అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమకు ఆదాయాన్ని తెచ్చిపెడుతుందని భావిస్తున్న "ట్రంప్ గోల్డ్ కార్డ్" (Trump Gold Card) పథకానికి సంబంధించిన అధికారిక అమ్మకాలను ప్రారంభించారు. అమెరికా పౌరసత్వం కావాలని కోరుకునే సంపన్నులకు, అమెరికన్ కంపెనీలు నిపుణులైన వారికి ఎంపిక చేసుకు నేందుకు వీలుగా ఈ కార్డుని తీసుకొచ్చారు.
గోల్డ్ కార్డ్‌కు భారీ ఖరీదు ఈ 'ట్రంప్ గోల్డ్ కార్డ్' పథకం ప్రధానంగా డబ్బు చెల్లించే వారికి వేగవంతమైన వసతి మార్గాన్ని అందిస్తుంది. అలాగే అగ్రశ్రేణి ప్రతిభను ఆకర్షించడానికి, నిలుపుకోవడానికి ఒక మార్గంగా ట్రంప్ భావిస్తున్నారు. అదే సమయంలో ఫెడరల్ ఖజానాకు ఆదాయాన్ని తెచ్చి పెడుతుందని అంచనా. అయితే ఈ గోల్డ్ కార్డ్ కోసం వ్యక్తి ఒక మిలియన్ డాలర్లు (సుమారు రూ.9.1 కోట్లు), ప్రతీ ఉద్యోగి కోసం సంస్థ 2 మిలియన్ డాలర్లు (సుమారు రూ.18 కోట్లు) చెల్లించాల్సి ఉంటుంది. దీనికి త్వరలో ఉన్నతస్థాయి ‘ప్లాటినం కార్డ్’ హామీ ఇవ్వబడుతుందని ప్రకటించారు
వైట్‌హౌస్‌లోని వ్యాపారవేత్తలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ట్రంప్‌ఈ గోల్డ్ కార్డు కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్ కూడా లాంచ్ చేశారు. ఈ కొత్త వెబ్‌సైట్ ద్వారా గ్రీన్ కార్డు ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ నిమిషాల్లోనే జరుగుతుందన్నారు. 1990లో విదేశీ పెట్టుబడుల నిమిత్తం తీసుకొచ్చిన EB-5 విధానంలో జరుగుతున్న మోసాలు, అక్రమాలను అరికట్టాలని నిర్ణయించుకున్నట్లు ట్రంప్ చెప్పారు. వీటిని అరికట్టాలనే ఉద్దేశంతోనే గోల్డ్ కార్డును ప్రకటించారు. ప్రాథమికంగా, ఇది గ్రీన్ కార్డ్ లాంటిదే, కానీ దానికంటే చాలా మెరుగైనది, చాలా శక్తివంతమైనది, చాలా బలమైన మార్గం." అని ట్రంప్ చెప్పారు. భారతదేశం, చైనా వంటి దేశాల విద్యార్థులు అగ్రశ్రేణి అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో చదువుకుని పట్టభద్రులైన తర్వాత స్వదేశానికి తిరిగి వెళ్లాల్సి రావడం సిగ్గు చేటని ట్రంప్ వ్యాఖ్యానించారు. .
ఎలా దరఖాస్తు చేయాలి
దరఖాస్తులను trumpcard.gov ద్వారా దాఖలు చేయాలి.
గోల్డ్ కార్డ్, కార్పొరేట్ గోల్డ్ కార్డ్ లేదా ప్లాటినం వెయిట్‌లిస్ట్‌ను ఎంచుకోవాలి
వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి
myUSCIS.gov ఖాతాను క్రియేట్ చేసి
15వేల డాలర్ల (నాన్ రిఫండబుల్) ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి
వ్యక్తిగతం దరఖాస్తు చేసుకుంటోంటే ఒక మిలియన్ డాలర్లు, కార్పొరేట్ గోల్డ్ కార్డ్ కోసం 2 మిలియన్లు డాలర్లు చెల్లించాలి. దీనికనుగుణంగా ఆప్షన్ ఎంచుకోవాలి.
వెరిఫికేషన్ తరువాత మొత్తం రుసుము చెల్లించాలి.
క్రెడిట్ కార్డ్, ACH డెబిట్ (USలో మాత్రమే) లేదా అంతర్జాతీయ వైర్ బదిలీ ద్వారా చెల్లింపులు చేయవచ్చు.
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
చట్టబద్ధమైన శాశ్వత నివాసానికి అర్హులు అయి ఉండాలి
యునైటెడ్ స్టేట్స్‌కు అనుమతి ఉండాలి
వీసా నంబర్ అందుబాటులో ఉండాలి
గోల్డ్ కార్డ్ హోల్డర్లు US శాశ్వత నివాసితుల వలె పన్ను విధించబడతారు.
ఆమోదం పొందడానికి ఎంత సమయం పడుతుంది?
ప్రాసెసింగ్ రుసుము చెల్లించిన తర్వాత, నేపథ్య తనిఖీ , పరిశీలన సాధారణంగా కొన్ని వారాలు పడుతుంది. దరఖాస్తుదారులు వీసా ఇంటర్వ్యూను పూర్తి చేయాలి , డాక్యుమెంట్ అభ్యర్థనలకు వెంటనే స్పందించాలి.
గోల్డ్ కార్డ్ రద్దు అయ్యే అవకాశం ఉందా?
ఇతర అమెరికా వీసా మాదిరిగానే, జాతీయ భద్రతా సమస్యలు లేదా తీవ్రమైన నేరారోపణల మీద వీటిని రద్దు చేసే అవకాశం ఉంది.
కాగా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల వీసాలు సర్వసాధారణం, యునైటెడ్ కింగ్‌డమ్, స్పెయిన్, గ్రీస్, మాల్టా, ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీతో సహా డజన్ల కొద్దీ దేశాలు సంపన్న వ్యక్తులకు "గోల్డెన్ వీసాల" వెర్షన్‌లను అందిస్తున్నాయి.


