బోర కులాలకు ఎస్టీ హోదాపై మంత్రుల బృందం సమర్పించిన మధ్యంతర నివేదికపై అసోం గిరిజన విద్యార్థి లోకం మండిపడింది. 

బోడోలాండ్‌ ప్రాదేశిక మండలి భవనానికి నిప్పు పెట్టి నిరసన తెలిపింది. వర్సిటీ నుంచి 6 కి.మీ. దూరంలోని బోడోలాండ్‌ ప్రాదేశిక మండలి దాకా స్టూడెంట్స్‌ మార్చి చేశారు. బారికేడ్లను బద్దలు కొట్టుకుని లోనికి ప్రవేశించారు. ఫర్నిచర్‌ ను ధ్వంసం చేశారు. దాంతో అదనపు పోలీసు బలగాలని రప్పించి పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చింది. ఆందోళనల్లో ఆల్‌ బోడో స్టూడెంట్స్‌ యూనియన్, పలు ఇతర అనుబంధ గిరిజన యూనియన్లు నిరసనలు, ధర్నాలు, ర్యాలీలో పాల్గొని హోరెత్తించాయి. వీరంతా ఇదే అంశంపై గురువారం కూడా రోడ్డెక్కాయి.  

 

Advertisement
 
Advertisement
Advertisement