కేపీహెచ్‌బీ అంటేనే రాత్రివేళల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందన్న చర్చ కొంతకాలంగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలోనూ దీనిపై జరిగే చర్చ చాలామందికి తెలిసే ఉంటుంది. తాజాగా ఇలాంటి కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. రాత్రివేళల్లో రోడ్డుపై వెళ్లేవారిని ఆకర్షిస్తూ హల్‌చల్ చేస్తున్న పలువురిని కేపీహెచ్‌బీ సెక్టార్ ఎస్‌ఐ మౌనిక లాఠీతో తరిమికొట్టారు.
కేపీహెచ్‌బీ ఫోర్త్ ఫేజ్ సరీ్వస్ రోడ్డు సమీపంలో కొన్ని రోజులుగా ట్రాన్స్‌జెండర్‌లు రాత్రి వేళల్లో ఆగడాలకు పాల్పడుతున్నారు. ఇటీవల వీరిని ఇన్‌స్పెక్టర్ విజయ్‌కుమార్ ఠాణాకు పిలిపించి హెచ్చరించారు. అయినా మార్పు రాలేదు. చెట్ల పొదల వద్ద రాత్రి వేళల్లో రోడ్డుపై వెళ్లేవారిని ఆకర్షిస్తూ హల్‌చల్ సృష్టిస్తున్నారు.
విషయం తెలుసుకున్న సెక్టార్ ఎస్‌ఐ మౌనిక బుధవారం రాత్రి కారులో వచ్చి లాఠీ తీసుకుని చెట్ల పొదల్లోకి రావడంతో ట్రాన్స్‌జెండర్లు పరుగులు పెట్టారు. ఎస్‌ఐ ధైర్యంగా వెళ్లి ట్రాన్స్‌జెండర్లను తరిమి కొట్టడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల పక్కన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని స్థానికులకు ఆమె సూచించారు. పలువురు ట్రాన్స్‌జెండర్లపై కేసులు నమోదు చేశారు.
ఇప్పటికే హెచ్చరించినా తీరు మార్చుకోకపోవడంతో పోలీసులు ఈసారి కఠినంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. రోడ్ల పక్కన, నిర్మానుష్య ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ మౌనిక స్థానికులకు సూచించారు.
At this point, KPHB is starting to look less like a residential area and more like Hyderabad’s unofficial red-light district.⁰How the hell did this happen? 🤦♀️ pic.twitter.com/ISCRPcCXl1
— Shika Reddy (@Shika_Reddy) September 10, 2026


