80s ఫొటో ట్రెండా బాస్‌.. అభిమానం కోసం ఈ తప్పులు చేయద్దు.. | 80s AI Photo Trend Fans Create Vintage Pics With Their Favourite Stars | Sakshi
Sakshi News home page

80s AI Photo Trend: 80s ఫొటో ట్రెండ్‌.. ఈ ఫైల్స్‌తో జాగ్రత్త

Sep 11 2026 3:09 PM | Updated on Sep 11 2026 3:42 PM

80s AI Photo Trend Fans Create Vintage Pics With Their Favourite Stars

సోషల్‌ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా 80s నాటి లుక్స్‌తో ఉన్న ఫొటోలే కనిపిస్తున్నాయి. పాతకాలం నాటి హెయిర్‌స్టైల్‌, డ్రెస్సింగ్‌, ఫిల్మ్‌ కెమెరా లుక్‌తో తమ తమ ఫొటోలను మార్చుకుంటూ నెటిజన్లు తెగ వైరల్‌​ చేస్తున్నారు. అంతేకాకుండా తమ అభిమాన హీరో, హీరోయిన్‌తో కలిసి పక్కపక్కనే ఉన్నట్లుగా ఫొటో క్రియేట్‌ చేసి అభిమానులు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. ఇప్పుడీ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. అయితే ఈ ట్రెండ్‌ ఎంత సరదాగా ఉందో.. అంతే జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

APK ఫైల్స్‌ ఓపెన్‌ చేయద్దు.. 
కొంతమందికి ఈ ఫొటోలు ఎలా చేయాలో తెలియక ప్రామిట్‌ కోసం సోషల్‌మీడియాలోని వ్యక్తులను నమ్మివాళ్ల చేతిలో బలైపోతున్నారట. దీనికి కారణం సైబర్‌ నేరగాళ్లు పంపిన APK ఫైల్స్‌ ఓపెన్‌ చేయడమేనట. ఈ ట్రెడ్‌ క్రేజ్‌ను సైబర్‌ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని పోలీసులు సైతం హెచ్చరిస్తున్నారు. ( లోకేశ్ , అనిరుధ్‌కు అదిరిపోయే గిఫ్ట్.. ఏకంగా BMW కార్లు!)

ఫొటో అప్‌లోడ్‌ చేసే ముందు ఇదీ చూడండి..
AI టూల్స్‌లో ఫొటోలను అప్‌లోడ్‌ చేసేటప్పుడు, అభిమాన హీరోల ఫోటోలు అని వచ్చిన ఫైల్స్‌ ఓపెన్‌ చేసేటప్పుడు అవి నిజమా కాదా అని తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

‘1980ల ట్రెండ్‌ను ఫాలో అవుతున్న నెటిజన్లు సైబర్‌ కేటుగాళ్లు టార్గెట్‌ చేస్తున్నారు. అభిమాన హీరోల ఫొటోలని సోషల్‌ మీడియాలో ఆకర్షణీయమైన ఫేక్‌ యాప్స్‌, ఏపీకే ఫైళ్లను పంపిసూత మోసాలకు పాల్పడుతున్నారు. చాట్‌జీపీటీ పేరుతోనూ నకిలీ యాప్స్‌ ప్రచారం చేస్తున్నారు. అలాంటి యాప్స్‌తో జాగ్రత్తగా ఉండాలి. అనుమానస్పద లింకులు తెరవకూడదు​’ అని తెలంగాణ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇదీ చదవండి: (బిగ్‌బాస్‌ షాలిని జీవితంలో ఇంత విషాదమా?)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement