న్యూఢిల్లీ: వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఈ–కామర్స్ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. కన్జూమర్ ప్రొటెక్షన్ (ఈ–కామర్స్) రూల్స్ 2020ని సవరించింది. ధరల విషయంలో పారదర్శకత, ప్రాయోజిత లిస్టింగ్స్, సెర్చి ఫలితాలను చూపడంలో అవకతవకలకు పాల్పడటం, డార్క్ ప్యాటర్న్స్ మొదలైన వాటిని కట్టడి చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని వినియోగదారుల వ్యవహారాల విభాగం వెల్లడించింది.
2027 జనవరి 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయని పేర్కొంది. సవరించిన నిబంధనల ప్రకారం ధరల తగ్గింపును ప్రకటించినప్పుడు ‘గత ధర’, ‘తగ్గించిన ధర’ను ఈ–కామర్స్ సంస్థలు వెల్లడించాల్సి ఉంటుంది. డిస్కౌంటు ప్రకటించడానికి ముందు 30 రోజుల వ్యవధిలో ఆ ఉత్పత్తిని విక్రయించిన కనిష్ట రేటును ‘గత ధర’ గా పరిగణిస్తారు.
ఇదీ చదవండి: ఒకప్పుడు తోపు రిచ్.. ఇప్పుడు టాప్ 10 కూడా దక్కలేదు!


