నాని హీరోగా వస్తోన్న పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’. ఈ మూవీకి దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి ఏషనాగుల సాంగ్ విడుదల చేశారు. ఈ పాట సినీ ప్రియులను ఓ ఊపు ఊపేస్తోంది. ఈ పాటకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఈ సినిమాను సెప్టెంబరు 24న థియేటర్లలోకి తీసుకున్నట్టు చిత్రబృందం తెలిపింది. విడుదల విషయంలో ఎలాంటి మార్పూ లేదని ఇటీవలే మళ్లీ ప్రకటించింది. అయినప్పటికీ సోషల్ మీడియాలో రిలీజ్ వాయిదా పడుతుందని వార్తలు వస్తూనే ఉన్నాయి.
హాయ్ నాన్న ప్రమోషన్స్‌లో..
ఈ నేపథ్యంలో గతంలో ‘హాయ్ నాన్న’సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నానీ కేసీఆర్ స్టైల్లో మాట్లాడుతూ కాసేపు అలరించాడు. ఇప్పుడీ వీడయో ‘ది ప్యారడైజ్’ మూవీ ఎట్టి పరిస్థితిల్లో అనుకున్న సమయానికే వస్తుందని చెప్తూ అభిమానులు వీడియోను మరోసారి వైరల్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: 80s ఫొటో ట్రెండా బాస్.. అభిమానం కోసం ఈ తప్పులు చేయద్దు..
‘తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయితీ పెట్టాలని ఉంది. అలాంటిది ఏం జరగదిక్కడ. సినిమా పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం లేదు. ఎట్టి పరిస్థితిలో అనుకున్న సమయానికే వస్తుంది. ఆ రోజు థియేటర్ల దగ్గర దావత్ చేసుకోవాలి’ అని నాని కేసీఆర్ స్టైల్లో చెప్పి నవ్వులు పూయించాడు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.
Trailer cut has already been done and it is all set to air.
The news of NO TRAILER is just a speculation. Team hasn't confirmed it yet either. #TheParadise pic.twitter.com/x04iEv8KAX— The Cine Gossips (@TheCineGossips) September 11, 2026


