సాక్షి, హైదరాబాద్: బొల్లారం ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మహబూబ్‌నగర్‌లోలో రిటైర్డ్ ఆర్మీ అధికారి ఇంట్లో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతంలో రిటైర్డ్ అధికారి నివాసం ఉంటున్నారు. బుల్లెట్స్ ఇచ్చే అమ్నేషన్ సెక్షన్ ఇంచార్జి సహకారంతో చోరీ చేశారు. ఈ కేసుల కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
చోరీ కేసు వివరాలను డీజీపీ సీవీ ఆనంద్ మీడియాకు వివరించారు. ‘‘బొల్లారంలో ఆర్మీ ఆయుధాలు మిస్ అయ్యాయి. గత నెల 31న చోరీ జరిగింది తాళాలు పగలగొట్టి ఉండటాన్ని అధికారులు గుర్తించి పోలీసులు సమాచారం అందించారు. 7 పిస్టల్, 13 మ్యాగజెన్స్, 4 ఎకే 203 గన్‌లు మిస్ అయ్యాయి. ఒక నైట్ విజన్ బైనాక్యులర్ కూడా దొంగిలించారు. పోలీసులు చాలా వేగంగా స్పందించి దర్యాప్తు చేపట్టారు. లోపల మనుషులు మాత్రమే ఈ దొంగతనం చేయగలరని అంచనా వేశాం. చాలా వేగంగా, లోతుగా దర్యాప్తు చేపట్టాం. ఆయుధాలతో డైరెక్ట్ యాక్సిస్ ఉన్నవారు 16 మందిగా గుర్తించాం
..మిలట్రి ఇంటెలిజన్స్ ఇచ్చిన సమాచారం కూడా మాకు సహాయపడింది. కోపంతో చేశారు? వేరే ఉద్దేశంతో చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టాం. మాఫియాతో లింకులు కూడా దర్యాప్తు చేశాం. గూఢచారి కోణంలో కోణంలో కూడా విచారణ చేశాం. ఫింగర్ ప్రింట్స్ నిపుణులు, డాగ్ స్క్వాడ్‌ను కూడా రంగంలోకి దించాం’’ అని సీవీ ఆనంద్ తెలిపారు.


