breaking news
permanent residency
-
అందమైన దేశంలో శాశ్వత నివాసం: భారతీయులకు అవకాశం
ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా పేరుగాంచిన 'ఫిన్లాండ్'.. భారతీయులకు శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. వర్క్, ఎడ్యుకేషన్ ప్రయోజనాల నుంచి ఫ్యామిలీ స్పాన్సర్షిప్ వరకు అన్ని సదుపాయాలను అందించడానికి దేశం సిద్ధంగా ఉంది.అందమైన దేశమే కాకుండా.. జీవించడానికి కూడా ప్రసిద్ధి చెందిన ఫిన్లాండ్, వరుసగా ఎనిమిది సంవత్సరాలు ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా ర్యాంక్ సాధించింది. ఈ దేశంలో భారతీయులు శాశ్వతంగా నివాసం ఉండటానికి.. అక్కడి ప్రభుత్వం అర్హతగల అభ్యర్థులకు శాశ్వత నివాస అనుమతి (PR) కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.ప్రయోజనాలు & అర్హతలుఫిన్లాండ్లో శాశ్వత నివాసం ఉండటం వల్ల.. సామాజిక భద్రత, ఆరోగ్య సంరక్షణ, విద్య, పెన్షన్ పథకాల వంటి ప్రయోజనాలు పొందవచ్చు.మీ కుటుంబ సభ్యులను మీతో చేర్చుకోవడానికి మీరే స్పాన్సర్ చేయవచ్చు. కంటిన్యూస్ రెసిడెంట్ పర్మిట్ కోసం ఫిన్లాండ్లో కనీసం నాలుగు సంవత్సరాలు నివసించి ఉండాలి. ఈ వ్యవధి 2026 జనవరి నుంచి ఆరు సంవత్సరాలకు పెరుగుతుంది.●ఫిన్లాండ్లో నివసించడానికి కనీస వార్షిక ఆదాయం 40000 యూరోలు (సుమారు రూ.41.3 లక్షలు). ●2 సంవత్సరాల వర్క్ ఎక్స్‌పీరియన్స్‌తో గుర్తింపు పొందిన మాస్టర్స్/పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా 3 సంవత్సరాల వర్క్ ●ఎక్స్‌పీరియన్స్‌తో ఉన్నత స్థాయి ఫిన్నిష్/స్వీడిష్ లాంగ్వేజ్ స్కిల్స్.●దరఖాస్తుదారులు తప్పనిసరిగా క్లీన్ క్రిమినల్ రికార్డ్ కలిగి ఉండాలి.అప్లై చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్స్●చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ & పాస్‌పోర్ట్ ఫోటోలు●ఆర్థిక స్థిరత్వానికి కావాల్సిన రుజువు●మీ పాస్‌పోర్ట్ ఐడీ పేజీ కాపీ●విద్య, ఉపాధి లేదా భాషా నైపుణ్యాలను నిరూపించే ఏవైనా డాక్యుమెంట్స్అప్లై చేసుకోవడం ఎలా●ఎంటర్ ఫిన్లాండ్ ద్వారా దరఖాస్తు ఫారమ్‌ను ఆన్లైన్లో ఫిల్ చేసుకోవచ్చు. పేపర్ దరఖాస్తుకు కూడా అనుమతి ఉంది.దరఖాస్తు ఫీజు చెల్లించాలి●బయోమెట్రిక్స్ ఇవ్వడానికి ఫిన్నిష్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్ లేదా వీఎఫ్ఎస్ గ్లోబల్‌లో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. ఇవన్నీ ●పూర్తయిన తరువాత అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఆన్లైన్లో ట్రాక్ చేసుకోవచ్చు.●మీ అప్లికేషన్ ఆమోదం పొందిన తరువాత.. రెసిడెన్సీ కార్డును రాయబార కార్యాలయం లేదా సేవా కేంద్రం నుంచి తీసుకోవచ్చు.శాశ్వత నివాసం కోసం అప్లికేషన్ ఫీజు●ఎలక్ట్రానిక్ అప్లికేషన్: 240 యూరోలు (సుమారు రూ. 24,800)●పేపర్ అప్లికేషన్: 350 యూరోలు (సుమారు రూ. 36,100)●18 ఏళ్లలోపు దరఖాస్తుదారులు: 180 యూరోలు (సుమారు రూ. 18,600)ఇదీ చదవండి: చరిత్రలో అతిపెద్ద మార్పు: రాబర్ట్ కియోసాకి హెచ్చరిక -
ఈ దేశంలో శాశ్వతంగా ఉండిపోవచ్చు..
విదేశాల్లో స్థిరపడాలనుకునే భారతీయుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అందుకే చాలా దేశాలు విదేశీయులకు తమ దేశంలో శాశ్వతంగా ఉండిపోయేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. జర్మనీ ప్రభుత్వం ఇప్పుడు రూ.11,500 లోపు ఫీజుతో శాశ్వత నివాస అనుమతిని (Settlement Permit) అందిస్తోంది. ఇది జర్మనీలో శాశ్వతంగా నివసించేందుకు అత్యంత భద్రమైన మార్గం. ఈ అనుమతితో మీరు కుటుంబంతో కలిసి స్వేచ్ఛగా జీవించవచ్చు, ఉద్యోగం చేయవచ్చు లేదా స్వయం ఉపాధి ద్వారా పని చేయవచ్చు.జర్మనీలో స్కిల్డ్ వర్కర్ అంటే..రెసిడెన్స్ యాక్ట్ ప్రకారం వీరు స్కిల్డ్ వర్కర్ కేటగిరీలోకి వస్తారు..- జర్మన్ లేదా గుర్తింపు పొందిన విదేశీ డిగ్రీ కలిగినవారు- జర్మనీలో సమానమైన వృత్తి శిక్షణ పొందినవారు- ఈయూ బ్లూ కార్డ్ కలిగినవారు- ఈయూ డెరెక్టివ్ 2016/801 ప్రకారం అంతర్జాతీయ పరిశోధకులుప్రధాన అర్హతలు- సెక్షన్లు 18ఎ, 18బి, 18డి, 18జి ప్రకారం 3 సంవత్సరాలుగా చెల్లుబాటు అయ్యే నివాస అనుమతి కలిగి ఉండాలి- జీవనాధారం కోసం ప్రభుత్వ సహాయంపై ఆధారపడకుండా ఉండాలి- కనీసం 36 నెలలు పింఛను బీమా (statutory pension)లో చెల్లింపులు చేయాలి- జర్మన్ బి1 సీఈఎఫ్ఆర్ స్థాయిలో భాషా నైపుణ్యం ఉండాలి- “లివింగ్ ఇన్ జర్మనీ” పరీక్ష ద్వారా జర్మన్ సమాజం, చట్టాలపై ప్రాథమిక అవగాహన చూపించాలి- కుటుంబానికి సరిపడిన నివాస స్థలం ఉండాలిత్వరిత ప్రక్రియలుఈ కింది కొన్ని సందర్భాల్లో వేగంగా శాశ్వత అనుమతి పొందవచ్చు..- ఈయూ బ్లూ కార్డ్: 27 నెలల ఉద్యోగం తర్వాత, బి1 జర్మన్ భాష ఉంటే 21 నెలలకే అర్హత-జర్మన్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లు: 2 సంవత్సరాల ఉద్యోగం తర్వాత అర్హత- అత్యంత నైపుణ్యవంతులు: శాస్త్రవేత్తలు, సీనియర్ టీచర్లు మొదలైనవారు వెంటనే అర్హత పొందవచ్చు- స్వయం ఉపాధి: సెక్షన్ 21 ప్రకారం 3 సంవత్సరాల వ్యాపార అనుభవం తర్వాత అర్హతజీవిత భాగస్వాములకు..- స్కిల్డ్ వర్కర్ జీవిత భాగస్వామి సెక్షన్ 18సి ప్రకారం శాశ్వత అనుమతి కలిగి ఉండాలి- 3 సంవత్సరాలుగా నివాస అనుమతి కలిగి ఉండాలి- వారానికి కనీసం 20 గంటలు ఉద్యోగం చేయాలి- బి1 స్థాయి జర్మన్ భాషా నైపుణ్యం ఉండాలిఅప్లికేషన్ ఖర్చుజర్మనీలో శాశ్వత నివాస అనుమతి కోసం దరఖాస్తు చేయడానికి అయ్యే ఖర్చు సాధారణంగా 113 యూరోల (రూ .11,666) నుండి 147 యూరోల (రూ .15,176) వరకు ఉంటుంది. స్కిల్డ్ వర్కర్ లేదా హైలీ స్కిల్డ్ ప్రొఫెషనల్ వంటి మీ వర్క్ ప్రొఫైల్ ఆధారంగా ఫీజులు మారుతూ ఉంటాయి. ఇక అనువాదాలు, భాషా పరీక్ష రుసుములు, ఆరోగ్య బీమా ప్రీమియంలు వంటి ఇతర ఖర్చులు అదనం.ఇదీ చదవండి: మా దేశం వచ్చేయండి.. శాశ్వతంగా ఉండిపోండి! -
మా దేశం వచ్చేయండి.. శాశ్వతంగా ఉండిపోండి!
బ్రెజిల్ ఇప్పుడు విదేశీయులకు పర్మినెంట్ రెసిడెన్సీ పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. దీని కోసం భారతీయులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కింద ఆ దేశంలో శాశ్వతంగా నివసించడానికి, పనిచేయడానికి, చదువుకోవడానికి అవకాశం లభిస్తుంది. బ్రెజిల్ లో స్థిరపడాలనుకునే వారికి ఈ పథకం మంచిదే అయినా అందుకు అవసరమైన కొన్ని అర్హతలు, నియమాలు ఉన్నాయి.బ్రెజిల్ దాని అందం, గొప్ప సంస్కృతికి ప్రసిద్ది చెందింది, కానీ ఇప్పుడు ఈ దేశం విదేశాల్లో నివసించడానికి, పనిచేయడానికి, చదువుకోవడానికి ఇష్టపడేవారికి మంచి ఎంపికగా మారింది. బ్రెజిల్ శాశ్వత నివాస కార్యక్రమాన్ని ప్రారంభించింది, దీని ధర భారతదేశంలో సుమారు రూ .27,000, భారతీయ పౌరులు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.శాశ్వత నివాసానికి మార్గాలుబ్రెజిల్ లో శాశ్వత నివాసం పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అత్యంత సాధారణ మార్గం బ్రెజిల్లో వ్యాపారం లేదా స్థిరాస్తిలో పెట్టుబడి పెట్టడం. ఇది కాకుండా, ఎవరైనా బ్రెజిల్లో ఉద్యోగం కలిగి ఉండి, ఉద్యోగంలో కొనసాగితే శాశ్వత నివాసాన్ని కూడా పొందవచ్చు. బ్రెజిల్ లో వివాహం ద్వారా లేదా పిల్లలను కనడం ద్వారా కూడా రెసిడెన్సీ పొందే అవకాశం ఉంది. రిటైర్మెంట్ తర్వాత రెగ్యులర్ పెన్షన్ పొందితే కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తంమీద, నెలకు సుమారు 2,000 అమెరికన్ డాలర్ల ఆదాయం ఉన్నవారు తాత్కాలిక నివాసానికి అర్హులు కావచ్చు, తరువాత దీనిని శాశ్వత నివాసంగా మార్చవచ్చు.శాశ్వత నివాసానికి దరఖాస్తుదారు చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్, లీగల్ ఎంట్రీ అండ్ స్టే రుజువు, ఉద్యోగం లేదా పెట్టుబడి పత్రాలు వంటి కొన్ని అవసరమైన పత్రాలను సమర్పించాలి. అంతేకాకుండా, రెసిడెన్సీ హోదాను కొనసాగించడానికి వరుసగా రెండు సంవత్సరాలకు మించి బ్రెజిల్ వెలుపల ఉండకూడదు. బ్రెజిల్ లో నివసించడం ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, కొన్ని ప్రదేశాలలో జీవన వ్యయం ఎక్కువగా ఉంటుంది.అలాగే, పన్ను రేట్లు ఎక్కువగానే ఉంటాయి. జాబ్ మార్కెట్ చాలా పోటీగా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమైనది అక్కడ ప్రధాన భాష అయిన పోర్చుగీస్ పరిజ్ఞానం.దరఖాస్తు ఫీజు రూ.27 వేల లోపేదరఖాస్తు ప్రక్రియ చాలా సులభం. ముందుగా పెట్టుబడి లేదా ఉపాధిని బట్టి సంబంధిత వీసాకు సంబంధించిన డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత ఆన్లైన్లో లేదా బ్రెజిల్ రాయబార కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాలి. దరఖాస్తు ఫీజు 100 నుంచి 300 డాలర్ల వరకు ఉంటుంది. అంటే రూ.27 వేల లోపే. దరఖాస్తు ఆమోదించిన తర్వాత, దరఖాస్తుదారు బ్రెజిల్ ఫెడరల్ పోలీసుల నుండి శాశ్వత నివాస ఐడీ కార్డును అందుకుంటారు. మొత్తం ప్రక్రియకు 4-6 నెలలు పట్టవచ్చు. -
శాశ్వత నివాసం కోసం ఆకర్షణీయ మార్గం
యూరప్‌లో నివసించాలని చూస్తున్నవారికి ఐర్లాండ్ కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. యురోపియన్ యూనియన్యేతర జాతీయులు ఐర్లాండ్‌లో దీర్ఘకాలిక నివాసాన్ని ఏర్పరుచుకునేందుకు ఆకర్షణీయమైన మార్గాన్ని అందిస్తుంది. దీనికోసం దరఖాస్తు చేసేకునేందుకు భారతీయులు సైతం అర్హులని చెప్పింది. ఈ అవకాశం కోసం దరఖాస్తు రుసుము కేవలం 500 యూరోలు (సుమారు రూ.52,000) అని వెల్లడించింది.ఐర్లాండ్‌లో శాశ్వత నివాసంఐర్లాండ్ శాశ్వత రెసిడెన్సీని అధికారికంగా లాంగ్-టర్మ్ రెసిడెన్సీ అని పిలుస్తారు. ఇది నాన్ ఈయూ/ ఈఈఏ(ఈయూతోపాటు ఐస్‌ల్యాండ్, లీచెన్‌స్టీన్, నార్వే) పౌరులు దేశంలో నివసించేందుకు అనుమతించే విధానం. ఇది దేశ పౌరసత్వం కానప్పటికీ, అనుమతులు అవసరం లేకుండా పనిచేసే హక్కు, ప్రజా సేవలకు అవకాశం వంటి ప్రయోజనాలను అందిస్తుంది. ఐర్లాండ్‌లో ఐదు సంవత్సరాల చట్టపరమైన నివాసం తర్వాత నిబంధనల ప్రకారం ఈ హోదా ఇస్తారు.ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?(భారతీయులు కూడా అర్హులు)ఐర్లాండ్‌లో చట్టబద్ధంగా ఐదేళ్లు నివసించి, అక్కడ పనిచేసిన ఈయూ/ఈఈఏయేతన జాతీయులు ఈ కింది షరతులకు అనుగుణంగా స్థిర నివాసానికి దరఖాస్తు చేసుకోవచ్చు.ఐర్లాండ్ లో ఐదు సంవత్సరాలు (60 నెలలు) నిరంతర చట్టపరమైన నివాసం ఉండాలి.క్రిటికల్ స్కిల్స్ ఎంప్లాయిమెంట్ పర్మిట్ లేదా జనరల్ ఎంప్లాయిమెంట్ పర్మిట్ వంటి చెల్లుబాటు అయ్యే వర్క్ పర్మిట్ ఉండాలి.దరఖాస్తు సమయంలో ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నారని ధ్రువీకరించుకోవాలి.క్లీన్ క్రిమినల్ రికార్డ్ ఉండాలి.ఆర్థిక స్వాతంత్ర్యం- ప్రజాధనంపై ఆధారపడకుండా మిమ్మల్ని మీరు పోషించుకునే సామర్థ్యం ఉండాలి.ఐరిష్ ఇమ్మిగ్రేషన్ నిబంధనలను పూర్తిగా పాటించాలి.పర్మినెంట్ రెసిడెన్సీ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?చెల్లుబాటు అయ్యే వర్క్ పర్మిట్‌తో ఐదు సంవత్సరాల చట్టపరమైన నివాస అవసరాలను తెలియజేసేలా డాక్యుమెంటేషన్ తయారు చేయాలి.రెసిడెన్సీ కోసం ఆ దేశ నిబంధనల ప్రకారం ఫారం 8ను పూర్తి చేయాలి.పాస్‌పోర్ట్, ఐరిష్ రెసిడెన్స్ పర్మిట్ (ఐఆర్పీ) వివరాలు వెల్లడించాలి.గత ఉపాధి అనుమతులు, పని చరిత్రను నివేదించాలి.నిరంతర నివాసం కోసం రుజువులు చూపాలి.అప్లికేషన్‌ను ఇమ్మిగ్రేషన్ సర్వీస్ డెలివరీ (ఐఎస్డీ)కి సబ్మిట్ చేయాలి.అప్రూవల్ నోటీస్ అందుకున్న 28 రోజుల్లోగా 500 యూరోలు (సుమారు రూ.52,000) అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.ప్రాసెసింగ్ కోసం 6 నుంచి 8 నెలలు పట్టవచ్చు.ఆమోదం పొందితే ఐర్లాండ్‌లో దీర్ఘకాలిక నివాసాన్ని ధ్రువీకరించే స్టాంప్ 4 వీసాను అందుకుంటారు.ఇదీ చదవండి: మొదటిసారి అప్పు చేస్తున్నారా? -
గ్రీన్ కార్డు శాశ్వత నివాసానికి... హక్కు కాదు: వాన్స్
వాషింగ్టన్/న్యూఢిల్లీ: అమెరికా వలస విధానంపై ఇప్పటికే ప్రపంచ దేశాల్లో నెలకొన్న ఆందోళనలను మరింతగా పెంచే పరిణామం చోటుచేసుకుంది. డాలర్ డ్రీమ్స్‌ను నిజం చేసుకోవడానికి రాచబాటగా భావించే అమెరికా గ్రీన్‌కార్డుపై ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రీన్‌కార్డు ఉన్నంతమాత్రాన అమెరికాలో నివాసానికి, పని చేయడానికి శాశ్వత హక్కులు దఖలు పడ్డట్టు కాదని స్పష్టం చేశారు. న్యూయార్క్‌లోని ప్రఖ్యాత కొలంబియా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ విద్యార్థి మహ్మద్ ఖలీల్ యూదు విద్వేష ఆరోపణలపై ఇటీవలే అరెస్టవడం తెలిసిందే. అతను గ్రీన్‌కార్డు హోల్డరే కావడాన్ని ప్రస్తావిస్తూ వాన్స్ పలు వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇదేమీ వాక్ స్వాతంత్య్రానికి సంబంధించిన అంశం కాదు. జాతీయ భద్రతకు సంబంధించిన అతి కీలకమైన విషయం. అంతకుమించి, అమెరికాలో శాశ్వత నివాసులుగా మాతోపాటు ఎవరుండాలన్న దానికి సంబంధించిన అంశం. దీన్ని నిర్ణయించేది అమెరికన్లు మాత్రమే’’ అంటూ కుండబద్దలు కొట్టారు. ఆయన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా, ముఖ్యంగా భారత్‌లో దుమారం రేపుతున్నాయి. ఏటా భారీ సంఖ్యలో అమెరికా బాట పట్టే భారత విద్యార్థులందరికీ గ్రీన్‌కార్డు ఒక బంగారు కల. అది చిక్కిందంటే అమెరికాలో శాశ్వత నివాసం దక్కినట్టేనని భావిస్తారు. వాన్స్ వ్యాఖ్యలు వారినేగాక అమెరికాలో గ్రీన్‌కార్డు హోల్డర్లయిన లక్షలాది మంది భారతీయులను కూడా కలవరపాటుకు గురిచేస్తున్నాయి. గురువారం ఫాక్స్ న్యూస్ చానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందర్భంగా వలస విధానాలకు సంబంధించి వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘కొలంబియా వర్సిటీలో హమాస్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్న విద్యార్థి ఖలీల్ కూడా గ్రీన్‌కార్డు హోల్డరే. అందుకే చెబుతున్నా, గ్రీన్‌కార్డు హోల్డర్‌కు అమెరికాలో శాశ్వతంగా ఉండిపోయే హక్కు లేదు’’ అని స్పష్టం చేశారు. గ్రీన్‌కార్డు హోల్డర్లయినా సరే, అమెరికా భద్రతకు ముప్పు కలిగించే కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్టు అనుమానిస్తున్న విద్యార్థులు తదితరులపై కఠిన చర్యలకు ట్రంప్ సర్కారు సిద్ధమవుతోందని ఉపాధ్యక్షుడు ప్రకటించారు. ‘‘వారి ఉనికి అమెరికాకు ముప్పని తేలిన పలువురిని త్వరలో తిప్పి పంపుతున్నాం. ఈ జాబితాలో విద్యార్థులతో పాటు ఇతరులు కూడా ఉన్నారు’’ అని వివరించారు. ట్రంప్ రాకతో అమెరికాలోకి అక్రమ వలసలు 95 శాతానికి పైగా తగ్గిపోయాయన్నారు.ఏమిటీ గ్రీన్‌కార్డు? పర్మనెంట్ రెసిడెంట్ (శాశ్వస నివాస) కార్డు. గ్రీన్కార్డుగా భారత్‌లో దాదాపు ఇంటింటికీ పరిచయం. ఇది విదేశీ పౌరులకు అమెరికాలో నివసించేందుకు, పని చేసుకునేందుకు హక్కు కల్పిస్తుంది. అంతేగాక కోరుకున్న కంపెనీలో పని చేయవచ్చు. సొంత వ్యాపారం వంటివీ చేసుకోవచ్చు. గ్రీన్‌కార్డు పొందిన మూడు నుంచి ఐదేళ్లకు పౌరసత్వం కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే నిజానికిది పేరుకే శాశ్వత నివాస కార్డు. వాన్స్ చెప్పినట్టుగా అమెరికాలో శాశ్వతంగా ఉండేందుకు హక్కు కల్పించదు. దీన్ని పదేళ్ల కాలపరిమితితో జారీ చేస్తారు. కొన్ని పరిస్థితుల్లో గ్రీన్‌కార్డును రద్దు చేయవచ్చు. నేర కార్యకలాపాల్లో పాల్గొన్నా, చాలాకాలం పాటు అమెరికాకు దూరంగా ఉన్నా, వలస నిబంధనలను ఉల్లంఘించినా గ్రీన్‌కార్డును కోల్పోతారు. అమెరికాలో నివసిస్తున్న భారతీయులు దశాబ్దాలుగా గ్రీన్‌కార్డుల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. వారిలో చాలామందికి కార్డు దక్కాలంటే 50 ఏళ్ల దాకా పట్టొచ్చట. కొన్ని కేటగిరీల వాళ్లకైతే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి గ్రీన్‌కార్డు రావాలంటే 134 సంవత్సరాలు పడుతుంది! 3.4 కోట్ల మందికి పైగా గ్రీన్‌కార్డు కోసం ఎదురు చూస్తుండగా వారిలో 11 లక్షల మందికి పైగా భారతీయులే! వీరిలో 4 లక్షల మంది తమ జీవితకాలంలో కార్డును కళ్లజూడలేరన్నది ఇమిగ్రేషన్ నిపుణుల మాట. అమెరికా ఏటా గరిష్టంగా 6.75 లక్షల గ్రీన్‌కార్డులు మాత్రమే జారీ చేస్తుంది. వాటిలో ఏ దేశానికీ 7 శాతానికి మించి ఇవ్వరాదన్న నిబంధన ఉంది. ఇదే భారతీయులకు పెద్ద అడ్డంకిగా మారింది. ప్రస్తుతం అమెరికాలో గ్రీన్కార్డున్న భారతీయుల సంఖ్య 3 లక్షలకు పైగా ఉంటుంది. గోల్డ్ కార్డు రాకతో... అమెరికాలో శాశ్వత నివాసానికి ట్రంప్ ఇటీవల కొత్తగా గోల్డ్ కార్డు స్కీమును ప్రకటించిన నేపథ్యంలో గ్రీన్‌కార్డు ప్రాధాన్యతను తగ్గించేలా వాన్స్ చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘‘ఇప్పటిదాకా గ్రీన్కార్డుంది. ఇకపై గోల్డ్‌కార్డు తెస్తున్నాం. గ్రీన్‌కార్డు ఇచ్చే సదుపాయాలన్నింటినీ ఇదీ ఇస్తుంది. వాటితో అదనంగా అమెరికాలో శాశ్వత నివాసానికి, పౌరసత్వానికి కూడా గోల్డ్‌కార్డు రాచమార్గం’’ అని ట్రంప్ చెప్పు కొచ్చారు. అమెరికాలోని అత్యున్నత వర్సిటీల్లో చదివే ప్రతిభావంతులు, భారతీయ విద్యా ర్థులు దేశం దాటకుండా ఆపడంలో తమ వలస విధానం విఫలమైందని ఆయన ఆక్షేపించారు. గోల్డ్కార్డుకు 50 లక్షల డాలర్లు (రూ.43.54 కోట్లు) ఫీజుగా నిర్ణయించారు. ‘‘కనీసం కోటి గోల్డ్‌కార్డులు అమ్మాలన్నది మా లక్ష్యం. తద్వారా వచ్చే ఆదాయంతో అమెరికా అప్పు తీరుస్తాం’’ అని ట్రంప్ ప్రకటించారు. 1990 నుంచి అమల్లో ఉన్న ఈబీ–5 వీసాలను గోల్డకార్డు భర్తీ చేసింది. -
కెనడాలో ఉద్యోగం కావాలా? 10 లక్షలపైగా ఖాళీలు..ఇంకా పెరగొచ్చు!
సాక్షి, న్యూఢిల్లీ: విదేశాల్లో ఉద్యోగం సంపాదించాలనుకునే వారికి గుడ్ న్యూస్. లక్షల ఉద్యోగాలు భర్తీకి కెనడా రారమ్మని ఆహ్వానిస్తోంది. కెనడాలో 10 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, భవిష్యత్తులో మరింత పెరగొచ్చని తాజా సర్వే వెల్లడించింది. దేశంలో పెద్దవాళ్లు ఎక్కువగా ఉండటం, ఎక్కువమంది రిటైర్మెంట్కు దగ్గర పడుతున్నకారణంగా భారీగా ఖాళీలు ఏర్పడ్డాయట. ఈ నేపథ్యంలో కెనడా ప్రస్తుతం 2022లో అత్యధిక సంఖ్యలో శాశ్వత నివాసితులను స్వాగతించడానికి సిద్ధమవుతోంది. సో..కెనడాకు ఎగిరిపోయి అక్కడే స్థిరపడేలా ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పొందాలనుకునేవారికి ఇదే సువర్ణావకాశం. (చదవండి: Hyderabad Student Vedant Anandwade: హైదరాబాదీకి బంపర్ ఆఫర్..సుమారు కోటిన్నర స్కాలర్షిప్) మే 2022 నాటి లేబర్ ఫోర్స్ సర్వే అనేక పరిశ్రమలలో పెరుగుతున్న కార్మికుల కొరతను హైలైట్ చేసింది. 2021, మే నుండి ఖాళీల సంఖ్య 3 లక్షలకు పైగా పెరిగిందని తెలిపింది. వృత్తిపరమైన, శాస్త్రీయ , సాంకేతిక సేవలు, రవాణా , గిడ్డంగులు, ఫైనాన్స్ , భీమా, వినోదం, రియల్ ఎస్టేట్ ఇలా ప్రతీ రంగంలోనూ రికార్డు స్థాయిలో ఖాళీగా ఉన్నాయి. వలసదారులు ఓపెన్ స్థానాలకు పర్మినెంట్ వీసాలకు డిమాండ్ పెరగనుందని వెల్లడించింది. కొన్ని రాష్ట్రాల్లో గతంలో కంటే ఇప్పుడు మరిన్ని పోస్టులు అందుబాటులో ఉన్నాయని మరో సర్వే తెలిపింది. (CSIR: టాప్ సైంటిఫిక్ బాడీకి తొలి మహిళా హెడ్‌గా కలైసెల్వి రికార్డు) అల్బెర్టా , అంటారియోలో, ఏప్రిల్‌లో ప్రతి ఓపెన్ పొజిషన్‌కు 1.1రేషియోలో నిరుద్యోగులు ఉన్నారు,ఈ నిష్పత్తి అంతకు ముందు సంవత్సరం 1.2 పోలిస్తే, ఈ మార్చికి 2.4 కు పెరిగింది. న్యూఫౌండ్‌ల్యాండ్, లాబ్రడార్లో ఖాళీగా ఉన్న ప్రతి స్థానానికి, దాదాపు నలుగురు నిరుద్యోగులు ఉన్నారు. నిర్మాణ పరిశ్రమలో ఖాళీలు కూడా ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో 89,900కి చేరుకున్నాయి, గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే దాదాపు 45 శాతం,మార్చి నుండి 5.4 శాతం పెరిగాయి. నోవా స్కోటియా, మానిటోబా రెండింటిలోనూ లాడ్జింగ్ , ఫుడ్ సర్వీసెస్ సెక్టార్లో 1,61 లక్షల ఓపెన్ పొజిషన్లు ఉన్నాయి. అలాగే వసతి, ఆహార సేవలు వరుసగా 13వ నెలలో కూడా అత్యధిక సంఖ్యలో ఖాళీలుండటం విశేషం.2022లోకెనడా రికార్డు స్థాయిలో 431,645 కొత్త శాశ్వత నివాసితులకు తలుపులు తెరవనుంది. 2022 మొదటి అర్ధభాగంలోనే, కెనడా ఇప్పటికే దాదాపు 2 లక్షలమందికి పర్మినెంట్ రెసిడెన్సీలుగా అవకాశం ఇచ్చింది. 2024 నాటికి 4.5 లక్షల టార్గెట్‌గా పెట్టుకుందని నివేదిక పేర్కొంది. తక్కువ మంది వ్యక్తులు వర్క్‌ఫోర్స్‌లోకి ప్రవేశించడంతోపాటు, 55 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సున్నవారు ముందుగానే రిటైర్ అవుతున్నారట. దీంతో కెనడా లేబర్ మార్కెట్ ఈ ఏడాది దారుణంగా పడిపోయింది. ఇటీవలి ఆర్బీసీ సర్వే ప్రకారం, కెనడియన్లలో మూడింట ఒక వంతు మంది ముందుగానే పదవీ విరమణ చేస్తున్నారు . పదవీ విరమణకు దగ్గరగా ఉన్న 10 మందిలో ముగ్గురు కరోనా మహమ్మారి కారణంగా ఆలస్యంగా రిటైర్ అవుతున్నారు. ఇది ఇలా ఉంటే కెనడాలో 2020లో, సంతానోత్పత్తి రేటు 1.4 రేషియోలో రికార్డు స్థాయికి పడిపోయింది. ఇదీ చదవండి : మీరు పీఎఫ్ ఖాతాదారులా? యూఏఎన్ నెంబరు ఎలా పొందాలో తెలుసా? -
ఖతర్ కీలక చట్టం: విదేశీయులకు గుడ్‌న్యూస్
సౌదీ నేతృత్వంలోని అరబ్ దేశాల నిషేధంతో తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిన ఖతర్, విదేశీయులకు గుడ్ న్యూస్ అందించింది. ఓ ల్యాండ్‌మార్కు బిల్లును ఖతర్ ఆమోదించింది. ఆ కీలక చట్టంతో ఖతర్‌కు వెళ్లే విదేశీయులకు శాశ్వత నివాస కార్డులు, కొత్త హక్కులు లభించనున్నాయి. ప్రస్తుతం ఖతర్ జనాభాలో విదేశీయులే ఎక్కువ. గల్ఫ్ ప్రాంతంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న తొలి దేశం ఇదే కావడం విశేషం. విదేశీయులు ప్రభుత్వ సర్వీసులు పొందడానికి ఈ చట్టం ఎంతో దోహదం చేస్తోంది. ఈ కొత్త చట్టం కింద కార్డుహోల్డర్స్ ఖతర్ జాతీయులగానే పరిగణించబడతారు. అంతేకాక అక్కడి రాష్ట్రాలు అందించే విద్యా, ఆరోగ్య పరమైన సర్వీసుల విషయంలో అన్ని ప్రయోజనాలను విదేశీయులు పొందుతారని ఖతర్ న్యూస్ ఏజెన్సీకి అధికారులు తెలిపారు. మిలటరీ, ప్రజా సంబంధమైన ఉద్యోగాల విషయంలో స్థానికుల తర్వాత వీరికి ప్రాధాన్యత ఇస్తామని అధికారులు చెప్పారు. స్థానిక భాగస్వామి అవసరం లేకుండా వాణిజ్యపరమైన కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చని, సొంత ఆస్తులను కలిగి ఉండొచ్చని ఖతర్ న్యూస్ ఏజెన్సీ(క్యూఎన్ఏ) రిపోర్టు చేసింది. విదేశీయులను పెళ్లి చేసుకున్న ఖతారి మహిళల పిల్లలకు, రాష్ట్రాలకు అవసరమైన ప్రత్యేకమైన ప్రతిభ కలిగిన ప్రజలకు, దేశాలనికి చెప్పుకోదగ్గ సేవలు అందించిన వారు ఈ కార్డులకు అర్హులవుతారని క్యూఎన్ఏ తెలిపింది. ఈ కొత్త చట్టం ఖతార్ ప్రధాన వార్తలలో నిలుపుతుందని, ఇతరులతో పోలిస్తే, మరింత ముందస్తుగా ఆలోచించే దేశంగా పేరొందుతుందని మధ్యప్రాచ్య, ఉత్తరాఫ్రికా అనాలిస్టు అలిసన్ వుడ్ చెప్పారు. ఇలాంటి రెసిడెన్స్ ప్రొగ్రామ్స్ ఇక ఎలాంటి దేశాల్లో లేవన్నారు. ఆయిల్ ధరలు తగ్గడంతో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో ఉన్న ఆరు గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒత్తిడిలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సౌదీ అరేబియా, ఒమెన్ మినహా మిగతా నాలుగు దేశాల్లో స్థానిక జనాభా కంటే కూడా విదేశీ వర్కర్లు, వారి కుటుంబసభ్యులే ఎక్కువ.