భారతదేశంలో బంగారం, వెండి ధరలు ఊహకందని రీతిలో పెరుగుతున్నాయి. ఇప్పటికే 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1.30 లక్షలు క్రాస్ చేయగా.. కేజీ వెండి రూ. 2 లక్షలు దాటేసింది. ఈ రెండు కాకుండా ప్లాటినం, పల్లాడియం, రోడియం, ఇరిడియం, రుతేనియం, ఓస్మియం వంటి విలువైన లోహాలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కానీ చాలామందికి తెలిసిన లోహాలు గోల్డ్, సిల్వర్, ప్లాటినం మాత్రమే. పెట్టుబడిదారులకు పల్లాడియం గురించి తెలుసుంటుంది.
ఇతర లోహాల సంగతి పక్కన పెడితే.. బంగారం వెండి ధరలు మాత్రమే ఎందుకు పెరుగుతున్నాయి. ప్లాటినం ధరలు ఎందుకు చాలా తక్కువ. దీనికి కారణం ఏమిటి?.. ఇతర లోహాల పరిస్థితి ఏమిటి? అనే విషయాలను ఇక్కడ క్షుణ్ణంగా పెరిశీలిద్దాం..
బంగారం ధరలు పెరగడానికి కారణాలు
ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, డాలర్ విలువ & యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు, పండుగలు, పెళ్లిళ్లు మొదలైన శుభకార్యాల కారణంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. పెట్టుబడిదారులు బంగారంపైన ఇన్వెస్ట్ చేయడం, డిమాండుకు తగ్గ.. బంగారం సరఫరా లేకపోవడం కూడా ధరలు పెరగడానికి కారణాలు అవుతున్నాయి.
స్టాక్ మార్కెట్లలో పెట్టే పెట్టుబడులలో.. లాభనష్టాలు ఉంటాయి. కానీ బంగారం పెట్టే పెట్టుబడి భద్రంగా ఉంటుందని భావిస్తారు. ఈ కారణంగానే పెట్టుబడిదారులు.. మార్కెట్స్ కుప్పకూలినప్పుడు గోల్డ్ మీద భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీనివల్ల పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి.
వెండి ధరలు పెరగడానికి కారణాలు
ఈ ఏడాది వెండి ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. దీనికి ప్రధాన కారణం డిమాండ్‌కు తగిన సరఫరా లేకపోవడం ఒక కారణం అయితే.. ఎలక్ట్రానిక్స్, ఉపకరణాల తయారీలలో వెండి వినియోగం పెరిగిపోవడం కూడా మరో కారణం. నీటి శుద్ధి, వైద్య రంగం, పారిశ్రామిక రసాయనాలు, ఉత్ప్రేరకాలలో కూడా వెండి వినియోగం విరివిగా ఉంది. ఎలక్ట్రానిక్స్, కండక్టర్లు, సోలార్ ప్యానెల్స్, విద్యుత్ బ్యాటరీలలో కూడా వెండిని ఉపయోగిస్తారు.
ఆభరణాలుగా మాత్రమే కాకుండా.. వెండిని పారిశ్రామిక రంగంలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీనివల్ల.. సిల్వర్ రేటు రెండు లక్షల రూపాయలు దాటేసింది.
ప్లాటినం ధరలు ఎందుకు తక్కువ?
➤బంగారం, వెండితో పోలిస్తే.. ప్లాటినం ధరలు చాలా తక్కువ. దీనికి చాలా కారణాలు ఉన్నాయి.
➤బంగారం, వెండి ఆభరణాలకు ఉన్నంత డిమాండ్.. ప్లాటినం ఆభరణాలు లేదు.
➤ప్లాటినంపై పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్ల సంఖ్య తక్కువ
➤ఇండస్ట్రీల్ వినియోగం ఎక్కువగా ఉంది.
➤ప్లాటినం ముఖ్యంగా దక్షిణ ఆఫ్రికా, రష్యాలలో మాత్రమే ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.
➤డిమాండ్ తక్కువగా ఉండటం వల్లనే.. ప్లాటినం ధరలు తక్కువగా ఉన్నాయి.
ఇతర లోహాలు
బంగారం, వెండి మాదిరిగానే.. ప్లాటినం, పల్లాడియం, రోడియం, ఇరిడియం, రుతేనియం, ఓస్మియం కూడా విలువైన లోహాలు. అయితే వీటికున్న డిమాండ్ భారతదేశంలో చాలా తక్కువ. ఈ కారణంగానే వీటి ధరలు కూడా అలాగే ఉన్నాయి. బహుశా భవిష్యత్తులో వీటి ధరలు పెరుగుతాయా? అనేది తెలియాల్సి ఉంది.


