పండగ జోష్‌లో అమెజాన్‌  | Amazon Now doubles footprint to 120 another cities ahead of festive season | Sakshi
Sakshi News home page

పండగ జోష్‌లో అమెజాన్‌ 

Oct 3 2026 5:08 AM | Updated on Oct 3 2026 5:08 AM

Amazon Now doubles footprint to 120 another cities ahead of festive season

మరో 120 నగరాలకు అమెజాన్‌ నౌ విస్తరణ 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: పండు గ సీజన్‌లో అమ్మకాలను పెంచుకోవడంపై ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా తమ అల్ట్రా ఫాస్ట్‌ డెలివరీ సరీ్వసులైన అమెజాన్‌ నౌ విభాగాన్ని మరో 120 పైగా నగరాలకు విస్తరించింది. దీనితో విశాఖ, కొచ్చి తదితర నగరాల్లో కూడా ఈ సేవలు ఇప్పుడు అందుబాటులోకి వచి్చనట్లు సంస్థ తెలిపింది. 

నిత్యావసరాలు, ఆహారోత్పత్తులు, ఫ్యాషన్, గృహోపకరణాలు మొదలైన ఉత్పత్తులను దీని ద్వారా పొందవచ్చు. దాదాపు 800 మైక్రో–ఫుల్‌ఫిల్‌మెంట్, అర్బన్‌ ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్ల ద్వారా ఆర్డర్లను డెలివరీ చేస్తున్నట్లు అమెజాన్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ (ఎవ్రీడే ఎజెన్షియల్స్‌) హర్‌‡్ష గోయల్‌ తెలిపారు. మరోవైపు, అక్టోబర్‌ 8 నుంచి గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ను అమెజాన్‌ ప్రారంభించనుంది. ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్‌ కార్డులపై 10 శాతం, అమెజాన్‌ పే ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ తదితర ఆఫర్లను ఈ సందర్భంగా అందించనుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement