
విదేశాల్లో స్థిరపడాలనుకునే భారతీయుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అందుకే చాలా దేశాలు విదేశీయులకు తమ దేశంలో శాశ్వతంగా ఉండిపోయేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. జర్మనీ ప్రభుత్వం ఇప్పుడు రూ.11,500 లోపు ఫీజుతో శాశ్వత నివాస అనుమతిని (Settlement Permit) అందిస్తోంది. ఇది జర్మనీలో శాశ్వతంగా నివసించేందుకు అత్యంత భద్రమైన మార్గం. ఈ అనుమతితో మీరు కుటుంబంతో కలిసి స్వేచ్ఛగా జీవించవచ్చు, ఉద్యోగం చేయవచ్చు లేదా స్వయం ఉపాధి ద్వారా పని చేయవచ్చు.
జర్మనీలో స్కిల్డ్ వర్కర్ అంటే..
రెసిడెన్స్ యాక్ట్ ప్రకారం వీరు స్కిల్డ్ వర్కర్ కేటగిరీలోకి వస్తారు..
- జర్మన్ లేదా గుర్తింపు పొందిన విదేశీ డిగ్రీ కలిగినవారు
- జర్మనీలో సమానమైన వృత్తి శిక్షణ పొందినవారు
- ఈయూ బ్లూ కార్డ్ కలిగినవారు
- ఈయూ డెరెక్టివ్ 2016/801 ప్రకారం అంతర్జాతీయ పరిశోధకులు
ప్రధాన అర్హతలు
- సెక్షన్‌లు 18ఎ, 18బి, 18డి, 18జి ప్రకారం 3 సంవత్సరాలుగా చెల్లుబాటు అయ్యే నివాస అనుమతి కలిగి ఉండాలి
- జీవనాధారం కోసం ప్రభుత్వ సహాయంపై ఆధారపడకుండా ఉండాలి
- కనీసం 36 నెలలు పింఛను బీమా (statutory pension)లో చెల్లింపులు చేయాలి
- జర్మన్ బి1 సీఈఎఫ్‌ఆర్ స్థాయిలో భాషా నైపుణ్యం ఉండాలి
- “లివింగ్ ఇన్ జర్మనీ” పరీక్ష ద్వారా జర్మన్ సమాజం, చట్టాలపై ప్రాథమిక అవగాహన చూపించాలి
- కుటుంబానికి సరిపడిన నివాస స్థలం ఉండాలి
త్వరిత ప్రక్రియలు
ఈ కింది కొన్ని సందర్భాల్లో వేగంగా శాశ్వత అనుమతి పొందవచ్చు..
- ఈయూ బ్లూ కార్డ్: 27 నెలల ఉద్యోగం తర్వాత, బి1 జర్మన్ భాష ఉంటే 21 నెలలకే అర్హత
-జర్మన్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లు: 2 సంవత్సరాల ఉద్యోగం తర్వాత అర్హత
- అత్యంత నైపుణ్యవంతులు: శాస్త్రవేత్తలు, సీనియర్ టీచర్లు మొదలైనవారు వెంటనే అర్హత పొందవచ్చు
- స్వయం ఉపాధి: సెక్షన్ 21 ప్రకారం 3 సంవత్సరాల వ్యాపార అనుభవం తర్వాత అర్హత
జీవిత భాగస్వాములకు..
- స్కిల్డ్ వర్కర్ జీవిత భాగస్వామి సెక్షన్ 18సి ప్రకారం శాశ్వత అనుమతి కలిగి ఉండాలి
- 3 సంవత్సరాలుగా నివాస అనుమతి కలిగి ఉండాలి
- వారానికి కనీసం 20 గంటలు ఉద్యోగం చేయాలి
- బి1 స్థాయి జర్మన్ భాషా నైపుణ్యం ఉండాలి
అప్లికేషన్ ఖర్చు
జర్మనీలో శాశ్వత నివాస అనుమతి కోసం దరఖాస్తు చేయడానికి అయ్యే ఖర్చు సాధారణంగా 113 యూరోల (రూ .11,666) నుండి 147 యూరోల (రూ .15,176) వరకు ఉంటుంది. స్కిల్డ్ వర్కర్ లేదా హైలీ స్కిల్డ్ ప్రొఫెషనల్ వంటి మీ వర్క్ ప్రొఫైల్ ఆధారంగా ఫీజులు మారుతూ ఉంటాయి. ఇక అనువాదాలు, భాషా పరీక్ష రుసుములు, ఆరోగ్య బీమా ప్రీమియంలు వంటి ఇతర ఖర్చులు అదనం.
ఇదీ చదవండి: మా దేశం వచ్చేయండి.. శాశ్వతంగా ఉండిపోండి!