కృత్రిమ మేధ(ఏఐ) చాలా సాంకేతిక పనులను నిర్వహిస్తున్నందున ఉద్యోగ ప్రపంచంలో భావోద్వేగ మేధ(EQ), ట్రేడిషనల్ ఇంటెలిజెన్స్(సాంప్రదాయ మేధ IQ) కీలకమవుతున్నాయని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అన్నారు. అదే సమయంలో భావోద్వేగ మేధ లేకుండా సాంప్రదాయ మేధపై మాత్రమే ఆధారపడలేమని అభిప్రాయపడ్డారు. ఇటీవల యాక్సెల్ స్ప్రింగర్ సీఈఓ మాథియాస్ డాఫ్నర్‌తో జరిగిన ‘ఎండీ మీట్స్’ పోడ్‌కాస్ట్‌లో నాదెళ్ల ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
‘నాయకులకు కేవలం ఈక్యూ లేకుండా ఐక్యూ ఉంటే సరిపోదు. సమగ్ర నాయకత్వానికి ఈక్యూతోపాటు ఐక్యూ కావాల్సిందే. ఏఐ సాంకేతిక పనులను ఎక్కువగా నిర్వహిస్తున్న తరుణంలో సాఫ్ట్ స్కిల్స్ కీలకంగా మారాయి. ఇది వ్యాపారంలో ముఖ్యమైన నైపుణ్యంగా, ఒక సూపర్ పవర్‌గా మారుతోంది. ఏఐ ఆధారిత ప్రపంచంలో మానవ సహకారం, సంబంధాలు మరింత ప్రాముఖ్యత సంతరించుకుంటాయి’ అని చెప్పారు.
ఏఐ రేసులో మెరుగైన పోటీ కోసం నాదెళ్ల మైక్రోసాఫ్ట్ నాయకత్వంలో ఇటీవల అనేక కీలక మార్పులు చేశారు. క్లౌడ్ కంప్యూటింగ్‌లో విజయం సాధించడానికి ఇటీవల క్లౌడ్ ఎక్స్‌పర్ట్ రోల్ఫ్ హార్మ్స్‌ను ఏఐ ఎకనామిక్స్ అడ్వైజర్‌గా నియమించారు. అక్టోబర్ 2025లో మైక్రోసాఫ్ట్ కమర్షియల్ బిజినెస్ సీఈఓని నియమించి తాను పూర్తిగా ఏఐ టెక్నికల్ అంశాలపై దృష్టి పెడుతున్నారు. కంపెనీ తమ కొత్త సూపర్ ఇంటెలిజెన్స్ టీమ్‌తో ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్(AGI) వైపు పయనిస్తోంది.
ఇదీ చదవండి: భవిష్యత్ యుద్ధాలు ‘చిట్టి’లతోనే!


