అమెజాన్‌ కొలువుల ‘పండుగ’ | Amazon India has created over 1. 6 lakh seasonal work opportunities across its pan-India | Sakshi
Sakshi News home page

అమెజాన్‌ కొలువుల ‘పండుగ’

Sep 3 2026 4:44 AM | Updated on Sep 3 2026 4:44 AM

Amazon India has created over 1. 6 lakh seasonal work opportunities across its pan-India

1.6 లక్షలకు పైగా సీజనల్‌ ఉద్యోగాల కల్పన 

పికప్, ప్యాకింగ్, షిప్పింగ్‌ విభాగాల్లో శిక్షణ

న్యూఢిల్లీ: పండుగ సీజన్‌ డిమాండ్‌ కోసం ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఇండియా సన్నాహాలు చేసుకుంటోంది. ఈ–కామర్స్, క్విక్‌ కామర్స్‌ వ్యాపారం కోసం నెట్‌వర్క్‌వ్యాప్తంగా 1,60,000 పైచిలుకు సీజనల్‌ ఉద్యోగావకాశాలు కల్పించినట్లు వెల్లడించింది. వారణాసి, కొచ్చి, ఘాజియాబాద్, జలంధర్, రాంచీ, సేలం, గోరఖ్‌పూర్‌లాంటి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి భారీ మెట్రోల వరకు దేశవ్యాప్తంగా 400 నగరాల్లో ఈ మేరకు నియామకాలు చేసినట్లు పేర్కొంది. ఇప్పటికే పండుగ సీజన్‌ కోసం మెజారిటీ ఉద్యోగాలను తీసుకుని, వారికి శిక్షణ ప్రారంభించినట్లు వివరించింది. 

కొత్త అసోసియేట్స్‌ దేశవ్యాప్తంగా పికప్, ప్యాకింగ్, షిప్పింగ్, డెలివరీ తదితర విభాగాల్లో సేవలు అందించనున్నట్లు అమెజాన్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ (ఆపరేషన్స్‌) అభినవ్‌ సింగ్‌ తెలిపారు. సీజనల్‌ అసోసియేట్స్‌కి కూడా ఇతర ఉద్యోగుల తరహాలోనే భద్రత, సంక్షేమ ప్రయోజనాలను కల్పిస్తున్నట్లు వివరించారు. సాధారణంగా ఈ అసోసియేట్స్‌లో కొందరు పండుగ సీజన్‌ ముగిశాక కూడా తమ సంస్థలోనే కొనసాగుతుంటారని, మిగతావారు మళ్లీ ఏడాది తర్వాత తిరిగి చేరుతుంటారని ఆయన చెప్పారు.  

ఈ–కామర్స్‌ జోరు.. 
సాధారణంగా పండుగ సీజన్‌లో భారీ కొనుగోళ్ల కారణంగా ఈ–కామర్స్, క్విక్‌ కామర్స్‌కి గణనీయంగా డిమాండ్‌ ఉంటుంది. ఎల్రక్టానిక్స్, ఫ్యాషన్, బ్యూటీ, గిఫ్టింగ్, నిత్యావసరాలు, గృహోపకరణాలు మొదలైన వాటి కొనుగోళ్లు పెరుగుతాయి. సౌలభ్యానికి పండుగ ఆఫర్లు కూడా తోడు కావడంతో గత కొన్నేళ్లుగా ఆన్‌లైన్‌ ఆర్డర్లు గణనీయంగా ఉంటున్నాయి. ఇప్పటివరకు ఎక్కువగా ఈ–కామర్స్‌ ప్లాట్‌ఫాంలు దీనితో లబ్ధి పొందుతుండగా, ప్రస్తుతం క్విక్‌ కామర్స్‌ సంస్థలు కూడా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాయి. 

పండుగ సీజన్‌ సందర్భంగా తమ సెల్లర్, లాజిస్టిక్స్‌ వ్యవస్థవ్యాప్తంగా 10 లక్షల పైచిలుకు సీజనల్‌ ఉద్యోగావకాశాలు రానున్నట్లు ఈ–కామర్స్‌ మార్కెట్‌ప్లేస్‌ మీషో ఇటీవల వెల్లడించింది. విక్రేతల నెట్‌వర్క్‌లో దాదాపు 6.5 లక్షలు, లాజిస్టిక్స్‌లో సుమారు 3.75 లక్షల వరకు నియామకాలకు అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. దాదాపు 1.3 లక్షల మంది విక్రేతలు.. ప్యాకేజింగ్, తయారీ, వేర్‌హౌసింగ్, నిల్వల నిర్వహణ మొదలైన అవసరాల కోసం సీజనల్‌ వర్కర్లను పెద్ద ఎత్తున నియమించుకోవచ్చనే అంచనాలు ఉన్నట్లు మీషే తెలిపింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement