breaking news
Sher-e-Punjab T20 league
-
మయాంక్ మాయాజాలం.. పంజాబ్ టీ20 లీగ్ విజేతగా అమృత్సర్
షేర్-ఎ-పంజాబ్ టీ20 లీగ్ 2026 విజేతగా అమృత్సర్ సూర్మాస్ నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో లూధియానా లయన్స్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొంది టైటిల్‌ను కైవసం చేసుకుంది.టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న అమృత్సర్.. లూధియానా బ్యాటర్లను కట్టడి చేసింది. సూర్మాస్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో లూధియానా భారీ స్కోరు చేయలేకపోయింది. ఒక దశలో లూధియానా జట్టు 86 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది.మయాంక్ మాయాజాలంఅమృత్సర్ బౌలర్లలో లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే అద్భుతంగా బౌలింగ్ చేశాడు. నాలుగు ఓవర్లలో కేవలం 17 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు మిగతా బౌలర్లు కూడా క్రమశిక్షణతో బౌలింగ్ చేయడంతో లూధియానా జట్టు 20 ఓవర్లలో 142 పరుగులకే ఆలౌటైంది.లూధియానా ఇన్నింగ్స్‌లో అభిజిత్ గార్గ్ (37), హరీశ్ కుమార్ (22), మాధవ్ సింగ్ (21) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు.అనంతరం 143 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని అమృత్సర్ సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్ సహజ్ ధవన్ (63) అజేయ అర్ద సెంచరీతో ఆ జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతడికి రాహుల్ కుమార్ (42 నాటౌట్), కెప్టెన్ నమన్ ధిర్ (29) సహకరించారు. టోర్నీ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన నమన్ ధిర్కు (10 మ్యాచ్‌ల్లో 655 పరుగులు, 2 సెంచరీలు) ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు లభించింది. చదవండి: ట్రిపుల్ సెంచరీతో కదంతొక్కిన పాక్ టీ20 కెప్టెన్ -
సన్‌రైజర్స్ ఆటగాడి మహోగ్రరూపం.. 7 ఫోర్లు, 10 సిక్స్‌లతో విధ్వంసం
షేర్-ఈ-పంజాబ్ టీ20 లీగ్‌లో లూధియానా లయన్స్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం మొహాలీ స్టేడియం వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్లో జలంధర్ వారియర్స్‌పై 17 పరుగుల తేడాతో విజయం సాధించిన లూథియనా.. తొలిసారి తుది పోరుకు అర్హత సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ ఆటగాడు, లూథియానా కెప్టెన్ సైల్ ఆరోరా విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. ఈ క్రమంలో ఆరోరా కేవలం 50 బంతుల్లో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మొత్తంగా 56 బంతులు ఎదుర్కొన్న ఆరోరా 7 ఫోర్లు, 10 సిక్స్‌లతో 120 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు మాధవ్ సింగ్(22 బంతుల్లో 42) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.బాస్కర్ మ్యాజిక్‌అనంతరం లక్ష్య చేధనలో జలంధర్ వారియర్స్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. జలంధర్ కెప్టెన్ ప్రభ్‌సిమ్రన్ సింగ్( 35 బంతుల్లో 63 పరుగులు) హాఫ్ సెంచరీ సాధించినప్పటికి తన జట్టును గెలిపించలేకపోయాడు. రైట్ ఆర్మ్ పేసర్ సాహిల్ బాస్కర్ బంతితో మ్యాజిక్ చేశాడు. బాస్కర్ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 16 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు.చదవండి: టీమిండియా నుంచి తీసేశారు.. కట్ చేస్తే! వెస్టిండీస్‌లో?Salil Arora scored Century in Sher E Punjab league Semi Final🧡💪🏻Took his team from 27-3(4.2) to 220-5(20) batting at No. 03 scored 120(56)* pic.twitter.com/C9QMXqVxTY— Neil🔪 (@PsychDominant) September 12, 2026 -
మరోసారి పేట్రేగిపోయిన ముంబై ఇండియన్స్ బ్యాటర్
షేర్ ఏ పంజాబ్ టీ20 లీగ్ 2026లో ముంబై ఇండియన్స్ బ్యాటర్, అమృత్సర్ సూర్మాస్ కెప్టెన్ నమన్ ధిర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ప్రస్తుత ఎడిషన్‌లో ఇప్పటికే రెండు విధ్వంసకర శతకాలు సహా, పలు మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడిన అతడు.. తాజాగా మరోసారి పేట్రేగిపోయాడు.మొహాలీ కింగ్స్‌తో ఇవాళ జరిగిన తొలి సెమీస్ ధిర్ పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. కేవలం 37 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 91 పరుగులు చేసి, తృటిలో సీజన్లో తన మూడో సెంచరీని చేజార్చుకున్నాడు. ధిర్ సునామీ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో ప్రత్యర్ది నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని అమృత్సర్ జట్టు 16.3 ఓవర్లలోనే ఊదేసింది. ఫలితంగా ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ధిర్ ఔటయ్యాక అభయ్ చౌదరి (48 నాటౌట్), రాహుల్ కుమార్ (26 నాటౌట్) అమృత్సర్ను విజయతీరాలకు చేర్చారు.అంతకుముందు మొహాలీ కింగ్స్ నిర్ణీత 20 ఓవరల్లో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఈ జట్టు తరఫున కెప్టెన్ రమన్‌దీప్ సింగ్ (42), అన్మోల్ప్రీత్ సింగ్ (43), హర్‌ప్రీత్ బ్రార్ (32 నాటౌట్), సొహ్రబ్ ధలీవాల్ (26) మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అమృత్సర్ బౌలర్లలో జైప్రతాప్ సింగ్ 3, ఆకాశ్ పాండే 2 వికెట్లతో సత్తా చాటారు. కాగా, ఇవాళ రాత్రి 7 గంటలకు రెండో సెమీఫైనల్ మొదలవుతుంది. లుథియానా లయన్స్, జలంధర్ వారియర్స్ మధ్య జరిగే ఈ మ్యాచ్‌లో విజేత సెప్టెంబర్ 13న జరిగే ఫైనల్స్‌లో అమృత్సర్ జట్టుతో అమీతుమీ తేల్చుకుంటుంది. చదవండి: క్రికెటర్ శ్రీశాంత్ ఇంట తీవ్ర విషాదం -
శుబ్‌మన్ గిల్ సహచరుడి విశ్వరూపం.. కేవలం 22 బంతుల్లోనే
షేర్-ఎ-పంజాబ్ టీ20 లీగ్‌లో భాగంగా బఠిండా రాయల్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 49 పరుగుల తేడాతో ఫాజిల్కా ఫాల్కన్స్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఫాల్కన్స్ తమ ప్లే ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఫాజిల్కా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 244 పరుగుల భారీ స్కోర్ సాధించింది.స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ విఫలమైనప్పటికి విహాన్ మల్హోత్రా (29 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 53), ప్రాంశు ప్రతాప్, కెప్టెన్ సాన్వీర్ సింగ్(39 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 74) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ముఖ్యంగా యువ ఆటగాడు ప్రతాప్.. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 22 బంతుల్లోనే 3 ఫోర్లు, 8 సిక్స్‌లతో 64 పరుగులు చేశాడు. బటిండా బౌలర్లలో సుమిత్ శర్మ, కాంబోజ్, గౌరవ్ చౌదరి తలా రెండు వికెట్లు పడగొట్టారు.అనంతరం బటిండా రాయల్స్ పోరాడినప్పటికి ఈ కొండంత లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. బటిండా జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 195 పరుగులకే పరిమితమైంది. యువ ఆటగాడు ఉదయ్ సహరన్(64), షహబాజ్ సింగ్(66) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. ఫాజిల్కా బౌలర్లలో జాసన్ జిందాల్, రఘు శర్మ తలా మూడు వికెట్లు పడగొట్టారు.చదవండి: షెఫాలీ వర్మ విధ్వంసం.. స్మృతి మంధాన రికార్డు బ్రేక్ -
వీరంగం సృష్టించిన ముంబై ఇండియన్స్ బ్యాటర్
షేర్-ఎ పంజాబ్ టీ20 లీగ్ 2026లో ఐపీఎల్ ఆటగాళ్లు చెలరేగిపోతున్నారు. ఇప్పటికే పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ రెండు విధ్వంసకర శతకాలతో విరుచుకుపడగా.. తాజాగా ముంబై ఇండియన్స్ బ్యాటర్ నమన్ ధిర్ తన రెండో శతకంతో బీభత్సం సృష్టించాడు.ఈ టోర్నీలో అమృత్సర్ సూర్మాస్కు సారథ్యం వహిస్తున్న నమన్.. మోహాలీ కింగ్స్‌తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో శివాలెత్తిపోయాడు. కేవలం 64 బంతుల్లో 16 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో ఏకంగా 173 పరుగులు చేశాడు. నమన్ వీరంగం సృష్టించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సూర్మాస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 279 పరగుల (7 వికెట్ల నష్టానికి) రికార్డు స్కోర్ చేసింది.సూర్మాస్ జట్టులో నమన్ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. జస్ప్రీత్ సింగ్ (41) ఒక్కడే కాస్త పర్వాలేదనిపించాడు. సహజ్ ధవన్ 1, రాహుల్ కుమార్ 13, అభిషేక్ శర్మ 13, అభయ్ చౌదరి 20, ఆకాశ్ పాండే 4 పరుగులు చేసి ఔటయ్యారు. మోహాలీ బౌలర్లలో ఆయుశ్ గోయల్ 4 వికెట్లతో రాణించగా.. హర్‌ప్రీత్ బ్రార్, హర్ష్‌దీప్ సింగ్, తేజ్‌ప్రీత్ సింగ్ తలో వికెట్ తీశారు.కాగా, ఈ టోర్నీలో మరో ఐపీఎల్ ఆటగాడు రమన్‌దీప్ సింగ్ (కేకేఆర్), టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ, భారత వన్డే, టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా సత్తా చాటుతున్నారు. రమన్‌దీప్ సింగ్ 6 మ్యాచ్‌ల్లో 4 మెరుపు అర్ద శతకాలతో చెలరేగగా.. అభిషేక్ శర్మ 2, శుభ్‌మన్ గిల్ ఓ హాఫ్ సెంచరీతో రాణించారు. చదవండి: రెచ్చిపోయిన కేకేఆర్ బ్యాటర్; 9 ఫోర్లు, 5 సిక్సర్లతో విధ్వంసం -
రెచ్చిపోయిన కేకేఆర్ బ్యాటర్; 9 ఫోర్లు, 5 సిక్సర్లతో విధ్వంసం
షేర్-ఇ-పంజాబ్ టీ20 లీగ్‌లో మొహలీ కింగ్స్ వరుస విజయాలతో దుమ్మురేపుతుంది. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ రమన్‌దీప్ సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. తాజాగా సోమవారం లుధియానా లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రమన్‌దీప్ విధ్వంసంతో మొహలీ కింగ్స్ 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లుధియానా లయన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. అర్జున్ రాజ్‌పుత్ (46 బంతుల్లో 78), అభిజిత్ గార్గ్ (48 బంతుల్లో 78) రాణించడంతో లుధియానా భారీ స్కోరు చేసింది. మొహాలీ కింగ్స్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్ 3 వికెట్లు తీయగా, రమన్‌దీప్ సింగ్ 2, ఆయుశ్ గోయల్ ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన మొహాలీ కింగ్స్ సరిగ్గా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసి గెలుపొందింది. రమన్‌దీప్ (35 బంతుల్లో 85; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించగా, అన్మోల్ప్రీత్ సింగ్ (50) అర్థసెంచరీతో రాణించాడు. ఈ ఇద్దరు కలిసి మూడో వికెట్‌కు 41 బంతుల్లోనే 86 పరుగులు జోడించడంతో మొహాలీ విజయం దిశగా పరిగెత్తింది. బౌలింగ్‌లో రెండు వికెట్లు, బ్యాటింగ్‌లో 85 పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్‌తో మెరిసిన రమన్‌దీప్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఆరు మ్యాచ్‌ల్లో మొహలీ కింగ్స్‌కు ఇది నాలుగో విజయం కాగా, పట్టికలో తొలి స్థానంలో కొనసాగుతోంది. 5 మ్యాచ్‌ల్లో మూడు ఓటములతో లుధియానా ఐదో స్థానంలో కొనసాగుతోంది.ఇక రమణ్‌దీప్ విషయానికి వస్తే.. టీమిండియా తరపున కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 2024లో సౌతాఫ్రికా టూర్లో ఆడిన రమణ్‌దీప్‌కు తర్వాత భారత జట్టులో చోటు దక్కలేదు. ఇండియా-ఎ టీమ్‌లో మాత్రం అతడు కీలక సభ్యునిగా ఉన్నాడు. ఇప్పుడు ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్‌లో మరింత మెరుగ్గా రాణించి సీనియర్ జట్టులోకి ఎంట్రీ ఇవ్వాలని ఈ పంజాబ్ ఆల్‌రౌండర్ భావిస్తున్నాడు.85(34) with the bat.🌟2/31 (4) with the ball.🤛Ramandeep Singh owned the game from start to finish. A true all-round Masterclass. 💜🔥 pic.twitter.com/s0HyFEbJcS— Rokte Amar KKR (@Rokte_Amarr_KKR) September 7, 2026Read: కసితీరా బాదిన అభిషేక్.. గిల్‌పై ప్రతీకారం! -
కసితీరా బాదిన అభిషేక్.. గిల్‌పై ప్రతీకారం!
భారత వన్డే కెప్టెన్ శుబ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ టీమిండియా తరఫున ఓపెనింగ్ చేయడంతో పాటు డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం చూశాం. కానీ ప్రస్తుతం ఈ ఇద్దరు పంజాబ్ క్రికెట్ లీగ్‌లో ప్రత్యర్థులుగా మారిపోయారు. షేర్-ఇ- పంజాబ్ టీ20లీగ్‌లో అభిషేక్ శర్మ అమృత్సర్ సూర్మన్స్కు కెప్టెన్‌గా ఉండగా, గిల్ ఫజిల్కా ఫాల్కన్స్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. సోమవారం రాత్రి ఈ రెండు జట్లు తలపడగా, అభిషేక్ శర్మ బౌలింగ్‌ను గిల్ చితక్కొట్టాడు. ఇన్నింగ్స్ 10వ ఓవర్లో అభిషేక్ శర్మ బౌలింగ్‌కు రాగా, అప్పటికే గిల్ 28 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఇక అభిషేక్ బౌలింగ్‌లో తొలి బంతికి సిక్సర్ కొట్టిన గిల్, మూడో బంతిని బౌండరీ, ఐదో బంతిని సిక్సర్‌గా మలిచాడు. దీంతో ఓవర్లో వైడ్ సహా 16 పరుగులు వచ్చాయి. చివరి బంతికి కూడా సిక్సర్ కొట్టి అభిషేక్‌కు సెండాఫ్ ఇవ్వాలనుకున్నప్పటికీ, సీన్ రివర్స్ అయింది. అభిషేక్ వేసిన ఆఖరి బంతిని భారీ షాట్ ఆడే ప్రయత్నంలో గిల్ గాల్లోకి లేపగా, బౌండరీ లైన్ వద్ద ఉన్న నమన్ ధిర్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో గిల్ (35 బంతుల్లో 67) ఇన్నింగ్స్‌కు తెరపడింది. గిల్‌తో పాటు ప్రాన్షు ప్రతాప్ (40), సన్వీర్ సింగ్ (40) రాణించడంతో ఫజిల్కా ఫాల్కన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. అనంతరం అమృత్సర్ ఇన్నింగ్స్ సమయంలో తన వంతు రావడంతో అభిషేక్ రెచ్చిపోయాడు. సహజ్ ధావన్‌తో కలిసి ఓపెనింగ్ ఆరంభించిన అభిషేక్ (15 బంతుల్లోనే 49; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. ఈ దెబ్బకు అమృత్సర్ సూర్మన్స్ 6 ఓవర్లలో 79 పరుగులు చేసింది. అభిషేక్ ఔటైనప్పటికీ, రాహుల్ కుమార్ (35 బంతుల్లో 53 నాటౌట్) అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. మ్యాచ్‌లో గిల్ (67 పరుగులు) టాప్ స్కోరర్‌గా నిలిచినప్పటికీ, అభిషేక్ (49) సుడిగాలి ఇన్నింగ్స్‌తో టీమిండియా కెప్టెన్‌ను డామినేట్ చేశాడు. ఈ విజయంతో అమృత్సర్ సూర్మన్స్ తమ సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.Abhishek Sharma doing what he does best in the latest round of Sher-E-Punjab T20 League 🔥🔥 pic.twitter.com/UoxZsJxbOn— Cricbuzz (@cricbuzz) September 8, 2026SHUBMAN GILL vs ABHISHEK SHARMA 😍- Incredible battle at Sher-E-Punjab T20 league, The quality of the league. pic.twitter.com/LrTXT8cXgt— Johns. (@CricCrazyJohns) September 8, 2026Read: తిలక్ వర్మ జట్టు నుంచి తీసేస్తే.. శతక్కొట్టి ఘాటు కౌంటర్! -
వరుసగా రెండో మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ విధ్వంసం
భారత వన్డే, టెస్ట్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్వరాష్ట్రంలో జరుగుతున్న షేర్ ఎ పంజాబ్ టీ20 లీగ్‌లో చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలోకి ఆలస్యం ఎంట్రీ ఇచ్చిన అతడు, వరుసగా రెండో మ్యాచ్‌లో (ఫాజిల్కా ఫాల్కన్స్ కెప్టెన్) దుమ్మురేపాడు. నిన్న లుథియానా లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 21 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్ సాయంతో 40 పరుగులు చేసిన గిల్.. ఇవాళ అమృత్సర్ సూర్మాస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మరింత రెచ్చిపోయి 35 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 67 పరుగులు చేశాడు. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే.. గిల్ తన టీమిండియా సహచరుడు, బెస్ట్ ఫ్రెండ్ అయిన అభిషేక్ శర్మ (అమృత్సర్ సూర్మాస్ కెప్టెన్) బౌలింగ్‌లో (నమన్ ధిర్కు క్యాచ్ ఇచ్చి) ఔటయ్యాడు. రెగ్యులర్‌గా బ్యాటింగ్‌లో ఓపెనింగ్ చేసే అభిషేక్ ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌లో ఓపెనింగ్ చేశాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన అతడు.. తన కోటా 4 ఓవర్లు పూర్తి చేసి 37 పరుగులకు 2 వికెట్లు తీశాడు. అభిషేక్ గిల్ వికెట్‌తో పాటు అన్షుల్ చౌదరి వికెట్ తీశాడు.ఈ మ్యాచ్‌లో అమృత్సర్ సూర్మాస్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. 13.4 ఓవర్లు ముగిసే సమయానికి ఆ జట్టు 4 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. గిల్ (67), విహాన్ మల్హోత్రా (5), అన్షుల్ చౌదరి (0), ప్రన్షు ప్రతాప్ (40) ఔట్ కాగా.. సన్వీర్ సింగ్ (7), ఎయిష్ రావ్ (0) క్రీజ్‌లో ఉన్నారు. సూర్మాస్ బౌలర్లలో నమన్ ధిర్, సాహిల్ ఖాన్ కూడా తలో వికెట్ తీశారు. కాగా, షేర్ ఎ పంజాబ్ టోర్నీలో గిల్, అభిషేక్‌తో పాటు ప్రభ్‌సిమ్రన్ సింగ్, అర్షదీప్ సింగ్ తదితర టీమిండియా ప్లేయర్లు పాల్గొంటున్నారు. 6 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో ప్రస్తుతం రమన్‌సింగ్ నేతృత్వంలోని మొహాలీ కింగ్స్ టాప్ ప్లేస్‌లో ఉంది. గిల్ సారథ్యంలోని ఫాల్కన్స్ నాలుగులో, అభిషేక్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సూర్మాస్ చివరి స్థానంలో ఉన్నాయి.చదవండి: శుభ్‌మన్ గిల్ మెరుపులు.. ఒక్క పరుగు తేడాతో విజయం -
శుభ్‌మన్ గిల్ మెరుపులు.. ఒక్క పరుగు తేడాతో విజయం
టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్‌మన్ గిల్ షేర్-ఎ-పంజాబ్ టీ20 లీగ్‌ని ఘనంగా ఆరంభించాడు. ఈ టోర్నమెంట్లో ఫాజిల్కా ఫాల్కన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న గిల్.. ఆదివారం మొహాలీ వేదికగా లుధియానా లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఫాల్కన్స్‌కు శుబ్‌మన్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. తన టీమిండియా సహచరుడు, స్టార్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో శుబ్‌మన్ బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 21 బంతులు మాత్రమే ఎదుర్కొన్న గిల్.. 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 40 పరుగులు చేశాడు.ఉత్కంఠ పోరుఅనంతరం 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లుధియానా లయన్స్ విజయానికి కేవలం ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులకే పరిమితమైంది. మాధవ్ పఠానియా (37 నాటౌట్) ఆఖరి వరకు నిలిచి పోరాడినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. చివరి ఓవర్లో లుధియానా గెలుపునకు 19 పరుగులు అవసరం కాగా.. 17 పరుగులు మాత్రమే రాబట్టగలిగింది. మరో ఒక్క పరుగు చేసి ఉంటే ఈ మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసేది. ఫాల్కన్స్ బౌలర్లలో విహాన్ మల్హోత్రా, దత్తా తలా రెండు వికెట్లు చొప్పున తీశారు.చదవండి: ఆ ఒక్కటి జింబాబ్వే కొంపముంచింది; ట్రై సిరీస్ విజేత సౌతాఫ్రికా -
టీమిండియా ప్లేయర్ విధ్వంసం.. 6 ఫోర్లు, 8 సిక్సలతో వీర విహారం
షేర్-ఎ-పంజాబ్ టీ20 లీగ్‌లో మొహాలీ కింగ్స్ మరో సంచలన విజయం సాధించింది. శనివారం మొహాలీ వేదికగా జలంధర్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో మొహాలీ గెలుపొందింది. తొలుత వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 14 ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ చేసిన జలంధర్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. మొహాలీ బ్యాటర్లలో విశ్వనాథ్ సింగ్(40), కెప్టెన్ ప్రభ్సిమ్రాన్ సింగ్(37), హర్జస్ సింగ్(37) రాణించారు. మొహాలీ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్, హర్ష్‌దీప్ సింగ్, తేజ్‌ప్రీత్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.రమణ్‌దీప్ మెరుపులుఅనంతరం లక్ష్య చేధనలో మొహాలీ కింగ్స్ కెప్టెన్ రమణ్‌దీప్ సింగ్ విధ్వంసం సృష్టించాడు. నాలుగో స్దానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రమణ్‌దీప్.. ప్రత్యర్ది బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డాడు. కేవలం 35 బంతుల్లోనే 6 ఫోర్లు, 8 సిక్స్‌లతో 91 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.అతడితో పాటు అన్మోల్ప్రీత్ సింగ్(29 బంతుల్లో 61) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా 178 పరుగుల లక్ష్యాన్ని మొహాలీ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 13 ఓవర్లలో ఊదిపడేసింది. ఈ విజయంతో మొహాలీ కింగ్స్ పాయింట్ల పట్టికలో రెండో స్ధానానికి చేరుకుంది. ఇక రమణ్‌దీప్ విషయానికి వస్తే.. టీమిండియా తరపున కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 2024లో సౌతాఫ్రికా టూర్లో ఆడిన రమణ్‌దీప్‌కు తర్వాత భారత జట్టులో చోటు దక్కలేదు. ఇండియా-ఎ టీమ్‌లో మాత్రం అతడు కీలక సభ్యునిగా ఉన్నాడు. ఇప్పుడు ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్‌లో మరింత మెరుగ్గా రాణించి సీనియర్ జట్టులోకి ఎంట్రీ ఇవ్వాలని ఈ పంజాబ్ ఆల్‌రౌండర్ భావిస్తున్నాడు. -
'లోకల్ ఫైట్'లోకి శుభ్‌మన్ గిల్
టీమిండియా స్టార్ బ్యాటర్, భారత టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ లోకల్ ఫైట్‌లోకి దిగనున్నాడు. తన సొంత రాష్ట్రం పంజాబ్‌లో జరిగే షేర్-ఎ-పంజాబ్ టీ20 లీగ్‌లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నాడు. ఈ టోర్నీలో గిల్ ఫజిల్కా ఫాల్కన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నాడు. సెప్టెంబర్ 5న బటిండా రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో అతడు బరిలోకి దిగే అవకాశం ఉంది. దీని కోసం గిల్ ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.శ్రీలంకతో టెస్ట్ సిరీస్ కారణంగా గిల్ షేర్-ఎ-పంజాబ్ టోర్నీలో తొలి మూడు మ్యాచ్‌లకు అందుబాటులో లేడు. అతని గైర్హాజరీలో సన్వీర్ సింగ్ జట్టుకు నాయకత్వం వహించాడు. అతడి సారథ్యంలో ఫాల్కన్స్ ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి ఆరు జట్ల పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది.షేర్-ఎ-పంజాబ్ టోర్నీలో గిల్‌తో పాటు టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ, పేసర్ అర్ష్‌దీప్ సింగ్, పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్, ముంబై ఇండియన్స్ ఆటగాడు నమన్ ధిర్ తదితర స్టార్లు కూడా ఆడుతున్నారు.టీ20 జట్టులోకి పునరాగమనమే లక్ష్యంభారత టీ20 జట్టులో పునరాగమనమే లక్ష్యంగా గిల్ షేర్-ఎ-పంజాబ్ టోర్నీలో ఆడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది చివరి వరకు గిల్ భారత టీ20 జట్టులో అభిషేక్ శర్మతో కలిసి ఓపెనర్‌గా ఆడాడు. 2025 ఆసియా కప్ గెలిచిన భారత జట్టులోనూ అతడు సభ్యుడిగా ఉన్నాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌ల్లోనూ జట్టులో కొనసాగాడు.అయితే టీ20ల్లో ఆశించిన స్థాయిలో పరుగులు చేయలేకపోవడంతో సెలెక్టర్లు అతడిని జట్టు నుంచి తప్పించారు. అతని స్థానంలో సంజూ శాంసన్‌కు అవకాశం ఇచ్చారు.డిసెంబర్ 2025లో తన 36వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన తర్వాత గిల్ ఇప్పటివరకు టీ20 జట్టులోకి తిరిగి రాలేదు. షేర్-ఎ-పంజాబ్ లీగ్‌లో మంచి ప్రదర్శన చేసి టీమిండియాలోకి పునరాగమనం చేయాలని అతడు పట్టుదలగా ఉన్నట్లు కనిపిస్తోంది. చదవండి: నేడు పాకిస్తాన్‌తో భారత్ ఢీ -
ప్రభ్‌సిమ్రన్ ఊచకోత.. నమన్ ధిర్ సుడిగాలి శతకం వృధా
షేర్-ఏ-పంజాబ్ టీ20 లీగ్‌లో టీమిండియా ఆటగాడు, పంజాబ్ కింగ్స్ విధ్వంసకర ఓపెనర్, జలంధర్ వారియర్స్ కెప్టెన్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అమృత్సర్ సూర్మాస్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 47 బంతుల్లో 14 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో అజేయమైన 125 పరుగులు చేశాడు. ఫలితంగా అతడి జట్టు 265 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 16.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది.భారీ లక్ష్య ఛేదనలో ప్రభ్‌సిమ్రన్ పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. ఎదుర్కొన్న ప్రతి బంతిని కసి తీరా బాదాడు. అతడి ఊచకోత ధాటికి అమృత్సర్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. ప్రభ్‌సిమ్రన్‌కు అన్మోల్ మల్హోత్రా (23 బంతుల్లో 53 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), హర్జస్ సింగ్ టాండన్ (21 బంతుల్లో 42; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), విశ్వనాథ్ సింగ్ (12 బంతుల్లో 31; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా సహకరించారు.అంతకుముందు అమృత్సర్ తరఫున నమన్ ధిర్ కూడా సుడిగాలి శతకం బాదాడు. ధిర్ 56 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 117 పరుగులు చేశాడు. అతడికి కెప్టెన్, టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ (36 బంతుల్లో 82; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) కూడా జతకలవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన అమృత్సర్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. కాగా, దీనికి ముందు మ్యాచ్‌లో కూడా అభిషేక్ శర్మ, నమన్ ధిర్ విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ వారి జట్టు ఓటమిపాలైంది. చదవండి: అభిషేక్ శర్మ తుపాన్ ఇన్నింగ్స్.. కేవలం 26 బంతుల్లోనే -
అభిషేక్ శర్మ తుపాన్ ఇన్నింగ్స్.. కేవలం 26 బంతుల్లోనే
షేర్-ఎ-పంజాబ్ T20 లీగ్ 2026 సీజన్‌ను అభిషేక్ శర్మ సారథ్యంలోని అమృత్సర్ సూర్మాస్ ఓటమితో ఆరంభించింది. ఆదివారం మొహాలీ వేదికగా మొహాలీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అమృత్సర్ 19.5 ఓవర్లలో 258 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కెప్టెన్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన అభిషేక్.. ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 26 బంతుల్లో మాత్రమే ఎదుర్కొన్న అభిషేక్.. 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో 77 పరుగులు చేశాడు. అతడితో పాటు నమన్ ధీర్(22 బంతుల్లో 5 సిక్సర్లు, ఒక ఫోర్‌తో 47), సహజ్ ధావన్(45) రాణించారు. మొహాలీ బౌలర్లలో తేజ్‌ప్రీత్ సింగ్ మూడు వికెట్లు, తన్మయ్ ధరణి, హర్‌ప్రీత్ బ్రార్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.అన్మోల్ సూపర్ సెంచరీఅనంతరం ఈ భారీ లక్ష్య చేధనలో మొహాలీ ఫస్ట్ డౌన్ బ్యాటర్ అన్మోల్ప్రీత్ సింగ్ అద్భుత సెంచరీతో కదం తొక్కాడు. కేవలం 51 బంతుల్లో 10 ఫోర్లు, 12 సిక్స్‌లతో 133 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ రమణ్‌దీప్ సింగ్(40 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 69) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా మొహాలీ జట్టు లక్ష్యాన్ని 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 19.3 ఓవర్లలో చేధించింది.Abhishek Sharma ⚡️Saddi Apni League Sher E Punjab League 💪🏻 pic.twitter.com/CkUVTSty4H— Shreyas_reign_ (@Shreyas_reign_) August 31, 2026


