ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాబోయే రోజుల్లో ప్రమాదమని చాలామంది.. గతకొంతకాలంగా హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా మైక్రోసాఫ్ట్ ఏఐ చీఫ్ 'ముస్తఫా సులేమాన్' కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏఐ తెలివిగా రోజురోజుకు మారుతోంది. గూగుల్, ఓపెన్ఏఐ, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద టెక్ కంపెనీలు.. దీనిని మరింత కొత్తగా మార్చడానికి బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నాయి. అంతేకాకుండా.. ఏఐ ఇప్పటికే మనుషులు చేసే పనులను చేసేస్తోంది. కానీ ప్రస్తుతానికి మనుషులు మాదిరిగా ఆలోచించే జ్ఞానం మాత్రం పొందలేదు. రానున్న రోజుల్లో ఇది మరింత స్మార్ట్‌గా తయారయ్యే అవకాశం ఉంది. దీనికోసం చాలా కంపెనీలు కృషి చేస్తున్నాయని ముస్తఫా సులేమాన్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: నియామకాలు మళ్లీ షురూ!.. సత్య నాదెళ్ల
నిజానికి.. ఎంత ఖర్చు చేసినా.. మనిషిలా ఆలోచించే జ్ఞానం, తెలివితేటలు ఏఐకు ఎప్పటికీ రావు. దీనికోసం దిగ్గజ కంపెనీలు చేసే ప్రయత్నాలను ఆపాలని ముస్తఫా సులేమాన్ అన్నారు. ఆఫ్రోటెక్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. జీవసంబంధమైన జీవులు మాత్రమే నిజమైన భావోద్వేగం.. బాధలను అనుభవించగలవు. కాబట్టి ఏఐ సొంతంగా ఆలోచించాలి అనే ప్రాజెక్టులు మానేసి.. మనిషికి సహాయం చేసే ఏఐ ప్రాజెక్టులపై పనిచేయడం ఉత్తమం అని డెవలపర్లకు సూచించారు.


