ఇప్పటి వరకు ఉద్యోగులను తొలగిస్తున్న దిగ్గజ కంపెనీలు.. ఉద్యోగ నియమకాలను చేపట్టడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగులను మళ్ళీ విస్తరించడానికి సిద్ధంగా ఉందని సీఈఓ సత్య నాదెళ్ల పేర్కొన్నారు.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో.. కంపెనీ మరింత వృద్ధి చెందడమే లక్ష్యంగా ఉద్యోగ నియామకాలను చేపట్టనున్నట్లు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల.. బీజీ2 పాడ్‌కాస్ట్‌లో వెల్లడించారు. కొత్తగా చేరే ఉద్యోగులకు ఏఐ గురించి బాగా అవగాహన ఉండాలని, వారికి మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్, గిట్‌హబ్ ఏఐ కోడింగ్ హెల్పర్ వంటి వాటికి సంబంధించిన యాక్సెస్ ఇవ్వనున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు. ఉద్యోగులు ఏఐ సాయంతో.. మరింత వేగంగా పనిచేయడానికి కంపెనీ సన్నద్ధమవుతోంది స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ఉద్యోగం పోతుందన్న భయం: రోజుకు రెండు గంటలే నిద్ర!
2025 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి.. మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల సంఖ్య 2,28,000గా ఉంది. అంటే అంతకు ముందు కంపెనీ సుమారు 15,000 మంది ఉద్యోగులను తొలగించింది. 2022 తరువాత కంపెనీ నియమాలను బాగా తగ్గించింది. అయితే ఇప్పుడు ఏఐ రంగంలో దూసుకెళ్లడానికి.. నైపుణ్యం కలిగిన ఉద్యోగులను నియమించుకోవాలని చూస్తోంది. అయితే ఎంత మందిని నియమించుకోనుందనే విషయాన్ని వెల్లడించలేదు.


