సాక్షి, హైదరాబాద్: కోల్‌కతా బొగ్గు కుంభకోణానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఈడీ సోదాలు చేపడుతుంది. ఈ రోజు శుక్రవారం ఉదయం కోల్‌కతానుంచి హైదరాబాద్లో ఈడీ ప్రత్యేక బృందాలు చేరుకున్నాయి. హైదరాబాద్‌లోని AMR కంపెనీలో తనిఖీలు చేపడుతుంది. అదే విధంగా టాలీవుడ్‌లో ప్రముఖ ప్రొడ్యూసర్‌గా ఉన్న మహేశ్ రెడ్డి ఇంట్లో సోదాలు చేపడుతుంది. కోల్‌కతా, హైదరాబాద్, జార్ఖండ్‌లలోని ప్రముఖ రాజకీయ నేతలకు ఆయన బినామీగా ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.


