58 ఏళ్ల వయసులో మంగోలియా అధ్యక్షుడి బరువులు ఎత్తే ఫీట్‌..! వీడియో వైరల్‌ | Mongolian President 58 bench presses 100kg for 20 reps Goes Viral | Sakshi
Sakshi News home page

58 ఏళ్ల వయసులో మంగోలియా అధ్యక్షుడి బరువులు ఎత్తే ఫీట్‌..! వీడియో వైరల్‌

Sep 11 2026 4:16 PM | Updated on Sep 11 2026 4:27 PM

Mongolian President 58 bench presses 100kg for 20 reps Goes Viral

మంగోలియా అధ్యక్షుడు ఉఖ్నాగిన్ ఖురెల్సుఖ్  తన అద్భుత వర్కౌట్‌ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించారు. అది కూడా ఎలాంటి జిమ్‌ దుస్తులు లేకుండా ఫార్మల్‌ దుస్తుల్లోనే బరువులు ఎత్తే ఫీట్‌ చేయడం విశేషం. గతంలో ఆర్మీ అధికారిగా పనిచేసిన ఈయన సైనిక విభాగం సందర్శనలో భాగంగా ఈ ఫీట్‌ని చేశారు. అక్కడ ఆయన ఏకంగా వంద కిలోల బరువుని సూట్‌ జాకెట్‌ తొలగించి ఒకటి రెండు సార్లు కాదు ఏకంగా 20సార్లు బెంచ్‌ ప్రెస్‌ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. 

అందుకు సంబంధించిన వీడియో నెట్టింట అమితంగా వైరల్‌ అవ్వడంతో నెటిజన్లంత అధ్యక్షుడి బలం, ఫిట్‌నెస్‌కి ఫిదా అవ్వుతూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆ వైరల్‌ వీడియో ఖరెల్సుఖ్‌ ఫార్మల్ సూట్ ధరించి బరువులు ఎత్తే బెంచ్‌ పక్కన నిలబడం చూడొచ్చు. కాసేపటి తర్వాత తన చుట్టూ ఉన్నవారు చూస్తుండగానే జాకెట్‌ తీసివేసి బెంచ్‌పై పడుకున్నారు. ఆ తర్వాత సుమారు వంద కిలో బెంచ్‌ ప్రెస్‌ చేయడం ‍ప్రారంభిస్తారు. ఎటువంటి ఇబ్బందీ లేకుండా సుమారు 20 రిపిటేషన్లు అత్యంత సునాయాసంగా చేసేశారు'. 

ఆ ఫీట్‌ పూర్తికాగానే అక్కడ ఉన్న అధికారులు, సైనికులతో కరచాలనం చేయడం స్ఫష్టంగా కనిపస్తుంది వీడియోలో. కాగా ఈ మంగోలియా నాయకుడు 2021 నుంచి దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అధ్యక్ష పదవిని చేపట్టడానికి ముందు ప్రధానమంత్రితో సహా పలు కీలక రాజకీయ పదవులను అలంకరించారు. 

అలాగే ఆయనకు బాడీబిల్డింగ్‌, మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యం ఉంది. తన రాజకీయ జీవితాన్ని ప్రారంభిచడానికి ముందు మంగోలియన్‌ పీపుల్స్‌ ఆర్మీలో కూడా పనిచేశారు. అంతేగాదు ఆయనకు సంగీతంలో కూడా ప్రావీణ్యం ఉంది. ఆయన పాల్స్‌ అనే రాక్‌బ్యాండ్‌లో గిటారు వాయిస్తారనేది అధికారిక వర్గాల సమాచారం. 

ఐదుపదులు దాటిన తర్వాత ఇలాంటివి చేయొచ్చా..

58 ఏళ్ల వయసులో బరువుల ఎత్తడం అన్ని విధాల శ్రేయస్కరమని అంటున్నారు. అయితే ప్రమాదకరమైన బరువులు మాత్రం ఎత్తడం మంచిది కాదనే చెబుతున్నారు. ఇలాంటివి చేయాలనుకున్నప్పుడూ.. నిపుణులు పర్యవేక్షణ, సలహాలు, సూచనలతో ఎత్తడం మంచిదని సూచిస్తున్నారు.  

అదీగాక వయసు పెరిగే కొద్దీ సహజంగా శరీరంలో కండరాల ద్రవ్యరాశి, ఎముకల సాంద్రత తగ్గుతాయి. అందువల్ల 50 ఏళ్లు దాటిన వారికి వెయిట్‌ ట్రైనింగ్‌ అత్యంత అవసరం అని నొక్కి చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు

 

(చదవండి: నో స్కూల్‌, నో సిలబస్‌, నో స్క్రీన్‌! ఉత్తరాఖండ్‌ దంపతుల సరికొత్త పేరెంటింగ్‌ పాఠాలు)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement