భారతదేశంలో టెలికాం రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా, బీఎస్‌ఎన్‌ఎల్ కంపెనీలు తమ అగ్రస్థానాలను దక్కించుకోవడానికి వివిధ ప్రీపెయిడ్ & పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను ఎప్పటికప్పుడు ప్రవేశపెడుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికామ్ సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) ఇప్పుడు తాజాగా 72 రోజుల ప్లాన్ తీసుకొచ్చింది.
BSNL పోర్ట్‌ఫోలియోలో అత్యుత్తమ ప్రీపెయిడ్ ప్లాన్‌లలో ఒకటి రూ. 500 కంటే తక్కువ ధరకే లభిస్తుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయని సంస్థ తెలిపింది.
రూ.485 ప్రీపెయిడ్ ప్లాన్
బీఎస్ఎన్ఎల్ పరిచయం చేసిన ఈ రూ.485 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా.. యూజర్ అపరిమిత కాల్స్, రోజుకు 2జీబీ డేటా, 100 ఎస్ఎమ్ఎస్/రోజుకు లభిస్తాయి. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 72 రోజులు మాత్రమే.
72 Days of Smart Savings in One Recharge!
BSNL’s ₹485 Plan gives you 72 days of unlimited calls, 2GB/day data & 100 SMS/day.
Now recharge via BReX: https://t.co/41wNbHpQ5c
#BSNL #BSNLRecharge #BSNL4G pic.twitter.com/t6IyOzc0cA— BSNL India (@BSNLCorporate) November 23, 2025
ఇప్పటికే రూ.251 రీఛార్జ్ ప్లాన్
బీఎస్ఎన్ఎల్ స్టూడెంట్ ప్లాన్ పేరుతో పరిచయం చేసిన ఈ రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 251 మాత్రమే. వ్యాలిడిటీ 28 రోజులు. అంటే రోజుకు 8.96 రూపాయలన్నమాట. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. ఉచిత కాలింగ్, డేటా, ఎస్ఎమ్ఎస్ ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్లాన్ పరిమిత కాలం మాత్రమే (నవంబర్ 14 నుంచి డిసెంబర్ 14 వరకు) అందుబాటులో ఉంటుంది.
28 రోజులు అపరిమిత కాల్స్ మాత్రమే కాకుండా 100జీబీ హైస్పీడ్ డేటా, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు పొందవచ్చు. ఇది బీఎస్ఎన్ఎల్ కస్టమర్లందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవాలనుకునే కస్టమర్లు.. బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్‌ను సందరించడం ద్వారా, అధికారిక వెబ్‌సైట్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు.
ఇదీ చదవండి: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ ఇచ్చే బ్యాంకులు


