సాక్షి,హైదరాబాద్: మాజీ మంత్రి కొండా సురేఖ కేబినెట్ బర్తరఫ్, రాష్ట్రంలో వివాదాస్పదంగా మారిన 22-ఏ (22-A) నిబంధన అంశాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. రాష్ట్రంలో అమలవుతున్న 22-ఏ నిబంధన కేవలం ఒక ఆంక్ష మాత్రమే కాదని, కోటి ఎకరాల భూమిని మాయం చేసే ఒక పెద్ద మహా కుంభకోణమని కేటీఆర్ ఆరోపించారు.
22ఏ నిషేధిత భూముల స్కాం పేరుతో నిర్వహించిన ప్రజెంటేషన్ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. ‘కాంగ్రెస్ నాయకులు సామాన్యుల ఆస్తులను టార్గెట్ చేసి భూ దందాలకు పాల్పడుతున్నారు. మంత్రి పదవి నుంచి కొండా సురేఖ తొలగించడానికి 22-ఏ భూముల వివాదమే. ఈ భారీ భూ కుంభకోణంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రధాన సూత్రధారి అని, రెవెన్యూ శాఖ మంత్రి పాత్రధారిగా వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ మంత్రి కేవలం సారీ చెబితే సరిపోదు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి కూడా తన పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
రాష్ట్రంలో సంక్షేమం పక్కనపెట్టి కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, భూ ఆక్రమణలే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున బాధితులకు అండగా నిలబడి ప్రభుత్వాన్ని ఎండగడతామని’ స్పష్టం చేశారు.
👉ఇదీ చదవండి : మంత్రి వర్గం నుంచి కొండా సురేఖ ఔట్


