బాలీవుడ్‌లో ప్రస్తుతం ‘హనుమాన్ అంశ్’ సినిమా పేరు మార్మోగుతోంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, హనుమాన్ భక్తుడు నీమ్ కరోలి బాబా జీవితం, ఆయన బోధనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు విశాల్ చతుర్వేది. ఈ చిత్రం ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకుంది. ఇప్పుడీ సినిమా తెలుగులోనూ విడుదల కానుంది.
‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్ సెప్టెంబరు 18న థియేటర్స్‌లో విడుదల కానుంది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీని సమర్పిస్తున్నారు. కాగా ఈ సినిమాకు సీక్వెల్స్‌గా ‘హనుమాన్ అంశ్2’, ‘హనుమాన్ అంశ్3’ కూడా తీస్తున్నట్లు నిర్మాత నమ్రతా సింగ్ తెలిపారు. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది.


