న్యూఢిల్లీ: న్యూ ఇయర్‌లో కొత్తగా కారు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? లేదంటే ఇతర వాహనాల్ని కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారా? అయితే తస్మాత్ జాగ్రత్త. త్వరలో ఆటోమొబైల్ ధరలు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకు భారత్‌పై మెక్సికో విధించే 50 శాతం సుంకమే కారణమని జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.
న్యూఇయర్ జనవరి1,2026 నుంచి మెక్సికో నుంచి భారత్ దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకం వసూలు చేయనుంది. ఇప్పటికే భారత్ దిగుమతులపై అమెరికా 50శాతం అంతకంటే ఎక్కువగా సుంకాలు విధించింది. తాజాగా,మెక్సికో సైతం భారత్ దిగుమతులపై భారీ ఎత్తున టారిఫ్ వసూలు చేసేందుకు సిద్ధం కాగా.. అందుకు ఆదేశ సెనేట్ సైతం ఆమోదం తెలిపింది. మెక్సికో భారత్, చైనాతో పాటు ఇతర ఆసియా దేశాల నుంచి సుంకాలను వసూలు చేయనుంది.
ఫలితంగా మెక్సికో నుంచి భారత్ భారీ స్థాయిలో దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై 50శాతం సుంకాల్ని చెల్లించాల్సి వస్తుంది. వాటిలో ప్రధాన ఉత్పత్తులు వాహనాలు, వాహనాల విడిభాగాలు, టెక్స్‌టైల్స్, ప్లాస్టిక్, స్టీల్ ఉంది. అలా చెల్లించే పరిస్థితి వస్తే దేశీయంగా సంబంధిత వస్తువుల ఉత్పత్తుల అమాంతం పెరిగే అవకాశం ఉందని వెలుగులోకి వచ్చిన జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్ దేశీయంగా తయారీ రంగానికి ఊతం ఇచ్చేలా పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా అమెరికాతో ఫ్రీ ట్రేడ్ ఒప్పందాలు కుదుర్చుకున్నారు. తాజాగా, భారత్ దిగుమతులపై సుంకం విధించే దిశగా చర్యలు తీసుకున్నారు.
భారత్‌పై ప్రతికూల ప్రభావం
భారత్‌పై 50శాతం వరకు సుంకాలను విధించాలన్న మెక్సికో చర్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. మెక్సికన్ ఎగుమతులకు భారత్ తొమ్మిదవ స్థానంలో ఉంది. ప్రస్తుతం, భారత్.. మెక్సికోతో అధిక మొత్తంలో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. 2024లో భారత్ నుంచి మెక్సికోకు ఎగుమతులు దాదాపు 8.9 బిలియన్ డాలర్లు కాగా, దిగుమతులు 2.8 బిలియన్లుగా ఉంది.
గతేడాది భారత్.. మెక్సికో నుంచి వాహనాలు, వాటి తయారీలో వినియోగించే ఆటో విడిభాగాలు,ఇతర ప్రయాణీకుల వాహనాలు. ఇప్పుడు, మెక్సికో ఈ వస్తువులపై భారీ సుంకాలు విధించడంతో.. వచ్చే ఏడాది దిగుమతులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశ ఉందని ఆర్థిక నిపుణలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


