బ్లూ కలర్ నెంబర్ ప్లేట్.. వాళ్లకు మాత్రమే ఎందుకు? | Why Some Cars Have Blue Colour Number Plates in India Know The Details Here | Sakshi
Sakshi News home page

బ్లూ కలర్ నెంబర్ ప్లేట్.. వాళ్లకు మాత్రమే ఎందుకు?

Feb 23 2026 9:03 PM | Updated on Feb 23 2026 9:32 PM

Why Some Cars Have Blue Colour Number Plates in India Know The Details Here

సాధారణంగా రోడ్డుపై కనిపించే వాహనాల నెంబర్ ప్లేట్స్ వైట్, ఎల్లో, గ్రీన్ గంగులలో ఉండటం చాలామంది గమనించి ఉంటారు. అయితే అరుదుగా బ్లూ కలర్ నెంబర్ ప్లేట్ కూడా చూసి ఉంటారు. ఎప్పుడైనా ఇలాంటి కలర్ నెంబర్ ప్లేట్ ఎందుకు అరుదుగా కనిపిస్తుంది?, దీనిని ఎవరికి కేటాయిస్తారు? అని ఆలోచించారా.. అయితే ఆ ప్రశ్నలకు సమాధానం ఈ కథనంలో తెలుసుకుందాం.

బ్లూ కలర్ నెంబర్ ప్లేట్.. ప్రధానంగా విదేశీ దౌత్యవేత్తలు & రాయబార కార్యాలయాలకు చెందిన వాహనాలకు కేటాయిస్తారు. నెంబర్ ప్లేట్ రంగును బట్టి దౌత్య సిబ్బందికి చెందిన వాహనాలు అని.. అధికారులు గుర్తించడంలో సహాయపడుతుంది. ఇది వ్యక్తిగత ప్రయోజనం కోసం కాదు, అధికారిక ప్రయోజనానికి మాత్రమే.

బ్లూ కలర్ నెంబర్ ప్లేట్ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. ముఖ్యంగా వియన్నా కన్వెన్షన్ ఆన్ డిప్లొమాటిక్ రిలేషన్స్ ప్రకారం సభ్య దేశాలు దౌత్య సంబంధాల విషయంలో కొన్ని నియమాలను పాటిస్తాయి. భారతదేశం కూడా ఆ ఒప్పందానికి సభ్యదేశం కావడంతో ఈ విధానం అమలులో ఉంది.

నీలం రంగు బ్యాక్‌గ్రౌండ్‌పై తెలుపు అక్షరాలు ఉండటం వల్ల ఈ వాహనాలు సులభంగా గుర్తించవచ్చు. సాధారణ వ్యక్తిగత వాహనాలకు తెలుపు నెంబర్ ప్లేట్లు, కమర్షియల్ వాహనాలకు పసుపు నెంబర్ ప్లేట్లు ఉంటాయి. అందువల్ల ట్రాఫిక్ పోలీసులు దౌత్య వాహనాలను త్వరగా గుర్తించగలుగుతారు.

ఈ వాహనాల నెంబర్ ప్లేట్‌పై తెలుపు రంగులో అక్షరాలు & సంఖ్యలు ఉంటాయి. కొన్ని ప్లేట్లపై CD లేదా CC వంటి గుర్తులు కనిపిస్తాయి. CD అంటే దౌత్యవేత్తలకు చెందిన వాహనం, CC అంటే కాన్సులేట్ అధికారులకు చెందిన వాహనం.

దౌత్యవేత్తలకు అంతర్జాతీయ చట్టాల ప్రకారం.. కొన్ని ప్రత్యేక హక్కులు. వారికి డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ అనే సదుపాయం కూడా లభిస్తుంది. అయితే.. దీని అర్థం వారు చట్టానికి అతీతులు కాదు. ఏదైనా ఉల్లంఘనలకు పాల్పడితే.. సంబంధిత దేశం ఆ వ్యక్తిని వ్యక్తిత్వం లేని వ్యక్తిగా ప్రకటించి దేశం విడిచి వెళ్లమని చెప్పే అవకాశం ఉంది. కాబట్టి వారు కూడా తప్పకుండా రహదారి నియమాలు & భద్రతా ప్రమాణాలను పాటించాలి.

ఇదీ చదవండి: 'అందుకే బంగారం ధరలు పెరుగుతున్నాయ్': నిర్మలా సీతారామన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement