శుబ్‌మన్‌ గిల్‌ సహచరుడి విశ్వరూపం.. కేవలం 22 బంతుల్లోనే | Sher-E-Punjab T20 League: Fazilka Falcons won by 49 runs | Sakshi
Sakshi News home page

శుబ్‌మన్‌ గిల్‌ సహచరుడి విశ్వరూపం.. కేవలం 22 బంతుల్లోనే

Sep 11 2026 2:01 PM | Updated on Sep 11 2026 2:14 PM

Sher-E-Punjab T20 League: Fazilka Falcons won by 49 runs

PC: Sher-E-Punjab T20 League

షేర్-ఎ-పంజాబ్ టీ20 లీగ్‌లో భాగంగా బఠిండా రాయల్స్‌తో జ‌రిగిన కీల‌క మ్యాచ్‌లో 49 ప‌రుగుల తేడాతో ఫాజిల్కా ఫాల్కన్స్ ఘ‌న విజ‌యం సాధించింది. ఈ విజ‌యంతో ఫాల్క‌న్స్ త‌మ ప్లే ఆశ‌ల‌ను స‌జీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఫాజిల్కా జ‌ట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 244 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది.

స్టార్‌ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ విఫలమైనప్పటికి విహాన్ మల్హోత్రా (29 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 53), ప్రాంశు ప్రతాప్, కెప్టెన్‌ సాన్వీర్ సింగ్(39 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 74) హాఫ్‌ సెంచరీలతో చెలరేగారు. ముఖ్యంగా యువ ఆటగాడు ప్రతాప్‌.. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 22 బంతుల్లోనే 3 ఫోర్లు, 8 సిక్స్‌లతో 64 పరుగులు చేశాడు. బటిండా బౌలర్లలో సుమిత్‌ శర్మ, కాంబోజ్‌, గౌరవ్‌ చౌదరి తలా రెండు వికెట్లు పడగొట్టారు.

అనంతరం బటిండా రాయల్స్‌ పోరాడినప్పటికి ఈ కొండంత లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. బటిండా జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 195 పరుగులకే పరిమితమైంది. యువ ఆటగాడు ఉదయ్‌ సహరన్‌(64), షహబాజ్ సింగ్(66) హాఫ్‌ సెంచరీలతో సత్తాచాటారు. ఫాజిల్కా బౌలర్లలో జాసన్‌ జిందాల్‌, రఘు శర్మ తలా మూడు వికెట్లు పడగొట్టారు.
చదవండి: షెఫాలీ వ‌ర్మ విధ్వంసం.. స్మృతి మంధాన రికార్డు బ్రేక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement