భారతదేశంలో.. చాలా ప్రభుత్వ & ప్రైవేట్ సంస్థలు వారానికి 5 రోజుల పని షెడ్యూల్‌ను పాటిస్తున్నాయి. కానీ ఇప్పుడు చాలామంది కార్మికులు వారానికి నాలుగు రోజులు పని చేసి మూడు రోజులు సెలవు తీసుకోవాలని కోరుకుంటారు. జపాన్, స్పెయిన్ & జర్మనీ వంటి దేశాలు వారానికి 4 రోజుల పని విధానాన్ని పాటిస్తున్నాయి. ఇది ఇండియాలో సాధ్యమవుతుందా? అని చాన్నాళ్లుగా చర్చ జరుగుతూనే ఉంది. ఈ విషయంపైనే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ చేసింది.
మంత్రిత్వ శాఖ.. వారానికి నాలుగురోజుల పనికి సమ్మతించినట్లు పోస్టులో వెల్లడించింది. అయితే కొన్ని షరతులను కూడా వెల్లడించింది. సవరించిన కార్మిక నియమావళి ప్రకారం.. నాలుగు రోజులు, రోజుకు 12 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. మిగిలిన మూడు రోజులు వేతనంతో కూడిన సెలవులుగా పొందవచ్చని స్పష్టం చేసింది.
మంత్రిత్వ శాఖ ప్రకారం వారానికి 48 గంటలు (4 రోజులు, రోజుకు 12 గంటలు) పనిచేయాలన్న మాట. ఉద్యోగులు దీనికి సిద్ధంగా ఉంటే.. ఎలాంటి చట్టపరమైన అడ్డంకులు ఉండవు. ఈ సమయంలో రోజుకు 12 గంటలు పనిచేస్తే.. ఓవర్ టైం కింద జీతం పెరుగుతుందా? అనే ప్రశ్న తలెత్తింది. వారంలో 48 గంటల కంటే ఎక్కువ పనిచేస్తే.. ఓవర్ టైంకి అదనపు చెల్లింపులు ఉంటాయి మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
The Labour Codes allow flexibility of 12 hours for 4 workdays only, with the remaining 3 days as paid holidays.
Weekly work hours remain fixed at 48 hours and overtime beyond daily hours must be paid at double the wage rate.#ShramevJayate pic.twitter.com/5udPMqRXbg— Ministry of Labour & Employment, GoI (@LabourMinistry) December 12, 2025
నాలుగు లేబర్ కోడ్‌లు
భారతదేశంలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కార్మిక చట్టాలకు కేంద్రం గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. 29 కార్మిక చట్టాల స్థానంలో కొత్తగా నాలుగు లేబర్ కోడ్‌లు.. వచ్చినట్లు కార్మిక శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ అధికారికంగా పేర్కొన్నారు. అవి ''వేతనాల కోడ్ (2019), పారిశ్రామిక సంబంధాల కోడ్ (2020), సామాజిక భద్రత కోడ్ (2020), వృత్తి భద్రత, ఆరోగ్యం & పని పరిస్థితుల కోడ్ (OSHWC) (2020)''.
వేతనాల కోడ్ (2019): కనీస వేతనాలను నోటిఫైడ్ 'షెడ్యూల్డ్ ఉద్యోగాల'కు అనుసంధానించే మునుపటి వ్యవస్థను భర్తీ చేస్తూ, అన్ని రంగాలలో కనీస వేతనాలు & సకాలంలో వేతనాల చెల్లింపు హక్కును ఈ కోడ్ వివరిస్తుంది.
పారిశ్రామిక సంబంధాల కోడ్ (2020): ట్రేడ్ యూనియన్లపై నియమాలు, వివాద పరిష్కారం, తొలగింపులు/మూసివేతలకు సంబంధించిన షరతులను ఒకే చట్టంగా చేయడం, కొన్ని ప్రక్రియల ద్వారా పారిశ్రామిక సమ్మతిని క్రమబద్ధీకరించడం ఈ కోడ్ లక్ష్యం.
సామాజిక భద్రత కోడ్ (2020): సామాజిక భద్రత, పీఎఫ్, ఈఎస్ఐసీ, ఇతర సంక్షేమ చర్యలకు చట్టపరమైన నిర్మాణాన్ని విస్తరిస్తుంది. అంతే కాకుండా మొదటిసారిగా గిగ్ & ప్లాట్‌ఫామ్ కార్మికులను సామాజిక భద్రతా పథకాల పరిధిలోకి తీసుకురావడానికి స్పష్టమైన ఎనేబుల్ ఫ్రేమ్‌వర్క్‌ను సృష్టిస్తుంది.
OSHWC కోడ్ (2020): ఈ కోడ్ కార్యాలయ భద్రత & పని పరిస్థితులపై బహుళ చట్టాలను ఒకే ప్రమాణాల సమితిలో విలీనం చేస్తుంది.
ఇదీ చదవండి: ప్రపంచంలో అత్యంత సంపన్న రాజకీయ నాయకులు


