రిలయన్స్ జియో తన కొత్త ప్రీపెయిడ్ టారిఫ్ పోర్ట్‌ఫోలియోను ''హ్యాపీ న్యూ ఇయర్ 2026'' ప్లాన్‌లను ఆవిష్కరించింది. ఇందులో నెల రోజుల ప్లాన్, ఏడాది ప్లాన్ రెండూ ఉన్నాయి. ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
హీరో యాన్యువల్ రీఛార్జ్
ఏడాది పాటు రీఛార్జ్ కావాలనుకునే వారి కోసం రిలయన్స్ జియో ఈ ప్లాన్ పరిచయం చేసింది. రూ. 3599లతో రీఛార్జ్ చేసుకుంటే.. 365 రోజులు చెల్లుబాటు అవుతుంది. రోజుకు 2.5 జీబీ 5జీ డేటా, 100 SMSలు, అపరిమిత కాల్స్ పొందవచ్చు. అదనంగా గూగుల్ జెమిని ప్రో ప్లాన్‌కు 18 నెలల ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు.

సూపర్ సెలబ్రేషన్ మంత్లీ ప్లాన్
సూపర్ సెలబ్రేషన్ మంత్లీ ప్లాన్ పేరుతో 500 రూపాయల రీఛార్జ్ ప్లాన్ కూడా జియో ప్రకటించింది. ఇది 28 రోజుల చెల్లుబాటు ఉన్నప్పటికీ.. రోజుకు 2జీబీ డేటా, 100 SMSలు, అపరిమిత కాల్స్ పొందవచ్చు. అదనంగా ఓటీటీ ప్రయోజనాలు (యూట్యూబ్ ప్రీమియం, జియో హాట్‌స్టార్, సోని లివ్, జీ5 మొదలైనవి) లభిస్తాయి. యాన్యువల్ ప్లాన్ మాదిరిగానే 18 నెలల ఉచిత గూగుల్ జెమిని ప్రో ప్లాన్ కూడా పొందవచ్చు.
ఫ్లెక్సీ ప్యాక్
ఫ్లెక్సీ ప్యాక్ పేరుతో.. 103 రూపాయల రీఛార్జ్ ప్లాన్ కూడా తీసుకొచ్చింది. దీని వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే. అయితే ఇందులో కేవలం డేటా మాత్రం లభిస్తుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న వినియోగదారుడు.. హిందీ, ఇంటర్నేషనల్, ప్రాంతీయ ప్యాక్‌లలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: ఒక రీఛార్జ్.. ఏడాది పాటు డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్


