breaking news
80s AI Photo Trend
-
#80s Trend: టీమిండియా క్రికెటర్లకు బీసీసీఐ సర్ప్రైజ్!
భారత్‌ను ప్రస్తుతం ‘80s’ ట్రెండ్ షేక్ చేస్తోంది. ఇన్స్టాగ్రామ్, ట్విటర్, ఫేస్బుక్, వాట్సాప్ ఇలా ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ చూసుకున్నా ‘80s’ ట్రెండ్ పిచ్చ వైరల్‌గా మారిపోయింది. సెలెబ్రిటీల నుంచి సామాన్యుల దాకా తమకు నచ్చిన ఫొటోను చాట్ జీపీటీకి ఇచ్చి ప్రాంప్ట్ సహాయంతో ‘80s’ ట్రెండ్ ఫొటోలను సృష్టించి స్టేటస్‌లుగా పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఇదే ‘80s’ ట్రెండ్ టీమిండియా క్రికెట్‌కు కూడా పాకింది. తాజాగా బీసీసీఐ తన అధికారిక ఎక్స్ ఖాతాలో టీమిండియా క్రికెటర్ల 80s ట్రెండ్ ఫొటోలను పంచుకుంది. అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్ నేపథ్యంలో రేపటి నుంచి తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న టీమిండియా క్రికెటర్లకు వారి ‘80s’ ఫొటోలను చూపించింది. దీనిపై ఒక్కో క్రికెటర్ ఒక్కోలా రియాక్ట్ అవ్వడం కనిపించింది. Photo Credit: BCCI Twitterముఖ్యంగా అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్, అభిషేక్ వర్మ, వైభవ్ సూర్యవంశీ, అర్షదీప్ సింగ్‌లు తమ ‘80s’ ఫొటోలు చూసుకొని తెగ మురిసిపోయారు. అభిషేక్ శర్మ అయితే అచ్చం హాలీవుడ్ హీరోని తలపించే విధంగా ఉన్నాడంటూ ఇషాన్ కిషన్ ఆటపట్టించడం విశేషం. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. బుమ్రా, సంజూ శాంసన్ ఇలా అందరు క్రికెటర్లు తమ ఫొటోలను గుర్తుపట్టగా.. రవి బిష్ణోయి, యష్ ఠాకూర్లు మాత్రం తమ ఫొటోలను పోల్చుకోలేకపోయారు. Photo Credit: BCCI Twitterమొదట శివమ్ దూబే తన ఫొటో బదులు యశ్ ఠాకూర్‌ను చూపించాడు. అయితే వెంటనే తన ఫొటోను చూపిస్తూ.. ఇందాకా చూపించింది యశ్ ఠాకూర్‌ది అని పేర్కొన్నాడు. ఇక బుమ్రా మాత్రం తన ఫొటోను చూసుకోవడానికి ఇష్టపడలేదు. 2 నిమిషాల 40 సెకన్ల నిడివి ఉన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను తెగ ఊపేస్తోంది. వీలైతే మీరు ఒక లుక్కేయండి.Photo Credit: BCCI Twitterఇక రేపు (ఆదివారం) భారత్, అఫ్గానిస్తాన్‌ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. జట్టు కూర్పు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినప్పటికీ, ఓపెనింగ్ విషయంలోనే మేనేజ్మెంట్ ఎటూ తేల్చుకోలేకపోతుంది. ఓపెనింగ్‌లో వైభవ్ లేదా శాంసన్‌లలో ఎవరిని ఆడిస్తారనేది చూడాలి. విశ్వసనీయ సమాచారం మేరకు వైభవ్‌ను బెంచ్‌కు పరిమితం చేసి శాంసన్‌కు అవకాశమివ్వనున్నట్లు తెలుస్తోంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక కానుంది.Vintage vibes. Priceless reactions. 😂🎥 #TeamIndia takes on the 1980s trend 😉 - By @RajalArora #AFGvIND pic.twitter.com/nSaClHHdyn— BCCI (@BCCI) September 12, 2026ఇదీ చదవండి: ఆసియా గేమ్స్‌కు కొత్త రంగు జెర్సీలో టీమిండియా! -
80s ఫొటో ట్రెండా బాస్.. అభిమానం కోసం ఈ తప్పులు చేయద్దు..
సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా 80s నాటి లుక్స్‌తో ఉన్న ఫొటోలే కనిపిస్తున్నాయి. పాతకాలం నాటి హెయిర్‌స్టైల్, డ్రెస్సింగ్, ఫిల్మ్ కెమెరా లుక్‌తో తమ తమ ఫొటోలను మార్చుకుంటూ నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు. అంతేకాకుండా తమ అభిమాన హీరో, హీరోయిన్‌తో కలిసి పక్కపక్కనే ఉన్నట్లుగా ఫొటో క్రియేట్ చేసి అభిమానులు సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడీ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ట్రెండ్ ఎంత సరదాగా ఉందో.. అంతే జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.APK ఫైల్స్ ఓపెన్ చేయద్దు.. కొంతమందికి ఈ ఫొటోలు ఎలా చేయాలో తెలియక ప్రామిట్ కోసం సోషల్‌మీడియాలోని వ్యక్తులను నమ్మివాళ్ల చేతిలో బలైపోతున్నారట. దీనికి కారణం సైబర్ నేరగాళ్లు పంపిన APK ఫైల్స్ ఓపెన్ చేయడమేనట. ఈ ట్రెడ్ క్రేజ్‌ను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని పోలీసులు సైతం హెచ్చరిస్తున్నారు. ( లోకేశ్ , అనిరుధ్‌కు అదిరిపోయే గిఫ్ట్.. ఏకంగా BMW కార్లు!)ఫొటో అప్లోడ్ చేసే ముందు ఇదీ చూడండి..AI టూల్స్‌లో ఫొటోలను అప్లోడ్ చేసేటప్పుడు, అభిమాన హీరోల ఫోటోలు అని వచ్చిన ఫైల్స్ ఓపెన్ చేసేటప్పుడు అవి నిజమా కాదా అని తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.‘1980ల ట్రెండ్‌ను ఫాలో అవుతున్న నెటిజన్లు సైబర్ కేటుగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. అభిమాన హీరోల ఫొటోలని సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన ఫేక్ యాప్స్, ఏపీకే ఫైళ్లను పంపిసూత మోసాలకు పాల్పడుతున్నారు. చాట్‌జీపీటీ పేరుతోనూ నకిలీ యాప్స్ ప్రచారం చేస్తున్నారు. అలాంటి యాప్స్‌తో జాగ్రత్తగా ఉండాలి. అనుమానస్పద లింకులు తెరవకూడదు’ అని తెలంగాణ పోలీసులు హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: (బిగ్‌బాస్ షాలిని జీవితంలో ఇంత విషాదమా?)


