వారెన్ బఫెట్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరమే లేదు. ఎందుకంటే.. బెర్క్‌షైర్ హాత్వే చైర్‌పర్సన్ & దిగ్గజ పెట్టుబడిదారుడుగా ప్రపంచంలోని లక్షలాదిమంది ప్రజలకు సుపరిచయమే. ఈయన స్టాక్ మార్కెట్లో విజయం సాధించడానికి సులభమైన నియమాలను వెల్లడించారు. విజయవంతమైన పెట్టుబడికి.. మార్కెట్ అంచనాలతో సంబంధం లేదని, క్రమశిక్షణ, స్వీయ అవగాహన, మీ ఆలోచనలతో ఎక్కువ సంబంధం ఉందని పేర్కొన్నారు.
వారెన్ బఫెట్ ప్రకారం.. పెట్టుబడి విషయంలో వాస్తవికంగా ఉండటం గురించి చెబుతారు. మీరు అర్థం చేసుకున్నది తెలుసుకోవడమే కాకుండా, మీకు తెలియనిది తెలుసుకోవడం.. దానికి ప్రలోభపడకుండా ఉండటం ముఖ్యమని, ఇది స్టాక్ మార్కెట్లో విజయం సాధించడానికి దోహదపడుతుందని అంటారు.
తత్వశాస్త్రం గురించి మాట్లాడుతూ.. అదుపులేని దురాశ, దీర్ఘకాలిక రాబడికి అతిపెద్ద శత్రువులలో ఒకటి బఫెట్ హెచ్చరించారు. మీరు చాలా దురాశపరులైతే, అది విపత్తు అవుతుందని ఆయన అంటారు.
పెట్టుబడి అంటే అది క్లిష్టమైన ప్రక్రియ కాదంటారు బఫెట్. అయితే దీనికి ఖచ్చితంగా క్రమశిక్షణ అవసరం అని స్పష్టం చేశారు.
బఫెట్ తన పెట్టుబడి తత్వశాస్త్రంలో ఎక్కువ భాగాన్ని బెంజమిన్ గ్రాహం బోధనలకు ఆపాదించారు. దశాబ్దాల మార్కెట్ పరిణామం తర్వాత కూడా అతని ఆలోచనలు సాటిలేనివిగా ఉన్నాయని అతను నమ్ముతారు. ఈ ప్రాథమిక విధానం ప్రకారం.. మీరు స్టాక్‌లను వ్యాపారాలుగా భావించి, ఆపై మంచి వ్యాపారాన్ని ఏది చేస్తుందో అంచనా వేయాలని ఆయన అన్నారు. ఈ పద్దతిలో ప్రధానమైనది భద్రతా మార్జిన్ అని బఫెట్ అన్నారు.


