కళ్లల్లో కారం కొట్టి ఎస్‌బీఐలో భారీ చోరీ... వీడియో వైరల్‌ | Nagpur man throws chilli powder during bank robbery then this happens | Sakshi
Sakshi News home page

కళ్లల్లో కారం కొట్టి ఎస్‌బీఐలో భారీ చోరీ... వీడియో వైరల్‌

Sep 11 2026 5:18 PM | Updated on Sep 11 2026 5:49 PM

Nagpur man throws chilli powder during bank robbery then this happens

 రూ. 4 లక్షలతో ఉడాయించిన దుండగుడు

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శాఖలో చోరీ  యత్నం కలకలం రేపింది.   సినీ ఫక్కీలో  బ్యాంక్‌ కస్టమర్‌లా  ఎంట్రీ  ఇచ్చిన ఒక  నిరుద్యోగి క్యాష్‌ కౌంటర్‌ వద్ద గలాటా సృష్టించాడు. బ్యాంక్ సిబ్బంది కళ్లలో కారం చల్లి,  రూ. 4 లక్షల నగదుతో పరారు కావడానికి ప్రయత్నించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డైనాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌ చల్‌ చేస్తోంది.

పోలీసుల సమాచారం ప్రకారం నిందితుడిని 28 ఏళ్ల సూరజ్ భోజ్‌రాజ్ బోర్కర్‌గా గుర్తించారు. ఇతను B.Sc పూర్తి చేసి నిరుద్యోగిగా ఉన్నాడు. సాధారణ వినియోగ దారుడిలా నటిస్తూ బ్యాంక్‌లోకి ప్రవేశించి, క్యాష్ కౌంటర్ వద్దకు చేరుకున్నాడు. అనంతరం ఒక్కసారిగా బ్యాంక్ సిబ్బంది కళ్లలో కారం పొడి చల్లడంతో అక్కడంతా గందరగోళ  పరిస్థితి నెలకొంది. దీంతో  రూ. 4 లక్షల నగదుని తస్కరించి అక్కడినుంచి ఉడాయించాడు. కానీ బ్యాంక్ సిబ్బంది, అక్కడే ఉన్న కొందరు పోలీసులు నిందితుడిని వెంటాడారు. బ్యాంక్‌కు సుమారు కిలోమీటర్ దూరంలో, ఘటన జరిగిన 30 నిమిషాల్లోనే అతడిని పట్టుకున్నారు.

ఇదీ చదవండి: కలకలం : భార్య, ముగ్గురు కుమార్తెల్ని హత్య చేసి పరార్‌
 

 

పోలీసులు అతని వద్ద నుండి దొంగిలించిన రూ. 4 లక్షల పూర్తి మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతను ఉద్యోగం లేకపోవడం వల్లే ఈ దోపిడీకి ఒడిగట్టాడని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేరానికి గల ఖచ్చితమైన కారణాలు, ఇందులో ఇంకెవరి పాత్ర ఉంది అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఇదీ చదవండి: బ‌సంతి పులావ్‌-చేపల ప్రసాదాన్ని స్వీకరించిన బెంగాల్‌ సీఎం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement