#80s Trend: టీమిండియా క్రికెటర్లకు బీసీసీఐ సర్‌ప్రైజ్‌! | BCCI Shared-Team India-Cricketers-Reaction-About-80s-Trend Photos | Sakshi
Sakshi News home page

#80s Trend: టీమిండియా క్రికెటర్లకు బీసీసీఐ సర్‌ప్రైజ్‌!

Sep 12 2026 5:11 PM | Updated on Sep 12 2026 5:36 PM

BCCI Shared-Team India-Cricketers-Reaction-About-80s-Trend Photos

Photo Credit: BCCI Twitter

భార‌త్‌ను ప్ర‌స్తుతం ‘80s’ ట్రెండ్ షేక్ చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట‌ర్‌,  ఫేస్‌బుక్‌, వాట్సాప్ ఇలా ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ చూసుకున్నా ‘80s’ ట్రెండ్ పిచ్చ వైర‌ల్‌గా మారిపోయింది. సెలెబ్రిటీల నుంచి సామాన్యుల దాకా త‌మ‌కు న‌చ్చిన ఫొటోను చాట్ జీపీటీకి ఇచ్చి ప్రాంప్ట్ స‌హాయంతో ‘80s’ ట్రెండ్ ఫొటోల‌ను సృష్టించి స్టేట‌స్‌లుగా పెట్టేస్తున్నారు. 

ఇప్పుడు ఇదే ‘80s’ ట్రెండ్ టీమిండియా క్రికెట్‌కు కూడా పాకింది. తాజాగా బీసీసీఐ త‌న అధికారిక ఎక్స్ ఖాతాలో టీమిండియా క్రికెట‌ర్ల 80s ట్రెండ్ ఫొటోల‌ను పంచుకుంది. అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్ నేప‌థ్యంలో రేపటి నుంచి తొలి టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే ఢిల్లీకి చేరుకున్న టీమిండియా క్రికెట‌ర్ల‌కు వారి ‘80s’ ఫొటోల‌ను చూపించింది. దీనిపై ఒక్కో క్రికెట‌ర్ ఒక్కోలా రియాక్ట్ అవ్వ‌డం క‌నిపించింది. 


Photo Credit: BCCI Twitter

ముఖ్యంగా అక్ష‌ర్ ప‌టేల్‌, ఇషాన్ కిష‌న్‌, అభిషేక్ వ‌ర్మ‌, వైభ‌వ్ సూర్య‌వంశీ, అర్ష‌దీప్ సింగ్‌లు త‌మ ‘80s’ ఫొటోలు చూసుకొని తెగ మురిసిపోయారు. అభిషేక్ శ‌ర్మ అయితే అచ్చం హాలీవుడ్ హీరోని త‌ల‌పించే విధంగా ఉన్నాడంటూ ఇషాన్ కిష‌న్ ఆట‌ప‌ట్టించ‌డం విశేషం. కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌. బుమ్రా, సంజూ శాంస‌న్ ఇలా అంద‌రు క్రికెట‌ర్లు త‌మ ఫొటోల‌ను గుర్తుప‌ట్ట‌గా.. ర‌వి బిష్ణోయి, య‌ష్ ఠాకూర్‌లు మాత్రం త‌మ ఫొటోల‌ను పోల్చుకోలేక‌పోయారు. 


Photo Credit: BCCI Twitter

మొద‌ట శివ‌మ్ దూబే త‌న ఫొటో బ‌దులు య‌శ్ ఠాకూర్‌ను చూపించాడు. అయితే వెంట‌నే త‌న ఫొటోను చూపిస్తూ.. ఇందాకా చూపించింది య‌శ్ ఠాకూర్‌ది అని పేర్కొన్నాడు. ఇక బుమ్రా మాత్రం త‌న ఫొటోను చూసుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌లేదు. 2 నిమిషాల 40 సెకన్ల నిడివి ఉన్న వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాను తెగ ఊపేస్తోంది. వీలైతే మీరు ఒక లుక్కేయండి.


Photo Credit: BCCI Twitter

ఇక రేపు (ఆదివారం) భార‌త్, అఫ్గానిస్తాన్‌ల మ‌ధ్య తొలి టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. జ‌ట్టు కూర్పు ఇప్ప‌టికే ఒక అంచ‌నాకు వ‌చ్చిన‌ప్ప‌టికీ, ఓపెనింగ్ విష‌యంలోనే మేనేజ్‌మెంట్ ఎటూ తేల్చుకోలేక‌పోతుంది. ఓపెనింగ్‌లో వైభ‌వ్ లేదా శాంస‌న్‌లలో ఎవ‌రిని ఆడిస్తార‌నేది చూడాలి. 

విశ్వ‌సనీయ స‌మాచారం మేర‌కు వైభ‌వ్‌ను బెంచ్‌కు ప‌రిమితం చేసి శాంస‌న్‌కు అవ‌కాశ‌మివ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అన్ని మ్యాచ్‌ల‌కు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక కానుంది.

ఇదీ చదవండి: ఆసియా గేమ్స్‌కు కొత్త రంగు జెర్సీలో టీమిండియా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement