ప్రధాని మోదీతో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భేటీ | BRICS Summit 2026: Russian President Putin Meets Prime Minister Modi | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీతో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భేటీ

Sep 11 2026 3:47 PM | Updated on Sep 11 2026 4:13 PM

BRICS Summit 2026: Russian President Putin Meets Prime Minister Modi

( ఫైల్‌ ఫోటో )

ఢిల్లీ: రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భారత్‌లో అడుగుపెట్టారు. 18వ బ్రిక్స్‌ సదస్సుకు హాజరయ్యారు. భారత్‌ మండపంలో ఇవాళ(శుక్రవారం) ప్రధాని నరేంద్ర మోదీతో పుతిన్‌ భేటీ అయ్యారు. భారత్‌, రష్యా ద్వైపాక్షిక అంశాలపై చర్చ జరిపారు. కీలక రక్షణ ఒప్పందాలు, రక్షణ, ఇంధనం, సాంకేతిక రంగాల్లో సహకారంపై చర్చించారు. రెండు నెలల్లోనే రెండోసారి మోదీ-పుతిన్‌ భేటీ జరిగింది. పుతిన్‌ మూడు రోజులపాటు ఇక్కడ పర్యటిస్తారు. వార్షిక బ్రిక్స్‌ బిజినెస్‌ ఫోరమ్‌ సర్వసభ్య సమావేశంలో ఆయన ప్రసంగించనున్నారు.

కాగా, బ్రిక్స్‌ సదస్సుకు షీ జిన్‌పింగ్‌ హాజరు కాబోతున్నారని చైనా ప్రభుత్వ మీడియాతోపాటు భారత విదేశాంగ శాఖ నిర్ధారించింది. జిన్‌పింగ్‌ చివరిసారిగా 2019 అక్టోబర్‌లో భారత్‌లో పర్యటించారు. బ్రిక్స్‌–2026 శిఖరాగ్ర సదస్సుకు అంతా సిద్ధం అంటూ ప్రధాని మోదీ సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఈ సదస్సు జరిగే ‘భారత్‌ మండపం’దృశ్యాలు, ఏర్పాట్లతో కూడిన 30 సెకండ్ల వీడియో క్లిప్‌ను సైతం షేర్‌ చేశారు.

ఇదీ చదవండి:
బ్రిక్స్‌తో మనకు లాభాలున్నాయండోయ్‌..!

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement