రూ.225 రీఛార్జ్ ప్లాన్.. రోజుకు 3జీబీ డేటా! | BSNL Introduces an Upgraded Rs 225 Recharge Plan | Sakshi
Sakshi News home page

BSNL: రూ.225 రీఛార్జ్ ప్లాన్.. రోజుకు 3జీబీ డేటా!

Jan 5 2026 6:48 PM | Updated on Jan 5 2026 7:22 PM

BSNL Introduces an Upgraded Rs 225 Recharge Plan

బీఎస్ఎన్ఎల్ 365 రోజుల ప్లాన్ వెల్లడించిన తరువాత.. నెల రోజుల ప్లాన్ ప్రకటించింది. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా వంటి టెలికామ్ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఈ లేటెస్ట్ ప్లాన్ తీసుకొచ్చింది.

బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన రూ. 225 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ ద్వారా ఇప్పుడు రోజుకు 3జీబీ డేటా పొందవచ్చు (గతంలో ఈ ప్లాన్ ద్వారా రోజుకు 2.5 జీబీ డేటా లభించేది). ఈ ప్లాన్ ఆఫర్ కేవలం ఈ నెల 31వరకు (జనవరి 31) మాత్రమే అందుబాటులో ఉంటుందని సంస్థ వెల్లడించింది.

బీఎస్ఎన్ఎల్ యాన్యువల్ ప్లాన్
బీఎస్ఎన్ఎల్ ప్రకటించిన 365 రోజుల ప్లాన్ కోసం.. యూజర్లు 2799 రూపాయలు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. న్యూ ఇయర్ సందర్భంగా కంపెనీ ఈ లేటెస్ట్ ప్లాన్ తీసుకొచ్చింది. ఇతర టెలికామ్ కంపెనీల వార్షిక ప్లాన్లతో పోలిస్తే.. బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ప్లాన్ చాలా తక్కువే.

బీఎస్ఎన్ఎల్ యూజర్లు ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. రోజుకు 3జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజులు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లను పొందవచ్చు. అంటే రూ. 2799తో రీఛార్జ్ చేసుకుంటే.. ఏడాది మొత్తం అపరిమిత కాల్స్ మాట్లాడుకోవచ్చన్నమాట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement