కొన్నాళ్లుగా బంగారం, వెండి ధరలు బ్రేకుల్లేకుండా దూసుకెళ్తున్నాయి. ఈ రోజు కూడా అదేబాటలో పయనించాయి. అయితే సాయంత్రానికి మరోమారు రేటు పెరగడంతో పసిడి ప్రియులు అవాక్కవుతున్నారు. ఉదయం 980 పెరిగిన పసిడి ధర.. సాయంత్రానికి దాదాపు డబుల్ అయింది. దీంతో రేటు ఊహకందని విధంగా పెరిగిపోయింది. అనూహ్యంగా వెండి కూడా 5000 పెరిగింది. ప్రస్తుతం దేశంలోని వివిధ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై నగరాల్లో ఉదయం రూ.1,23,500 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. సాయంత్రానికి రూ. 1,24,100 వద్దకు చేరింది. అంటే ఈ రోజు 24 గంటలు కాకముందే రూ. 400 పెరిగిందన్న మాట. (ఉదయం 750 రూపాయలు పెరిగిన గోల్డ్ రేటు, ఇప్పడు మరో 400 రూపాయలు పెరిగి.. మొత్తం రూ. 1350 పెరిగింది).
24 క్యారెట్ల గోల్డ్ విషయానికి వస్తే, రూ. 1470 పెరగడంతో 10 గ్రాముల ధర రూ. 1,35,380 వద్దకు చేరింది. (24 క్యారెట్ల గోల్డ్ రేటు ఉదయం 820 రూపాయలు పెరిగింది. సాయంత్రానికి మరో 650 రూపాయలు పెరగడంతో రెండూ కలిపి మొత్తం రూ. 1470 పెరిగింది).
ఢిల్లీలో కూడా బంగారం ధర ఒకే రోజు రెండోసారి పెరిగింది. దీంతో 24 క్యారెట్ల ధర రూ. 1460 పెరగడంతో 10 గ్రాముల రేటు రూ. 1,35,530 వద్ద నిలిచింది. 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 1350 పెరిగి.. 124250 రూపాయల వద్దకు చేరింది.
ఇదీ చదవండి: రూ.2.40 లక్షలకు వెండి.. కొత్త ఏడాదిలో కష్టమే!
ఇక చెన్నైలో విషయానికి వస్తే.. ఇక్కడ కూడా బంగారం ధరలు సాయంత్రానికి మరింత పెరిగాయి. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1580 పెరగడంతో రూ. 1,36,530 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,450 పెరిగి.. 1,25,150 రూపాయల వద్దకు చేరింది.
వెండి రేటు ఇలా
బంగారం ధరలు పెరిగినా.. దాదాపు ఎప్పుడూ స్థిరంగా ఉండే వెండి రేటు ఈ రోజు రెండోసారి పెరిగింది. ఉదయం కేజీ రేటు 3000 పెరిగింది. ఇప్పుడు ఆ ధర రూ. 5000లకు చేరింది. అంటే ఉదయం నుంచి.. సాయంత్రానికే మరో 2000 రూపాయలు పెరిగింది. దీంతో సిల్వర్ ధర రూ. 2,15,000లకు చేరింది.


