
గతేడాదిలో 92% పెరుగుదల
వర్క్ ఇండియా సర్వే
ముంబై: గతేడాది బ్లూ–కాలర్(ఆఫీసేతర) విభాగంలో గిగ్ ఉద్యోగాలు 92% పెరిగినట్లు బ్లూ, గ్రే కాలర్ రిక్రూట్మెంట్ ప్లాట్‌ఫామ్ వర్క్ ఇండియా నివేదిక పేర్కొంది. వేగంగా విస్తరిస్తున్న ఈ–కామర్స్, ఫుడ్ డెలివరీ, రైడింగ్ ప్లాట్ఫామ్ల్లో కారి్మకులకు పెరుగుతున్న డిమాండ్‌కు ఇది సంకేతమని సర్వే తెలిపింది. ‘‘క్విక్ కామర్స్ కంపెనీలు కేవలం డిమాండ్ సృష్టించడమే కాదు. నమ్మకమైన ఆదాయ వనరులుగా మారాయి.
చాలా మంది అభ్యర్థులకు ముఖ్యంగా చిన్న పట్టణాల్లో డెలివరీ ఉద్యోగం కేవలం పార్ట్‌టైం జాబ్ మాత్రమే కాకుండా కెరీర్ ఎంపికగా మారింది’’ అని వర్క్ ఇండియా సీఈవో, వ్యవస్థాపకులు నీలేష్ దుంగర్వాల్ తెలిపారు. గిగ్ రోల్స్ ఉద్యోగాలకు ఇప్పటికీ డిమాండ్ బలంగా ఉంది. మొత్తం దరఖాస్తుల పెరుగుదల 63 శాతంగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. లాస్ట్ మైల్ లాజిస్టిక్ ఉద్యోగాలకు కేంద్రాలైన ఢిల్లీ, అహ్మదాబాద్, కోల్కత్తా నగరాల్లో ఈ సర్వే నిర్వహించారు.