శ్రీకాకుళం: ఏపీలో జరిగిన డీఎస్సీ అక్రమాలు తవ్వే కొద్దీ ఒక్కొక్కటిగా బయటకొస్తూనే ఉన్నాయని ఆముదాలవలస వైఎస్సార్‌సీపీ సమన్వకర్త చింతాడ రవి విమర్శించారు. సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ చేసిన అక్రమాలే ఎన్నో ఉన్నాయన్నారు. తమ జిల్లాలోనే కూన రవికుమార్ వందల నకిలీ సర్టిఫికెట్లను అమ్ముకుని కోట్ల రూపాయలను సంపాదించడన్నారు.
ఒకవేళ కూన రవి కుమార్ తాను ఏ తప్పూ చేయలేదని నిరూపించుకోవాలంటే తమతో చర్చకు రావాలని డిమాండ్ చేశారు. తాము అడిగే ప్రశ్నలకు కూన రవికుమార్ సమాధానం చెప్పాలని చింతాడ రవి సవాల్ విసిరారు.
డీఎస్సీలో ఈ వెన్నుపోటు పార్టీ చేసిన అక్రమాలు తవ్వే కొద్దే బయటకు వస్తూనే ఉన్నాయన్నారు. పరీక్షలు పెట్టకుండా ఉద్యోగం ఇవ్వడమనేది దేశంలోనే ఇప్పటివరకూ ఎక్కడా జరగలేదని, కానీ ఏపీలో మాత్రం అందుకు అతీతంగా ఉందని విమర్శించారు. డీఎస్సీలో అక్రమాలు జరిగాయి కాబట్టే సీబీఐ విచారణ అంటే ప్రభుత్వం పారిపోతుందని మండిపడ్డారు.
ఇదీ చదవండి:
అమరావతిలో వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం: వడ్డే


