బంగారం ధర రూ. 1.30 లక్షలు (24 క్యారెట్స్ 10 గ్రామ్స్) దాటితే.. కేజీ వెండి రేటు రూ. 2.13 లక్షలకు చేరింది. సిల్వర్ రేటు మరింత పెరిగి 2026కు సుమారు రూ. 2.40 లక్షలకు చేరుకుంటుందని స్టాక్ బ్రోకర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సర్వీస్ కంపెనీ 'యాక్సిస్ సెక్యూరిటీస్' వెల్లడించింది.
యాక్సిస్ సెక్యూరిటీస్ ప్రకారం.. వెండి రేటు మునుపెన్నడూ లేనంతగా పెరుగుతూనే ఉంది. 2025 ప్రారంభంలో రూ. 80వేలు వద్ద ఉన్న సిల్వర్ రేటు.. ఇప్పుడు గణనీయంగా పెరిగి, రెండు లక్షల రూపాయలు దాటేసింది. దీనికి కారణం మార్కెట్లో వెండికి పెరుగుతున్న డిమాండ్ అని స్పష్టమవుతుంది.
ఆభరణాలుగా మాత్రమే కాకుండా.. పారిశ్రామిక రంగంలో వెండి వినియోగం పెరగడం, దీంతో డిమాండ్ ఎక్కువ కావడం వల్ల కూడా సిల్వర్ రేటు ఊహకందని విధంగా పెరిగింది. సోలార్ ఫోటోవోల్టాయిక్ రంగంలో మాత్రమే వెండి వినియోగం నాలుగేళ్లలో రెండింతలు పెరిగింది. రాబోయే రోజుల్లో కూడా వెండికి డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఈ రోజు వెండి ధరలు
డిసెంబర్ 14న రూ. 2.10 లక్షల వద్ద ఉన్న కేజీ వెండి రేటు.. ఈ రోజు రూ. 2.13 లక్షలకు చేరింది. అంటే ఈ ఒక్క రోజులోనే సిల్వర్ టు రూ. 3000 పెరిగిందన్నమాట. హైదరాబాద్, విజయవాడ, ముంబై, బెంగళూరులో సిల్వర్ రేటు ఒకేలా ఉన్నా.. ఢిల్లీలో మాత్రం కొంత తక్కువగా ఉంది. ఇక్కడ కేజీ వెండి రేటు రూ. 2,00,900. దీన్నిబట్టి చూస్తే.. దేశంలో ఢిల్లీలోనే సిల్వర్ రేటు కొంత తక్కువని స్పష్టమవుతోంది.
ఇదీ చదవండి: వారంలో నాలుగు రోజులే వర్క్!: కొత్త పని విధానం..


