కోహ్లి కాదు!.. ఇమ్రాన్‌ ఖాన్‌ గొప్ప కెప్టెన్‌: ద్రవిడ్‌ | Dravid Shockingly Snubs Kohli For Imran Khan In Greatest Captain List | Sakshi
Sakshi News home page

కోహ్లి కాదు!.. ఇమ్రాన్‌ ఖాన్‌ గొప్ప కెప్టెన్‌.. టాప్‌లో ఎవరంటే?: ద్రవిడ్‌

Sep 12 2026 3:51 PM | Updated on Sep 12 2026 4:07 PM

Dravid Shockingly Snubs Kohli For Imran Khan In Greatest Captain List

ద్రవిడ్‌తో కోహ్లి (ఫైల్‌ ఫొటో.. PC: BCCI/X)

నవతరం టీమిండియా కెప్టెన్లలో మహేంద్ర సింగ్‌ ధోని తర్వాత.. విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ తమదైన శైలిలో రాణించారు. ధోని 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే వరల్డ్‌కప్‌, 2013 చాంపియన్స్‌ ట్రోఫీ గెలిచి.. భారత్‌కు అత్యధికంగా మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు.

ఇక కోహ్లి సారథిగా ఒక్క ట్రోఫీ కూడా గెలవకపోయినప్పటికీ టెస్టుల్లో టీమిండియాను అత్యుత్తమంగా మొదటి ర్యాంకుకు చేర్చాడు. అంతేకాదు మొట్టమొదటి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ సైకిల్‌లో జట్టును ఫైనల్‌కు చేర్చిన ఘనత కూడా అతడిదే.

మరోవైపు.. రోహిత్‌ శర్మ వన్డే వరల్డ్‌కప్‌-2023లో భారత్‌ను ఫైనల్‌కు చేర్చాడు. ఆ తర్వాత 2024లో టీ20 ప్రపంచకప్‌ గెలవడంతో పాటు 2025 చాంపియన్స్‌ ట్రోఫీలో టీమిండియాను విజేతగా నిలిపాడు. ఇదిలా ఉంటే.. ఆల్‌టైమ్‌ గ్రేట్‌ క్రికెట్‌ కెప్టెన్‌ ఎవరన్న అంశంపై భారత మాజీ సారథి, మాజీ హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు ప్రశ్న ఎదురైంది.

క్రిక్‌ఇన్ఫో ర్యాపిడ్‌ షోలో భాగంగా అత్యుత్తమ కెప్టెన్‌ ఎవరో ఎంచుకోవాలంటూ ఆప్షన్లు ఇవ్వగా.. మిస్టర్‌ డిపెండబుల్‌ ఈ విధంగా బదులిచ్చాడు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజం విరాట్‌ కోహ్లి- పాకిస్తాన్‌కు ఏకైక వరల్డ్‌కప్‌ ట్రోఫీ అందించిన ఇమ్రాన్‌ ఖాన్‌ పేర్లు రాగా.. ద్రవిడ్‌ ఇమ్రాన్‌కే ఓటు వేశాడు. ఓవరాల్‌గా మహేంద్ర సింగ్‌ ధోనిని ద్రవిడ్‌ అత్యుత్తమ కెప్టెన్‌గా ఎంచుకున్నాడు.

1. బెన్‌ స్టోక్స్‌ వర్సెస్‌ స్టీవెన్‌ స్మిత్‌
స్టీవెన్‌ స్మిత్‌

2. స్టీవెన్‌ స్మిత్‌ వర్సెస్‌ కేన్‌ విలియమ్సన్‌
స్టీవెన్‌ స్మిత్‌

3. స్టీవెన్‌ స్మిత్‌ వర్సెస్‌ అర్జున రణతుంగ
స్టీవెన్‌ స్మిత్‌

4. స్టీవెన్‌ స్మిత్‌ వర్సెస్‌ గ్రేమ్‌ స్మిత్‌
స్టీవెన్‌ స్మిత్‌

5. స్టీవెన్‌ స్మిత్‌ వర్సెస్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌
స్టీవెన్‌ స్మిత్‌

6. స్టీవెన్‌ స్మిత్‌ వర్సెస్‌ మైకేల్‌ క్లార్క్‌
స్టీవెన్‌ స్మిత్‌

7. స్టీవెన్‌ స్మిత్‌ వర్సెస్‌ ప్యాట్‌ కమిన్స్‌
స్టీవెన్‌ స్మిత్‌

8. స్టీవెన్‌ స్మిత్‌ వర్సెస్‌ రిక్కీ పాంటింగ్‌
రిక్కీ పాంటింగ్‌

9. రిక్కీ పాంటింగ్‌ వర్సెస్‌ అలెన్‌ బోర్డర్‌
రిక్కీ పాంటింగ్‌

10. రిక్కీ పాంటింగ్‌ వర్సెస్‌ స్టీవ్‌ వా
స్టీవ్‌ వా

11. స్టీవ్‌ వా వర్సెస్‌ విరాట్‌ కోహ్లి
విరాట్‌ కోహ్లి

12. విరాట్‌ కోహ్లి వర్సెస్‌ ఇమ్రాన్‌ ఖాన్‌
ఇమ్రాన్‌ ఖాన్‌

13. ఇమ్రాన్‌ ఖాన్‌ వర్సెస్‌ ఎంఎస్‌ ధోని
ఎంఎస్‌ ధోని

14. ఎంఎస్‌ ధోని వర్సెస్‌ క్లైవ్‌ లాయిడ్‌
ఎంఎస్‌ ధోని

చదవండి: ఏడెకరాల భూమి.. ఫామ్‌ హౌజ్‌.. ఆస్తి విలువ ఎంతంటే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement