సాక్షి,ముంబై : బాలీవుడ్ నటి అమీషా పటేల్ కుటుంబానికి భారీ ఎదురు దెబ్బ తగిలింది. అమీషా పటేల్ తల్లిదండ్రుల చర్చిగేట్ (ముంబై) నివాసం నుండి , బంగారు, వజ్రాల ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఇంటి పనిమనిషే ఈ చోరీకి పాల్పడినట్టు ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు. నటి తల్లి ఆశా పటేల్ ఫిర్యాదు మేరకు నిందితురాలు సీమా ఘాటేను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
పోలీసుల కథనం ప్రకారం జనవరి 2026లో ఒక గాజు చోరీకి గురైంది. దీనిపై సీమాను అనుమానించిన ఆశా పటేల్, తప్పు ఒప్పుకుని, పోయిన ఆభరణాన్ని తిరిగి ఇచ్చేయాలని ఆమె కోరారు.అయితే, ఆ గాజును తిరిగి ఇవ్వకపోవడంతో, ఆశా పోలీసులను ఆశ్రయించి అధికారికంగా ఫిర్యాదు చేశారు.దీంతో పాలఘర్‌కు చెందిన 40 ఏళ్ల సీమా ఘాటే అనే ఇంటి పనిమనిషిని మెరైన్ డ్రైవ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చోరీకి గురైన ఆభరణాల విలువ రూ 5 లక్షలకు పైమాటే. వీటిల్లో డైమండ్‌గాజులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. గత ఒకటిన్నర సంవత్సరాలుగా ఆ ఇంట్లో గృహ కార్మికురాలిగా పని చేస్తోంది.
ఇదీ చదవండి: కలకలం : భార్య, ముగ్గురు కుమార్తెల్ని హత్య చేసి పరార్
దీనిపై అమీషా పటేల్ తల్లి ఆశా పటేల్, పనిమనిషి ఘాటేపై అనుమానం వ్యక్తం చేస్తూ మెరైన్ డ్రైవ్ పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన పోలీసులు విరార్‌లో ఘాటేను అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి ఎలాంటి రికవరీ చేయలేదు.
నిందితురాలు సీమ నేర చరిత్ర, సహచరులు ప్రాతను పోలీసులు ఎంక్వయిరీ చేస్తున్నారు. మరోవైపు ఆమెకు సెప్టెంబర్ 15 వరకు మూడు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది కోర్టు.
ఇదీ చదవండి: కాబోయే భార్యని ఇంప్రెస్ చేద్దామని, ఏఐతో ఏకంగా..!


