రాష్ట్రంలో 30 శాతం కమిషన్‌ ప్రభుత్వం నడుస్తోంది.. కేటీఆర్‌ | KTR says the government is functioning at 30 percent Commission in the state | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో 30 శాతం కమిషన్‌ ప్రభుత్వం నడుస్తోంది.. కేటీఆర్‌

Sep 11 2026 11:39 AM | Updated on Sep 11 2026 12:18 PM

KTR says the government is functioning at 30 percent Commission in the state

సాక్షి, హైదరాబాద్‌: సీఎం రేవంత్‌, రెవెన్యూ మంత్రి కలసి భూదోపిడికి తెగబడుతున్నారని రాష్ట్రంలో గిరిజనుల, అసైన్డ్‌ భూములు మాయమవుతున్నాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. భూముల వివాదంతోనే మంత్రిని బర్తరఫ్‌ చేశారన్నారు. రాష్ట్రంలో 30 శాతం కమిషన్‌ ప్రభుత్వం నడుస్తుందని. సీఎం సొంత నియోజకవర్గంలో భూముల కోసం గిరిజనులపై దాడి చేశారన్నారు. ఈ రోజు శుక్రవారం బీఆర్‌ఎస్‌ భవన్‌లో 22ఏ బాధితులతో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

బీఆర్‌ఎస్‌ హయాంలో భూముల విలువ భారీగా పెరిగిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. 22ఏ అంశంతో కాంగ్రెస్‌ పాలనలో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో భూదోపిడి విచ్చలవిడిగా జరుగుతుందని మంత్రులు దండుపాళ్యం ముఠాలా తయారయ్యారన్నారు. హైదరాబాద్‌ చుట్టూ ఉన్న భూములపై సీఎం రేవంత్ కన్నేశారని మూసీ పేరుతో వేల ఎకరాలు దోచుకున్నారని ఫ్యూచర్‌ సిటీలో సీఎం రేవంత్ ఆయన సోదరుడికి ఐదు ఎకరాల భూమిని కట్టబెట్టారన్నారు. కాంగ్రెస్‌ పాలనలో ప్రతి స్కీమ్‌ వెనుక ఒక స్కామ్‌ ఉంటుందని కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ధ్వజమెత్తారు.

22ఏ వల్ల లక్షలాది మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి హరీష్‌ రావు అన్నారు. 22ఏ పవర్‌ పాయింట్ ప్రజెంటేషన్‌ సందర్భంగా ఓ బాధితుడు 22ఏతో మా స్థలాలకు లోన్లు రాక ఇబ్బందులు పడుతున్నామని కలెక్టర్‌ను కలిసినా సమస్య పరిష్కారం కాలేదన్నామని తమ  ఆవేదనని వెల్లిబుచ్చుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement