source: X
2027 వన్డే ప్రపంచకప్‌కు ఇంకా ఏడాది సమయం ఉన్నా.. టోర్నీపై చర్చ ఇప్పటికే మొదలైంది. మాజీలు, విశ్లేషకులు మెగా టోర్నీపై తమ అంచనాలను, తమతమ ఫేవరెట్ జట్లను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ అజర్ అలీ తన డ్రీమ్ ఎలెవెన్‌ను ప్రకటించాడు.
ఓ దేశం నుంచి ఇద్దరు ఆటగాళ్లకు మాత్రమే అవకాశం ఉండాలనే నిబంధనతో అజర్ అలీ తన జట్టును ఎంచుకున్నాడు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, ట్రావిస్ హెడ్‌ను ఎంపిక చేసిన అతడు.. నంబర్-3లో విరాట్ కోహ్లిని కాదని బాబర్ ఆజమ్‌కు చోటిచ్చాడు.
ఆతర్వాతి స్థానాల్లో హ్యారీ బ్రూక్, డేవిడ్ మిల్లర్, జోస్ బట్లర్, మిచెల్ సాంట్నర్, ప్యాట్ కమిన్స్, మ్యాట్ హెన్రీ, అబ్రార్ అహ్మద్, జస్ప్రీత్ బుమ్రాను ఎంచుకున్నాడు. కెప్టెన్‌గా కమిన్స్‌ను అవకాశం ఇచ్చాడు.
కోహ్లిని కాదని బాబర్‌కు అవకాశం ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏరకంగా చూసినా బాబర్ కోహ్లి కంటే బెటర్ ఆప్షన్ కాదని అభిమానులు అంటున్నారు. నిబంధనను అడ్డు పెట్టుకొని అజర్ కోహ్లిపై అక్కసు తీర్చుకున్నాడని అంటున్నారు. అజర్ గతంలో ఓ సందర్భంలో కోహ్లి కంటే బాబర్ మెరుగైన బ్యాటర్ అన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.
కోహ్లి వర్సెస్ బాబర్
ఏరకంగా చూసినా బాబర్ కంటే చాలా రెట్లు మెరుగైన స్థానంలో ఉన్న కోహ్లి, ప్రపంచకప్ గణాంకాల్లోనూ అతడి కంటే చాలా బెటర్‌గా ఉన్నాడు. కోహ్లి ప్రపంచకప్ టోర్నీల్లో 37 ఇన్నింగ్స్‌ల్లో 59.8 సగటున, 88.2 స్ట్రైక్‌రేట్‌తో, 5 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీల సాయంతో 1795 పరుగులు చేయగా.. బాబర్ ఆజమ్ 17 ఇన్నింగ్స్‌ల్లో 52.9 సగటున, 85.7 స్ట్రైక్‌రేట్‌తో, సెంచరీ, 7 అర్ద సెంచరీల సాయంతో 794 పరుగులు మాత్రమే చేశాడు. ఈ ఒక్క గణాంకాలు కోహ్లి రేంజ్ ఏంటో నిరూపిస్తాయి.
అజర్ అలీ డ్రీమ్ ఎలెవన్
రోహిత్ శర్మ, ట్రావిస్ హెడ్, బాబర్ ఆజమ్, హ్యారీ బ్రూక్, డేవిడ్ మిల్లర్, జోస్ బట్లర్ (wk), మిచెల్ సాంట్నర్, ప్యాట్ కమిన్స్ (c), మ్యాట్ హెన్రీ, అబ్రార్ అహ్మద్, జస్ప్రీత్ బుమ్రా
చదవండి: శుబ్‌మన్ గిల్ సహచరుడి విశ్వరూపం.. కేవలం 22 బంతుల్లోనే


